Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- Tracts -- Tract 03 (Bless the Lord, O My Soul!)
This page in: -- Armenian -- Baoule -- Burmese -- Chinese -- Dagbani? -- Dioula -- English -- French -- German? -- Greek -- Hausa -- Hebrew -- Hindi -- Igbo -- Indonesian -- Japanese -- Korean -- Lingala -- Maranao -- Nepali? -- Peul? -- Somali -- Spanish -- Sundanese -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Uzbek -- Yoruba

Previous Tract -- Next Tract

చిన్న పత్రికలు - పంచడము కొరకు బైబిల్ వాక్యములు

చిన్న పత్రిక 3 -- నా ప్రాణమా యెహోవాను సన్నుతించు!


మనుష్యులు బ్రతుకుటకు చాలా కస్టపడి సంపాదించి సరైన జీవితమును కలిగిఉండుటకు తమ సంయమంతటిని వెచ్చించి సుఖమైనా బ్రతుకును అనుభవించుటకు ప్రయత్నించెదరు . అయితే మరియా కుమారుడు ఈ విధముగా మనకు బోధించుచున్నాడు , "ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు ; అతడు ఒకని ద్వేషించియొకని ప్రేమించును; లేదా యొకని పక్షముగానుండి యొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరు." (మత్త 6:24).

దావీదు తనలోని ఆలోచనలన్నిటిని తన మనసుని నిశ్శబ్ద పరచుకొని , దేవునిని ధ్యానించుటకు , దేవుని సన్నిధిని బట్టి భయభక్తి కలిగి , తన సమస్యలన్నిటినీ వదిలేసి దేవుణ్ణి ఆరాధించి ఈ విధముగా మాట్లాడుతున్నాడు : "నా ప్రాణమా, యెహోవాను సన్నుతించు. నా అంతరంగముననున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము, నీ సంకరములన్ని కుదుర్చువాడు, సమాధిలో నీ ప్రాణమును విమోచించుచున్నాడు , కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచు చున్నాడు ." (కీర్త 103:1-4)

పరిష్కారమునకు ఓర్పునకు ఘనపరిచే ప్రార్థన అవసరము . దావీదు దేవునిని ఘనపరిచి మహిమపరచాలని అనుకున్నాడు . పరిశుద్ధాత్ముడు విశ్వాసులయొక్క హృదయమును తెరుచుటకు , వారి ప్రార్థనను దేవుడు ఆలకించుటకు సహాయపడును.

పాత నిబంధన గ్రంధంలో ప్రభువు అను మాట 6,828 సార్లు కనబడును , అలాగే దేవుడు అను మాట 2,600 సార్లు కనబడును ." ప్రభువు" అనగా దేవుడు . మార్పులేనటువంటి నమ్మకమునకు ఈ పేరు సాదృశ్యము. యోగ్యతకు , కృతజ్ఞతకు ఆయన మాత్రమే అర్హుడు , దావీదు చెప్పినట్టు .

అయినప్పటికిని, తన స్వరమును , జ్ఞానమును పగలగొట్టబడియున్నది . అందుకనే ప్రవక్త తన ప్రాణమును యెహోవాను ఘనపరుచుము అని ఆజ్ఞాపిస్తున్నాడు. తన ఆలోచనలును , తన కృతజ్ఞతను దేవుని కొరకై వెచ్చించుటకు నిర్ణయించెను. దావీదు తన ప్రాణము చేత యెహోవాను ఘనపరచుటకు ఇష్టపడెను. దావీదు దేవునిలో పాపము ద్వేషము పాగా కక్ష మోసము లేదని గ్రహించెను. ఎవరైతే దేవుని దగ్గరకు వచ్చెదరో వారు పరిశుద్ధత కలిగి దేవుని చే పరిశీలించబడెదరు, అప్పుడు వారి అపరిశుద్దతను బయటపడును. దావీదు ఆత్మయందు పరిపూర్ణుడై , తన్ను తానూ తగ్గించుకొనబడి పరిశుద్దుడైన దేవుణ్ణి మహిమపరచెను. ఎవరైతే దేవుని తట్టు తిరిగేదరో వారు ఆయనచే పాపవిముక్తి కలిగిఉండెదరు.

దావీదు తన ఆత్మను మూడవసారి ఆజ్ఞాపించెను , ఎందుకనగా ఒకవేళ తన ఆలోచనలు , మనసు , తన నాలుక దేవుణ్ణి ఘనపరచకుండా ధనమువైపు , సమస్యలవైపు , అపాయములవైపు మళ్ళేదవో అని భయపడెను. ప్రభువుల ప్రభువుకును , సృష్టిని తీర్పునిచ్చు దేవునికి మాత్రమే ధ్యానించుటకు నిర్ణయించెను.

తరువాత పరిశుద్ధాత్ముడు దావీదును తన జీవితమంతా దేవునికి కృతజ్ఞతకలిగి నడుచుకొనుటకు సహాయపడెను . అప్పుడప్పుడు మనము కూడా ప్రక్రుతి స్వభావము కలిగి మన ప్రార్థనలకు జవాబు ఇచ్చిన దేవుణ్ణి మరిచిపోతుంటాము. దేవుని యొక్క ఆశీర్వాదాలు మారుచువాటిలో మనము షురులము.

ఈ పత్రికను చదువుతున్న వారికీ విన్నవించడం ఏంటంటే , మీ జీవితంలో దేవుడు చేసిన ఏ కార్యాన్ని కూడా మరువవద్దు , అలాగే మీకు చేసిన ఏ విధమైన ప్రయోజనమును కూడా మరువవద్దు . చల్లని గాలిని బట్టి , నీరుని బట్టి , వర్షాన్ని బట్టి, మంచుని బట్టి, ఆహారమును బట్టి, బట్టలను బట్టి, అలాగే తల్లితండ్రులను బట్టి , అధ్యాపకులను బట్టి, పాఠశాలలను బట్టి, పనులను బట్టి , మరియు మంచి గృహాలను బట్టి , ఆయనను ఎల్లప్పుడూ ఘనపరచండి. ప్రక్రుతి సంబంధించిన అనారోగ్యములనుంచి కాపాడినందుకు అఆయనకు కృతజ్ఞతా స్తుతులు తెలియచేయండి. మీ దేశమును ఆకలినుంచి , భూకంపములనుంచి కాపాడుతున్న దేవునికి కృతజ్ఞతా స్త్రోత్రములు చెల్లించండి. దేవుడు మీ యెడల ఇంకా ఎన్నో మేలులు చేయులాగున మంచి ఆలోచనలు కలిగిఉండండి. మీ హృదయమును దేవునికి ఆనుకొనునట్లు హృదయ శుద్ధి కలిగి ఉండుడి, అప్పుడు దేవుడు మీ హృదయములో నివాసము చేయగలడు .

దావీదు జీవితంలో దేవునికి ఎంతగానో కృతజ్ఞతా కలిగి ఉన్నాడు , దానికి గల కారణం ఏంటంటే, దేవుడు దావీదు యొక్క అన్ని పాపములను క్షమించాడు కాబిట్టి . చాలామంది వారి నేరమును దాచిపెట్టుకొందురు , ఎందుకంటే మాకు ఏమి తెలియదు అని , అయితే దావీదు అన్నట్లు "మనము పాపము లేనివారమని చెప్పుకొనిన యెడల. మనలను మనమే మోసపుచ్చుకొందము. మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల , ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును." (1 యోహాను 1:8-9)

దావీదు దేవుని కృపను అనుభవించాడు కనుక తన ప్రాణమును యెహోవాను సన్నుతించుమని ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు తన అతిక్రమములన్నిటిని బట్టి క్షమించాడు కాబట్టి. ఈవిధమైన క్షమాపణ మనకు ఏ మతములో కూడా దొరకదు. అదేవిధముగా తోరా లో కూడా దొరకదు. దేవుడు మన ఒక పాపమును మాత్రమే క్షమించలేదు అయితే మన అన్ని పాపములను క్షమించి మనలను పరిశుద్ధ పరచి తన కృపతో తన ప్రేమతో మన పాపములన్నిటిని తన రక్తములో కడిగివేసాడు. యేసు తన మృతి ద్వారా మన పాపములన్నిటినుంచి మనలను పవిత్రులనుగా చేసాడు . "ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలము సంపూర్ణులుగా చేసియున్నాడు". (హెబ్రీయులకు 10:14)

ఏదేమైనా దేవుడు ఖచ్చితముగా సెలవిచ్చుచున్నాడు , ఎవరైతే దేవుని క్షమాపణ పొందిఉంటారో వారి యొక్క పాపములు క్షమింపబడిఉంటాయి. (మత్త 6:12). నీకు విరోధి ఉన్నాడా? నీతో నిబంధన చేసుకోలేని వారితో కలిసిఉంటున్నావా ? అయితే వారిని హృదయపూర్వకముగా క్షమించు. లేనిచో దేవుని కృపాకలిగిన పాప క్షమాపణను నీవు పొందుకోలేవు. నీ విరోధిని ప్రేమించే మనసు కావాలని దేవుణ్ణి అడిగినట్లైతే ఆ దేవుడు నీకు ఆ విధమైన మనసును దయచేయగలడు . (మత్త 6:14)

దావీదు యొక్క పాపములన్ని క్షమించ బడిన తరువాత పరిశుద్దాత్మ దేవుడు తన ఆరోగ్యము చాలా ప్రాముఖ్యమని తెలియజేసెను. తన ఆరోగ్యమును బప్పటి దావీదు దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసెను , ఎన్ని మారులు మనము మన ఆరోగ్యవిషయములో ఆందోళనకరంగా ఉంటాము, అయితే దేవుడు తన మహా కృపను బట్టి మనలను అనేక మారులు స్వస్థపరచియున్నాడు. మందుల ద్వారా , వైద్యుల ద్వారా మనకు స్వస్థత కలగలేదు అయితే దేవుడే మనలను స్వస్థపరచుచున్నాడు, కనుకనే దేవుడు అంటున్నాడు , "స్వస్థపరచు యెహోవాను నేనే," (నిర్గమ 15:26 ).

మరియా కుమారుడు , రోగులను స్వస్థ పరిచి , దయ్యములు పట్టిన వారిని విడిపించి తన వాగ్దానములన్నిటిని నెరవేర్చెను. స్వస్థపరచు దేవుడు మందులను వైద్యులను ఉపయోగించినప్పటికిని , నిజమైన స్వస్థత అనుమతి కేవలము ఆయన ద్వారానే కలుగజేసెను. అయితే నీ కృతజ్ఞతా ఎక్కడ ? నిన్ను సృష్టించిన నీ సృష్టికర్తను మరువకు ఎందుకంటే ఆయనే నీకు సంపదను దయచేసి నీకు స్వస్థతను అనుగ్రహించెను .

దావీదు చనిపోవుటకు సిద్ధపడ్డాడు , ఎందుకంటే ఒకదినము దేవుని ముందర ముఖాముఖీ గా నిలబడవలసి ఉన్నది గనుక , దావీదు దేవుని యెడల భయముకలిగి ఉండెను . అయినప్పటికీ దేవుడు దావీదును సమాధి నుచి కాపాడినాడు, దావీదు యొక్క నీతిని బట్టి కాదు అయితే దావీదు దేవుని యందు నమ్మికఉంచాడు కాబట్టి దేవుడు దావీదును కాపాడి ఉన్నాడు. ఎవరైతే క్రీస్తు యందు నమ్మకముంచెదరో వారిని దేవుడు బ్రతికిస్తాడు. "అందుకు యేసు పునరుతానమును జీవమును నేనే ; నాయందు విశ్వాసముంచువాడు చని పోయినను బ్రదుకును. బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా?" (యోహాను 11:25-26)

మరియా కుమారుడు మృతిని జయించి లేచి , సమాధిని గెలిచి , సాతానుని జయించి తన నిత్యజీవమును ప్రకటించెను . ఆలాగుననే ఎవరైతే ఆయనయందు విశ్వాసము నమ్మకము కలిగి ఉండెదరో వారిని కూడా నిత్యజీవములోనికి నడిపించును.

పరిశుద్దాత్మ దేవుడు దావీదునకు ఈ విధంగా తెలియజేస్తుంది , లోకములో ఉండు బంగారు , వజ్రాలతో పొదిగినటువంటి కిరీటము కాదు శ్రేష్టము , అయితే దేవుడిచ్చు కిరీటము ఎల్లప్పుడూ ప్రకాశించును . ఎవరైతే దేవుని కృపను పొందుకుంటారో వారు దీనులపట్ల, దిక్కులేనివారు పట్ల , సహాయము కొరకు ఎదురుచూస్తున్న వారి పట్ల కనికరము కలిగి ఉంటారు , వారికి దేవుని కిరీటము బహుకరించబడును. నీకు కూడా దేవుని కిరీటము కావాలనుకొంటున్నావా ? నీ హృదయము ఇంకా రాతి గుండె మాదిరి ఉన్నదా ? లేక శ్రమలను శ్రమించుటకు కన్నీళ్లు పెట్టుటకు నీ హృదయము సిద్ధంగా ఉన్నదా ? అయితే దేవుడు నీ లాంటి వారిపట్ల కనికరం పడి నీ పొరుగువారికి నీ మిత్రులకును అదేవిధముగా తప్పిపోయిన వారిపట్ల కృప చూపుటకు సిద్ధముగా ఉన్నాడు.

కనపడని కిరీటము కలిగిన దేవుని సేవకులున్నారు , వారికొరకు ఎంతోమంది ప్రార్థించారు, సహాయపడ్డారు , అదేవిధముగా క్రీస్తు కూడా ఈ విధముగా తెలుపుచున్నాడు. "అలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకు వచ్చేనని చెప్పెను ." (మత్త 20:28). క్రీస్తు మన మార్గము మన ఉదాహరణ అయి ఉంది తన శక్తి చేత తన ధైర్యము చేత మనలను నింపి తనను సేవించుటకు తగిన బలమును దయచేసియున్నాడు.

ప్రియా చదువరి,
నీ హృదయమును బండవాలె మార్చు ధనమును మరియు మంచి ర్యాన్కు రావాలని ఎదురుచూస్తున్నావా ? లేక పరిశుద్దాత్మ దేవుడు నీకు కృపాకలిగిన జాలికలిగిన మనసును కలిగివున్నట్లు నీ హృదయమును మార్చియున్నాడా , ఒక కనబడని కిరీటమును ధరించినట్లు ఉన్నావా? కీర్త ౧౦౩ ని ధ్యానించి, దేవునికి నిత్యమూ కృతజ్ఞతా కలిగి ఉన్నాట్లు నిన్ను నీవే మార్చుకొని దేవుని తట్టు నీ హృదయమును తిప్పుకొనుము . నిన్ను నీవు తగ్గించు కొని దేవునికి కృతజ్ఞతకలిగి ఉండు.

నీవు దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించులాగున ,క్రీస్తు సువార్తలను మీకు పంపుటకు మేము సిద్ధముగా ఉన్నాము ,

ఇతరులను ఉత్తేజపరిచి ఆయనను సేవించుటకు : నీకు ఈ కారపత్రము దొరికినట్లైతే , నీదగ్గరే పెట్టుకోక ఇతరులకు కూడా సహాయపడునట్లు వారికి కూడా వివరించు, అప్పుడు వారు కూడా దేవుని సేవకులై ఉండెదరు. మాకు వ్రాసినట్లైతే మీకు ఈ కరపత్రములు పంపుటకు సిద్ధముగా ఉన్నాము.

మీ కొరకు ప్రార్థిస్తూ , మమ్ములను మీ ప్రార్థనలో జ్ఞాపకముంచుమని మనవిచేస్తున్నాము. దయచేసి మీ చిరునామా వ్రాయుట మరువవద్దు .

మా చిరునామా
WATERS OF LIFE
P.O. BOX 60 05 13
70305 STUTTGART
GERMANY

Internet: www.waters-of-life.net
Internet: www.waters-of-life.org
e-mail: info@waters-of-life.net

www.Waters-of-Life.net

Page last modified on September 20, 2018, at 01:15 PM | powered by PmWiki (pmwiki-2.3.3)