Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Tracts -- Tract 04 (Peace to You!)
This page in: -- Armenian -- Baoule -- Burmese -- Chinese -- Dagbani? -- Dioula -- English -- French -- German? -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Japanese -- Korean -- Lingala -- Maranao -- Nepali? -- Peul? -- Somali -- Spanish -- Sundanese -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Uzbek -- Yoruba

Previous TractNext Tract

చిన్న పత్రికలు - పంచడము కొరకు బైబిల్ వాక్యములు

చిన్న పత్రిక 4 -- నీకు సమాధానము కలుగునుగాక!


మన బ్రతుకులు చాలా భయంకరమైనవి. దరిద్రము పేదరికము, కలహాలు, గొడవలు , అదేవిధముగా , రాజ్యాలపైనా రాజ్యాలు , జనములపైనా జనములు లేస్తున్నాయి. చాలా మంది వారి నిరీక్షణను కోల్పోతున్నారు.

అయితే క్రీస్తు మన భవిష్యత్ గురించి ఈ విధంగా సెలవిస్తున్నారు "మరియు మీరు యుద్ధములనుగూర్చియు యుద్ధసమాచారములను గూర్చియు వినబోదురు, మీరు కలవర పడకుండ చూచుకొనుడి. ఇవి జరగవలసియున్నవి గాని అంతము రాదు ...." (మత్త 24:6).

భూమి నుంచి సమాధానము తీసివేయబడింది అని పరిశుద్ధ ప్రకటన గ్రంధములో మనము చదువగలము (ప్రకటన 6:4). 2,700 సంవత్సరాల క్రితము దేవుడు యెషయాకు ఈ రకముగా సెలవిశ్చాడు "దుష్టులకు నెమ్మదియుండదని యెహోవా సెలవిచ్చియున్నాడు" (యెషయా 48:22 , 57:21)


చెడ్డ వారు ఎవరు ?

చాలామంది వారికి వారే మేము మంచివాళ్లమని చెప్పుటకుంటుంటారు, వారు చేసిన మంచి పనులవల్ల, లీక మంచి చదువులు చదివిన కారణాలద్వారా మంచివాళ్ళమని చెప్పుకుంటారు. కాబట్టి వారి చెడుతనమును మంచి పనులద్వారా తీర్పుదినమందు తప్పించుకోగలమని అనుకుంటారు. అది వారి భ్రమ మాత్రమే, మనము ఎప్పుడైతే దేవునితో పోల్చుకుంటామో అప్పుడు మనము పడిపోయినవారముగా ఎంచబడతాము. చాలామంది దేవుని ఆజ్ఞను కట్టుబడి లేకున్నపుడు పాపము చేసినవారమవుతాము.

"నరుల చెడు తనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యహోవా చూచి" (ఆది 6 :5).

ప్రవక్తదావీదు "వారందరు దారి తొలగి బొత్తిగా చేసియున్నారు మేలుచేయువారెవరునూ లేరు, ఒక్కడైనను లేరు" (కీర్తన 14:3; రోమియు 3:10-12)

ఈరోజుల్లో చాలామంది బహిరంగంగానే సిగ్గు చెడును కలిగియుంటున్నారు, చేసిన పొరపాటును బట్టి పశ్చాత్తాపము పడరు. మన ప్రపంచము సొదొమ గొమొర్రా మాదిరిగా ఉన్నది, దేవుని ఉగ్రత మన పాపముల మీద ఉంటున్నది అని తెలిసినప్పటికీ మనము అదేవిధముగా ఉంటున్నాము "అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును" ( యాకోబు 4:6)


సమాధానము దేవునిద్వారా కలుగును

కృపాకలిగిన ప్రభువు యెషయాకు బయలుపర్చినది ఏమనగా " మనకు శిశువు పుట్టెను , ఆశ్చర్యకరుడు , ఆలోచనకర్త, సమాధానకర్త , అని వ్రాయబడి యున్నది, అతని రాజ్యమునకు ముగింపు లేదు (యెషయా 9:6-7). ఎప్పుడైతే మరియా కుమారుడైన యేసుజన్మించినప్పుడు పరలోకమందు దూతలు సంతోషముగా ఆనందించారు,"సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక" (లూకా 2:14)

వీటన్నిటినిబట్టి , కొంతమంది మాత్రమే దేవుని ద్వారా కలుగు సమాధానమునకు వారి హృదయద్వారములను తెరిచెదరు. అయినప్పటికీ ఎవరైతే దేవునియందు నమ్మకము విశ్వాసము కలిగి ఉంటారో వారికి దేవుని నిత్యసమాధానము ఎల్లప్పుడు ఉండును.

క్రీస్తు పునరుత్తానుడై లేచినతరువాత, తన శిష్యులకు కనిపించి చెప్పాడు "మీకు సమాధానము కలుగును గాక" (యోహాను 20:19,21,26) ఈ పరిస్థితులలో మరియా కుమారుడైన యేసు , వారికి నిత్యా సమాధానమును, దేవునితో కూడిన సమాధానమును వారికి ఇచ్చెను."నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడినవానిగాను దేవునివలన బాధింపబడినవానిగాను శ్రమనొందినవానిగాను మన్మథానిని ఎంచితిమి.మన అతిక్రమక్రియలనుబట్టి అతడుగాయపరచబడెను మన దోషములనుబట్టి నాలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది." (యెషయా 53:4-6).

క్రీస్తు మనకు ప్రతిగా బాధను అనుభవించి దేవునిద్వారా కలుగు సమాధానమును మనకు అనుగ్రహించెను.

మరియా కుమారుడు తన సమాధానమును బలవంతముగా మనకు రుద్దడము లేదు , లేక దానిని మనలోకి పంపదము లేదు, అయితే నీవు సంతోషముగా తనను అంగీకరించి తాను ఇచ్చే సమాధానమును పొంది అతనికి నీవు కృతజ్ఞత కలిగి ఉండుమని కోరుచున్నాడు.


అంగీకరించు సమాధానము

"శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతిని మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు;మీ హృదయమును కలవరపడనియ్యకుడి,వెరవనియ్యకుడి". అని క్రీస్తు తన శిస్యులను ప్రోత్సహించెను.(యోహాను 14:27)

ఎవరైతే ఆయనయందు నమ్మకము కలిగి ఆయన వాక్యమందు విశ్వాసముంచుదురో వారికి సమాధానకర్తయగు దేవుడు తన శాంతిని అనుగ్రహింస్తున్నాడు, ఎవరైతే దేవుని శాంతిని పొందిఉంటారో వారు "దేవుని కొడుకు" లేదా "దేవుని కుమార్తె" అయి ఉంటారు. "మన ప్రభువైన యేసుక్రీస్తు దేవర దేవునితో సమాధానము కలిగియుందము". అని అపోస్తులుడైన పౌలు చెప్తున్నాడు. (రోమా 5:1)

ఎవరైతే సమాధాన ఆత్మకొరకు విజ్ఞాపన చేసియున్నారో వారందరూ దేవుని శాంతిని పొందియున్నారు. కాబట్టి నీవు కూడా దేవుని వాగ్ధానమును నీ యెడల కూడా నెరవేర్చాలని మిమ్ములను ప్రోత్సహిస్తున్నాము, దేవుడు నీ పట్ల తన వాగ్దానమును నెరవేర్చులాగున నిన్ను నీవే ఆయనకు సమర్పించిన యెడల తన శాంతి చేత నిన్ను నింపు

శాంతిని కలిగించే ఆత్మ నీలో కార్యములను జరిగించి నీ హృదయమును శుధునిగా చేయును. నీ ప్రతి పాపమును కడిగి తన నిత్యా పరిశుద్దాత్మ చేత నిన్ను సర్వసత్యములోనికి నడిపించును.


సమాధాన పరుచువారు ధన్యులు

పరిశుదాత్మ దేవుడు మిమ్ములను , ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము, లోనికి మిమ్ములను నడిపించును. (గల 5:22-23). మీ హృదయము ఈ లక్షణాలు కలిగి ఉండాలని అనుకోదా ? ఎప్పుడైతే నీ హృదయము దేవుని శాంతి చేత నింపబడి ఉండునో అప్పుడు నీ ప్రతి హృదయ ఆశనూ తీర్చబడును.

నీ పరిసరాలనుంచి నిన్ను మార్చుటకు సమాధానకర్తయగు దేవుడు తన శాంతి చేత నీవు నింపబడాలని కోరుకొనుచున్నాడు. ఎవరైతే తన శాంతిని కలిగిఉంటారో వారు ఆ శాంతిని ఇతరులకు కూడా తెలియపరచెదరు, అలాంటి వారు వారి పాపములు క్షమింపబడిఉన్న లాగున ఇతరుల పాపములను కూడా వారు క్షమించెదరు. క్రీస్తు తన శాంతిని నీ కుటుంబములోనికి, నీ పనిలోకి కలుగచేయుటకు సిద్ధముగా ఉన్నాడు. మరియా కుమారుడైన యేసు మన మధ్యలో ఏ విధముగా అయితే తనను తానూ తగ్గించుకున్నాడో అదేవిధముగా మనము కూడా తగ్గించుకొనబడి, గర్వము అనే దానిని వదిలిపెట్టాలి. ఎవరైతే క్రీస్తుని అనుసరించి నడుచుకొందురో వారు క్రీస్తు యొక్క సేవకులై ఉందురు.

అపోస్తులుడైన పౌలు నీ యెడల దేవుని ఆశీర్వాదాలు నీకొరకు పలుకుచున్నాడు "అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తువలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును." (ఫిలిప్పి 4:7).


దేవునియొక్క సమాధానమును పొందుకోవాలనుకుంటున్నావా ?

మీరు దేవుని సమాధానము చేత ఎల్లప్పుడూ నిలిచియుండునట్లు మీకొరకు ఈ పత్రికను మీకు కావాలనుకుంటే పంపుటకు మేము సిద్ధముగా ఉన్నాము.


మీ పొరుగు వారికి ఈ శుభ సందేశమును పంచుకో

క్రీస్తు ఈ వాక్యముచేత తన మాటలను ముగించెను " లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చ్చుకొనుడి . నేను లోకమును జయించి యున్నాననెను". ( యోహాను 16:33).

మీరు ఈ పత్రికద్వారా శాంతిని గూర్చి స్పష్టముగా తెలుసుకొని యితరులకు కూడా దీనిని వివరించాలనుకుంటే మీకొరకు ఈ పత్రికలను మీకు పంపుటకు మేము సిద్ధముగా ఉన్నాము.

మా చిరునామా
WATERS OF LIFE
P.O. BOX 60 05 13
70305 STUTTGART
GERMANY

Internet: www.waters-of-life.net
Internet: www.waters-of-life.org
e-mail: info@waters-of-life.net

www.Waters-of-Life.net

Page last modified on September 20, 2018, at 12:11 PM | powered by PmWiki (pmwiki-2.3.3)