Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 117 (Jesus appears to Mary Magdalene)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 4 - చీకటిని వెలుగు జయించుట (యోహాను 18:1 – 21:25)
B - యేసు పునరుత్తనము మరియు ప్రత్యక్షము (యోహాను 20:1 - 21:25)
1. పస్కా పండుగలో జరిగిన కార్యములు (ఈస్టర్) (యోహాను 20:1-10)

c) మగ్దలేనే మరియు యేసు ప్రత్యక్షమగుట (యోహాను 20:11-18)


యోహాను 20:11-13
11 అయితే మరియ సమాధి బయట నిలిచి యేడ్చు చుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా, 12 తెల్లని వస్త్రములు ధరించిన యిద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్లవైపున ఒకడును కూర్చుండుట కనబడెను. 13 వారు అమ్మా, యెందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమెనా ప్రభువును ఎవరో యెత్తికొని పోయిరి; ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను.

ఎప్పుడైతే ఆ ఇద్దరు శిష్యులు సమాధి ఖాళీగా ఉండుట చూసి , ఇక్కడ ఉండడము అవసరము లేదని భావించి వెనక్కు వెళ్లిరి.

ఏదేమైనా మగ్దలేనే మరియు సమాధిలో ఏమి లేదని వెనక్కు వచ్చి శిష్యులకు చెప్పెను. మిగతా శిష్యులు అక్కడినుంచి వెనక్కి వెళ్లినా కూడా ఆ స్త్రీలు మాత్రమూ అక్కడే ఉండిరి. వారు క్రీస్తు కొరకు అనగా అతను చెప్పినట్టు తిరిగి లేస్తాడనే నిరీక్షణలో ఉండిరి మరియు ఆయనే వారి బలమాయెను. అయితే క్రీస్తు శరీరము కనపడక పోయినప్పుడు ఆమె నిరీక్షణ నలహీనమాయెను కనుక ఎంతగానో యేడ్చెను.

ఆమె ఏడ్పును చూసిన తరువాత యేసు ఆమెకు ఇద్దరు దూతలను పంపెను. ఇక్కడ ఆమె వారిని యేసును ఉంచిన స్థలమునకు అటు ఇటుగా తెల్లని వస్త్రములు ధరించి కూర్చుండుట చూసేను. అయితే ఆమె ఏడ్పును వారుకూడా ఓదార్చలేకపోయిరి ఎందుకంటె ఆమె యేసు కొరకు ఎదురుచూస్తున్నది కనుక. అందుకు ఆమె హృదయము, " నా ప్రభువా, ఎక్కడున్నావు?" అనెను.

ఈ మౌనము మనలను నీకు ఏమి కావాలి? అని అడుగుతున్నది. మనకెందుకు కావాలి మనము ఏమి ఆశిస్తున్నాము ? మన గురి ఏమిటి ? మగ్దలేనే మాదిరి మనము కూడా ఏది ఆశించక యేసును చూడాలనుకుంటున్నామా ? అతను తిరిగి రావాలని నీ హృదయము అంగలారుస్తున్నదా?

యోహాను 20:14-16
14 ఆమె యీ మాట చెప్పి వెనుకతట్టు తిరిగి, యేసు నిలిచియుండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. 15 యేసు అమ్మా, యందుకు ఏడ్చుచున్నావు, ఎవనిని వెదకు చున్నావు? అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని అయ్యా, నీవు ఆయనను మోసికొని పొయినయెడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తికొని పోదునని చెప్పెను. 16 యేసు ఆమెను చూచిమరియా అని పిలిచెను. ఆమె ఆయనవైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూనీ అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము.

యేసు ఆమె ఏడ్పునకు సమాధానము ఇచ్చెను. వేరే వారు ఆ ఖాళీ సమాధిని చోస్తూ దూతల స్వరమును వింటుండగా మగ్దలేనే మరియా మాత్రమూ దర్శనము చూడాలని ఆశించెను; అప్పుడు యేసు ఆమె ఎదుట ఒక సామాన్యమైన మనిషిగా నిలపడెను.

ఆమె తన మనసులో చాల బాధకలిగి ఉన్నది కాబట్టి, యేసు స్వరమును మరియు దూతల స్వరమును అర్థము చేసుకోలేకపోయెను. ఆమె కేవలము యేసును చూడాలనే కోరికకలిగి ఉన్నది కనుక ఏ స్వరమును కూడా వినుటకు ఇష్టపడలేదు. అయిననూ అతని సన్నిధిని కూడా ఆమె అర్థము చేసుకోలేకపోయెను కనుక అతని దాయకలిగిన మాటలను విననొల్లకపోయెను. అందుకే చాలామంది ఈ సృష్టికర్తను వెతుకుతారు అయితే అతనిని కనుగొనలేరు ఆ విధముగానే అందరు కాపరిని అర్థము చేసుకోలేరు.

అయితే యేసుకు మరియా ప్రేమ తెలుసు కావున ఆమె విషయములో అతను దాయకలిగి ఉండెను; అందుకే అతను ఆమెను పేరుపెట్టి పిలిచి ఆ తోటమాలికంటే గొప్ప వాడని చెప్పెను. అతనికి అన్ని తెలుసు మరియు అతనే ప్రభువు. ఒక కాపరి ఏవిధముగా అయితే తన గొర్రెలను పిలుచునో అదేవిధముగా యేసు కూడా ఆమెను పేరు పెట్టి పిలిచి ఆమెకు నిత్యా జీవమును దయచేసెను. కనుక ఎవరైతే యేసును విశ్వసిస్తారో వారు తమ పాపములకు క్షమాపణను పొందుకొందురు కనుక యేసు వారిని పేరు పెట్టి పిలుచును, మరియు వారిని పరిశుద్దాత్మ ఆదరణ చూపును.

యేసు ఇప్పుడు నిన్ను పేరు పెట్టి పిలుచుచున్నాడు. నీవు అతని స్వరమును వింటున్నావా , నీ శ్రమలను మరియు ఆలోచనలన్నీ విడిచి అతని స్వరమును వింటున్నావా ?

"బోధకుడా" అని మరియా యేసును పిలిచెను. దాని అర్థము ఏమనగా అతనికి సమస్తము తెలుసును అని. ఆమెకు అతని స్కూల్ లో చదువుటకు అవకాశం కలిగినది కనుక ఆమెకు తన జ్ఞానమును, బలమును, కాపుదలను, మరియు నిత్యజీవమును యిచ్చియున్నాడు. కనుక ఆమెకు యేసు ఒక సంఘము ఏవిధముగా అయితే క్రీస్తు వచ్చినప్పుడు ఎత్తపడుతుందో అదేవిధముగా మనమందరము కూడా ఆ సంఘములో ఉంది ఎత్తబడినప్పుడు మనము కూడా యేసును ఘనపరచవలెను.

ప్రార్థన: యేసు మరియా యొక్క ఆశను నీవు ఆమెకు ప్రత్యక్షమై తీర్చినందుకు నీకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీ సన్నిధి చేత ఆమెను ఓదార్చి ఉన్నావు. నీ మాటే ఒక జీవము. మా హృదయములను తెరిచినట్లైతే అప్పుడు మేము నీ మాటలను మా హృదయములోనికి స్వీకరించెదము. మేము లోబడి నిన్ను విశ్వసించునట్లు మాకు సహాయము చేయుము.

ప్రశ్న:

  1. ఎందుకు మరియ యేసును చూసే వరకు అతడిని వెతికినది, యేసు ఆమెను పేరు పెట్టి పిలిచినాకూడా అతనిని చూడాలనే ఆశ ఎందుకు కలిగినది ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 12:37 PM | powered by PmWiki (pmwiki-2.3.3)