Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 126 (Miraculous catch of fishes)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 4 - చీకటిని వెలుగు జయించుట (యోహాను 18:1 – 21:25)
B - యేసు పునరుత్తనము మరియు ప్రత్యక్షము (యోహాను 20:1 – 21:25)
5. చెరువు దగ్గర యేసు ప్రత్యక్షమగుట (యోహాను21:1-25)

a) అద్భుతముగా చేపలు పట్టుట (యోహాను21:1-14)


యోహాను 21:1-3
1 అటుతరువాత యేసు తిబెరియ సముద్రతీరమున శిష్యులకు మరల తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేదనగా 2 సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అనుఊరివాడగు నతనయేలును,జెబెదయి కుమారులును, ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి యుండిరి. 3 సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారుమేమును నీతో కూడ వచ్చెదమనిరి. వారు వెళ్లి దోనె ఎక్కిరి కాని ఆ రాత్రి యేమియు పట్టలేదు.

యేసు పునరుత్థానుడై తిరిగి లేచిన తరువాత తన శిష్యులను తమ సొంత ఇన్లకు వెళ్లుమని చెప్పెను. ఒక మంచి కాపరిగా వారిని కలుసుకొని వారికి తన ప్రేమను పంచాడు, అయితే దానికంటే ఎక్కువగా వారికి త్వరలో ప్రత్యక్షమై వారిలో ఉన్న భయమును తీసివేయును. అందుకే ఆదివారము సాయంత్రము యేసు వారికి సమాధానము కలుగును గాక అని సెలవిచ్చి వారిని ఈ లోకమునకు సువార్తను పంచుటకు పంపెను (మార్కు 16:7 ; మత్తయి 28:10).

యేసు యొక్క ఆజ్ఞను తన శిష్యులు స్వీకరించారా ? యేసు యొక్క పునరుత్థానము వారిని మర్చి ఈ లోకమునకు నిత్యజీవము ఇచ్చుననే వాక్యమును వారు చెప్పగలరా ? అయితే లేదు. ఎందుకంటె వారు ఒకరికి ఒకరు వేరుపరచబడి మరియు గుంపులు గుంపులుగా ఉండి చేపలు పట్టుటలో నిమగ్నమయిరి.

ఒక సాయంత్రము పేతురు తన స్నేహితులతో " నేను చేపలు పెట్టుటకు వెళ్లెదను" అంబి చెప్పాడు. వారు అతనిని వెంబడించుట వారి ఇష్టము అని వారిని వదిలి వెళ్లెను. అయితే వారు కూడా అతనితో సముద్రము గట్టున ఉన్న ఓడలోకి ప్రవేశించి సముద్రము మధ్యన చేపలు పెట్టుటకు వెళ్లిరి. వారు ఆ రాత్రి అంత కూడా చేపలు పెట్టుటకు వాలా వేసిరి అయితే ఒక్కటి కూడా పట్టలేక పోయిరి. " నేను లేక మీరు ఏమి చేయలేరు " అనే యేసు చెప్పిన మాటలు మరచి పోయిరి.

యోహాను 21:4-6
4 సూర్యోదయమగుచుండగా యేసు దరిని నిలిచెను, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. 5 యేసు పిల్లలారా, భోజనమునకు మీయొద్ద ఏమైన ఉన్నదా? అని వారిని అడుగగా, 6 లేదని వారాయనతో చెప్పిరి. అప్పుడాయనదోనె కుడిప్రక్కను వల వేయుడి మీకు దొరుకునని చెప్పెను గనుక వారాలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి.

యేసు వారు చిన్న త్రోవలో ఉన్నప్పటికీ వారిని విడిచిపెట్టలేదు. అయితే ఆ సముద్రపు అంచున నిలుచుంది వారు తిరిగి వెనక్కు వచ్చుట కొరకు ఎదురు చూసేను. అతను వారి వలల్లోనికి చేపలను వేయవచ్చు అయితే వారికి ఒక పాఠము నేర్పించాలని మరియు వారు జయము కలిగిన జీవితమును ఎలా పొందుకోవాలో అని చెప్పుటకు ఉద్దేశించెను. అయితే వారు అతనితో ఒక నిబంధన కలిగి ఉండిరి, అతను క్రీస్తు అని వారు తెలియక అతనిని వారు ఒక భాగస్వామిగా చేసుకొనిరి.

అతను తనను వెంబడించు వారిని అపొస్తలులుగా పిలువలేదు, అయితే యవ్వనులుగా లేక పిల్లలుగా పిలిచెను. వారు అతనిని పూర్తిగా మరిచి పోయిరి మరియు అతని మాటలను కూడా మరచిపోయిరి. అయితే యేసు వారిని క్షమించి వారికి ఆహారము ఇమ్మని అడిగెను. వారు క్రీస్తు లేకుండా చేపలు పట్టలేరని చెప్పవలసి ఉండెను అందుకే వారికి చేపలు దొరకలేదు, కనుక దేవుడు వారితో ఉండలేదు. వారు వారి పొరపాటులను ఒప్పుకొనిరి.

దినము గడిచినప్పుడు యేసు వారి దగ్గరకు వచ్చెను;అది వారికి ఒక క్రొత్త నిరీక్షణ వచ్చినట్లుగా ఉండెను. " మీరు విఫలమైనందుకు ఏమి అనుకొనవద్దు" అని చెప్పలేదు, లేక " మీరు తిరిగి ప్రయత్నిస్తే సాధించగలరు" అని చెప్పలేదు, అయితే మీ వలలను కుడివైపునకు వేసినట్లయితే మీరు కొన్ని పట్టుకోగలరని" చెప్పెను. వారు ఆ నదిలో దూరముగా లేరు, అయితే చాలదగ్గరలో ఉండి పెద్ద చేపలను పట్టుకొనిరి .

ఈ దినాలలో మనుషులు క్రీస్తు కొరకు ఎదురుచూచుట ఏవిధముగా అతనికి తెలుసునో అదేవిధముగా ఆ సముద్రములో చేపలు ఎక్కడ ఉన్నాయో తెలిసెను. కనుక అతను నిన్ను అక్కడికి పంపును. " మీ వలలతో ప్రతి దానిని పట్టుకో" అని చెప్పలేదు, అయితే " నేను ఎక్కడైతే వేయమంటానో అక్కడ మీ సువార్త వాలా వేయుము, అప్పుడు నా మాటల కార్యము చూసెదరు. "

వారు యేసు మాటలు వినినప్పటికీ అతనిని ఇంకానో వేరే వ్యక్తి అని అనుకొనిరి తప్ప యేసు అని అనుకొనలేదు. ఒకవేళ అతను ఒక సామాన్యమైన మాట వాడి ఉండవచ్చు అయితే అందులో గొప్ప మర్మము ఉన్నది. కనుక వారు వారి వలలను తిరిగి ఆ నీళ్లలో వేసినప్పుడు ఆ వలలో ఎన్నో చేపలు పాడుతా వారు చూసిరి. వారు తమ వలలను మోయలేనంతగా వారికి చేపలు పడెను, అంటే క్రీస్తు మీ కొరకు ఎన్నో ఆత్మలను సిద్దము చేసి ఉంటాడు కనుక మీరు వారి యెడల నిజమైన ప్రేమ భావము కలిగి ఉండాలి.

ప్రార్థన: ప్రభువా మేము మా స్వార్థ ఆలోచనలచేత కాక మీ యందు ఆధారపడి మా అనుదిన జీవితములో నీ క్షమాపణ కలిగి ఉన్నట్లుగా చేయుము. మేము తప్పి పోయినప్పుడు కూడా మా కొరకు వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. మమ్ములను మా విఫలములను ఒప్పుకొనుటకు నడిపించు. నీ సొంత వారీగా ఉండునట్లు మాకు నేర్పుము అప్పుడు అనేకులు మిమ్ములను తెలుసుకొని ఎప్పటికీ నీవారుగా ఉండెదరు.

ప్రశ్న:

  1. శిష్యులకు ఎందుకు సిగ్గుగా అనిపించింది ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 12:43 PM | powered by PmWiki (pmwiki-2.3.3)