Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 118 (Jesus appears to Mary Magdalene)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 4 - చీకటిని వెలుగు జయించుట (యోహాను 18:1 – 21:25)
B - యేసు పునరుత్తనము మరియు ప్రత్యక్షము (యోహాను 20:1 - 21:25)
1. పస్కా పండుగలో జరిగిన కార్యములు (ఈస్టర్) (యోహాను 20:1-10)

c) మగ్దలేనే మరియు యేసు ప్రత్యక్షమగుట (యోహాను 20:11-18)


యోహాను 20:17-18
17 యేసు ఆమెతో నేను ఇంకను తండ్రియొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు; అయితే నా సహోదరులయొద్దకు వెళ్లినా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవు చున్నానని వారితో చెప్పుమనెను. 18 మగ్దలేనే మరియ వచ్చినేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియజేసెను.

అక్కడ చాలామంది యేసును చూసిన తరువాత అతని ముందర సాగిలపడి అతడి పాదములను ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నించి అతడిని వదలకుండా ఉండిరి. ఎందుకంటె అతని ప్రేమ ఎంతో గొప్పది కాబట్టి వారు యేసును వదలక ఉండిరి. ఆమె విశ్వాసము బలపరచబడి పరిశుద్ధాత్మలో ఉండునట్లు మరియు విశ్వాస ఐక్యతలో ఉండునట్లు నడిపించెను. ఈవిధముగా ఇంతకు ముందే యేసు సిలువ మరణమును పొందుటకు మునుపు తన శిష్యులతోఁ చేసెను. కనుక అతడిని పెట్టుకొనుట లేక అతడిని ముట్టుకొనుట అనునది విశ్వాసమునకు ఒక సూచనగా ఉంది ఆత్మీయముగా బలపరచబడుటకు ఒక అవకాశముగా ఉండెను.

యేసు ఆమెకు తన మరణము తరువాత ఈ భూమి మీద ఉండనని చెప్పెను; అతని ప్రత్యక్షత చివరి దినములలో పరలోకమునకు వెళ్లునప్పుడు కనపడునని చెప్పెను. అతని గురి అతని తండ్రి దగ్గరకు తిరిగి వెళ్లడమే. కనుకనే ప్రధాన యాజకుడు పరిశుద్దుడైన వాని రక్తమును ఒక త్యాగముగా చిందించెనని చెప్పేను. అందుకు మరియాతో, " నన్ను గూర్చి ఏడ్వకు , ఎందుకంటె నేను నీతిని జరిగించాలి; నేను ఆత్మ ద్వారా మీతో మాటలాడెదను" అని చెప్పెను.

అతని మాటలు అర్థము చేసుకొంటే అతను కేవలము ఆమెకు మాత్రమే చెందినవాడు కాదు, అయితే మనుషులందరికి చెందినవాడు, " కనుక మీరు శిష్యుల దగ్గరకు వెళ్లి నా ప్రత్యక్షతను గూర్చి తెలియపరచి నా ఉద్దేశమును వివరించుడి!" అని చెప్పెను .

యేసు ఈ సమాచారమును మరియ ద్వారా తన శిష్యులను ఓదార్చుటకు పంపెను. అందుకే వారిని అతను సహోదరులు అని పిలిచెను. విశ్వాసముచేత మనము అతనికి సహోదరులుగా , సహోదరీలుగా, అతని సిలువ, పునరుత్థాన మరియు జీవము ద్వారా పిలువబడినాము. అతను మనలను ప్రియులు అని పిలువక, సహోదరులు అని పిలిచాడు. రక్షణ నెరవేర్చబడినది కనుక మనము యేసుకు సంబంధించిన వారము. అతని రక్తము చేత మనము అతని కుమారులుగా చేయబడినాము.

మరియ ద్వారా యేసు శిష్యులకు ఏ ప్రకటనలను పంపెను ? మొదటిది, అతను తిరిగి లేచెనని. ఆమె అతనితో కలుసుకున్నాడు ఒక చరిత్రగా నిలిచెను. రెండవది, అతని తండ్రి కూడా మనవాడే; ఈ వాగ్దానము చేత యేసు తన శిష్యులను తన సత్యమైన సహవాసములోనికి నడిపించెను. అతను తన తండ్రి గురించి ఒక గొప్పవాడిగా లేక తీర్పు తీర్చువాడుగా పరిచయము చేయలేదు , అయితే ప్రేమ కలిగిన వానిగా వారికి పరిచయము చేసెను. కనుక అతను కేవలము యేసు తండ్రి మాత్రమే కాదు, అయితే మనందరి తండ్రి కూడా ఆయనే. అందుకే అతను " నా దేవుడు " అని తన తండ్రిని పిలిచెను అనగా అతను సర్వస్వము అని అర్థము. ఈ సృష్టి అంత కూడా పాపము చేత దేవునికి విఱుద్దముగా ఉండగా కేవలము క్రీస్తు మాత్రమే తన తండ్రికి నమ్మకము కలిగి ఉండెను. అతను మన మునుపటి పాపములను బట్టి మన శత్రువు కాదు , అయితే తన సిలువ మరణము చేత మనలను ప్రేమించిన రక్షకుడై ఉన్నాడు. అతను ఏవిధముగా అయితే ఐక్యత కలిగి ఉన్నదో అదేమాదిరి మనము కూడా ఒకరినొకరం ఐక్యత కలిగి అతని పరిశుద్దాత్మ ద్వారా నింపబడి అతను మనకు చూపిన ప్రేమను కలిగి మనము కూడా ఇతరుల యెడల ప్రేమను చూపే వారీగా ఉండాలని కోరుకొంటున్నాడు.

యేసు తన వాగ్దానమును ఎవరైతే అతనిని చూసారో ఆమె పెదవుల మీద అతను మూర్తిని గెలిచి తిరిగి లేచిన తరువాత పెట్టెను. ఆమె యేసుకు లోబడి అతని పాదముల చెంత ఆనందముగా ఉండెను, అయితే అపొస్తలుల దగ్గరకు పరిగెత్తుకుని వెళ్లి ఆమె చూసినది చెప్పుటకు ఇష్టపడి వెళ్లెను. ఈ వాక్యము మన హృదయములలో ఒక గొప్ప బూర ధ్వనిగా ఉంది మన బాధలలోనుంచి మనకు నెమ్మదిని ఇచ్చునట్లు గా ఉన్నది. ఆ ఆనందము మరియు దేవుని అంగీకారము నీకు కూడా వచ్చినదా ? యేసు తిరిగి లేచాడని మరియ చెప్పినట్లు అది నీకు మొదటి చాటి చెప్పినట్లుగా అంగీకరిస్తున్నావా?

ప్రార్థన: ప్రభువా మృతిని గెలిచి తిరిగి లేచి పునరుత్థానుడై మా మధ్యలో నీ సన్నిధిని ఉంచి మమ్ములను సహోదరులు అని పిలిచినందుకు నీకు కృతజ్ఞతలు. మేము నీతో సహవాసము కలిగి ఉండుటకు అర్హులము కాము. మా పాపములను క్షమించినందుకు కృతజ్ఞతలు. మమ్ములను ఆనందంలో ఉండు అపొస్తలులుగా చేయుము.

ప్రశ్న:

  1. మగ్దలేనే మరియ పెదవుల నుంచి మనకు వచ్చిన సమాచారం ఏమిటి ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 12:38 PM | powered by PmWiki (pmwiki-2.3.3)