Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 102 (Jesus intercedes for his apostles)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 3 - అపొస్తలులలో వెలుగు ప్రకాశించుట (యోహాను 11:55 – 17:26)
E - యేసు మధ్యవర్తుగా ప్రార్థన చేయుట (యోహాను 17:1-26)

3. యేసు తన అపొస్తలుల గురించి మధ్యవరహిత్వము చేయుట (యోహాను 17:6-19)


యోహాను 17:9-10
9 నేను వారికొరకు ప్రార్థన చేయుచున్నాను; లోకముకొరకు ప్రార్థన చేయుటలేదు, నీవు నాకు అనుగ్ర హించి యున్నవారు నీవారైనందున వారికొరకే ప్రార్థన చేయుచున్నాను. 10 నావన్నియు నీవి, నీవియు నావి; వారియందు నేను మహి మపరచబడి యున్నాను.

ఎవరైతే తండ్రి అయినా దేవుడిని విశ్వసిస్తారో వారియెడల యేసు ప్రార్థించును, మరియు కుమారునితో నిత్యమూ ఉండునట్లు. ఇక్కడ యేసు ఈ లోకమును గురించి ప్రార్థించలేదు ఎందుకంటె ఈ లోకము యేసును తిరస్కరించింది కనుక. అయితే క్రీస్తు తన సంఘముకొరకు మరియు తాను ఎన్నుకున్నవారిని బట్టి ప్రార్థించాడు. క్రైస్తత్వము ఈ లోక మనుషులను గూర్చి మాట్లాడాడు , అయితే క్రీస్తు సంఘము గురించి మాట్లాడును. కనుక సంఘము అనునది ఎన్నుకొనబడి, పరిశుద్ధపరచబడినది ఎందుకంటె ఇది క్రీస్తు మరణమునకు ఒక ఫలించు సూచనగా ఉన్నది కనుక .

యేసు ఎప్పుడు కూడా తనకు తానుగా దేనిని కూడా చేసుకొనలేదు, అయితే ఎల్లప్పుడూ వారు తండ్రికి స్వాస్థ్యము కలిగిన వారని సాక్ష్యముగా చెప్పెను. తండ్రి అతడిని వారికి ఇచ్చినప్పటికీ. అయితే క్రీస్తు తన తండ్రికి లోబడి ప్రార్థనలో తనను తాను సమర్పించుకొనెను.

ఎవరైతే అతనిని విశ్వసించారో వారిద్వారా యేసు మహిమ పరచబడినాడని సెలవిచ్చెను, అయితే మనము మన సంఘాలు బలహీనంగా ఉన్నాయని చెప్తునాటాము;అయితే దీనికంటే అతను లోతుగా చెప్పెను. తండ్రి మనలను వెలుగు ద్వారా చూచును. తన విశ్వాసులకు తన ఆత్మను తన కుమారునిద్వారా పంపెను. ఈ ఆత్మీయ కుమ్మరించుట అనునది సిలువకు సూచనగా ఉన్నది. క్రీస్తు వ్యర్థముగా మరణించలేదు అయితే పరిశుద్ధాత్ముడు విశ్వాసుల జీవితాలలో ఉండి ఫలించునట్లు చేసెను. ప్రతి నూతన జన్మ క్రీస్తును మహిమపరచును.

యోహాను 17:11
11 నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు; నేను నీయొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రీ, మనము ఏకమై యున్నలాగున వారును ఏకమై యుండు నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము.

క్రీస్తును పట్టుకొను వారు అతని దగ్గరకు వచ్చినప్పుడు క్రీస్తు తన తండ్రి దగ్గరకు వెళ్తానని చెప్పెను. ఎందుకంటె క్రీస్తు తన మరణము ద్వారా తండ్రి మహిమను చూచుచున్నాడు. " నేను ఈ లోకములో ఉండను" , అతను ఈ లోకములో ఉన్నప్పటికీ ఈ విధముగా చెప్పెను.

క్రీస్తు ఈ లోకమును ఒక పెద్ద సముద్రముగా ఎంచెను, ఎందుకంటె అందులోని నీరు చాల తొందరగా వెళ్తాయి కాబట్టి, మరియి ఎత్తైన ప్రదేశములోనుంచి క్రిందకు దుంకును. క్రీస్తు ఆ నీళ్లకు ఎదురుగా ఈత కొడుతున్నాడు, కనుక మనుషులు వ్యతిరేకమును తీసివేస్తున్నాడు. తన శిషులు చెడును ఎదుర్కొనుట శక్తి లేదని యేసు గ్రహించెను. కనుకనే తన తండ్రికి వారిని తన నామములో ఉంచుమని అడిగెను.

ఇక్కడ యేసు " ఓ పరిశుద్ధ తండ్రి" అనే పదమును ఉపయోగించెను. ఈ లోక చెడులో కుమారుడు తన తండ్రి పరిశుద్దతను , పాపరహితమును, సాక్ష్యము ద్వారా చూపెను. అతని పరిశుద్ధత ఒక వస్త్రమువలె ఉండెను అది అతని మహిమను చూపెను.

అయితే దేవుని పరిశుద్ధ నామము శిస్యుల ద్వారా తిరస్కరించబడెను. ఎవరైతే క్రీస్తులో ఉంటారో వారు తండ్రితో ఉండెదరు. ఎవరైతే కుమారునితో నిలిచి ఉంటారో వారు తండ్రితో నిలిచి ఉందురు. దేవుడు తన పిల్లలను తన సంరక్షణలో మరియు కాపుదలలో ఉంచుకొనును. అప్పుడు సాతానుడు తండ్రి చెతిలొనుంచి వారిని విడిపించుకొనలేడు.

ఈ విధమైన కాపుదలలో వారు ఉండుట అంటే వారు ద్వేషము నుండి గాయములనుండి విడిపించబడి, నిత్యమూ క్షమించగలిన ప్రేమకలిగి ఉందురు. అయితే ఈ ప్రేమ అందరికి సొంతముగా వచ్చునది కాదు, అయితే ఎవరైతే పరిశుద్ధ త్రిత్వములో ఉంటారో వారు ఈ శక్తిని పండుకొని, అప్పుడు ఇతరులను ప్రేమించే మనసు కలిగి ఉంటారు. కనుకనే క్రీస్తు తన తండ్రిని అతని సహవాసములో ఉంచుకొనుమని అడిగెను, కుమారుడు అతనితో ఒకడుగా ఉన్నట్లు ఉండుటకు అడిగెను. కనుక మన ప్రార్థనలు క్రీస్తు వ్యసనములను గుర్తుకు తెచ్చునట్లు మరియు అతని యందు ఫలించువారుగా ఉండునట్లు చేయాలి.

యోహాను 17:12-13
12 నేను వారియొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించినవారిని నీ నామమందు కాపాడితిని; నేను వారిని భద్రపరచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు. 13 ఇప్పుడు నేను నీయొద్దకు వచ్చుచున్నాను; నా సంతోషము వారియందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను.

సహనంతో క్రీస్తు తన శిష్యులను సాతాను శోధన నుంచి కాపాడి ఉన్నాడు. పేతురుతో , " నిన్ను మ్రింగుటకు సాతానుడు ఆశకలిగి ఉన్నాడు, అయితే నేను నీ కొరకు ప్రార్థించాను, నీ విశ్వాసము విఫలము కాకుండునట్లు" అని చెప్పెను. కనుక మన విశ్వాసము అతని మధ్యవర్తిత్వము ద్వారా నిలిచి ఉన్నది, మరియు మనము కృప చేత రక్షించబడినాము.

ఇది అతని శిష్యుల సామర్థ్యమును బట్టి ఉండెను, అయితే యూదా ఇస్కరియోతు తనను తాను మోసపరచు ఆత్మకు సమర్పించుకొని సత్యమైన ఆత్మను పొందుకొనలేకపోయెను. అతను నాశనమైన వానికి కుమారుడాయెను. మన పరలోకపు తండ్రి ఎవ్వరిని కూడా తన బహుమానములను పొందుకొమ్మని బలవంతము చేయడు. అతనికి మనుషుల హృదయాలలో ఏమి ఉన్నదో తెలుసు, మరియు ఇది ముందుగానే తెలిసినది. కంటూనే యూదా క్రీస్తును పట్టిస్తాడు అను మాట కొన్ని వేళా సంవత్సరముల క్రిందనే పాత నిబంధన గ్రంథమందు లిఖించబడి ఉండెను. ఏదేమైనప్పటికీ యూదా క్రీస్తును వ్యతిరేకించుటలో నిలిచియుండెను. మన పరలోకపు తండ్రి ఒక శాస్త్రుడు కాదు అయితే జ్ఞానము కలిగిన తండ్రి; అతని ప్రేమ మనకు ఒక బహుమానమై ఉన్నది .

క్రీస్తు తన తండ్రి మార్గమును ప్రకాశించు వెలుగుగా చూసేను. సాతాను కానీ, పాపముకానీ, మరణము కానీ ఏదియు కూడా అతను తన తండ్రి యొద్దకు వెళ్ళుటకు అడ్డముగా లేకపోయెను. కుమారుడు ఎల్లప్పుడూ పరిశుద్ధుడు, కనుకనే ఆనందము అతనిలో ఉప్పొంగెను. పాపము అనునది అతనిలోని రాకపోయెను. అతని ప్రార్థనకు భయము అనునది అధికారము చేయలేకపోయెను. కుమారుడు ఎల్లప్పుడూ తండ్రి ద్వారా నడిపించబడి తన తండ్రికి లోబడి ఉన్నాడు. మన దేవుడు ఆనందమునకు సంతోషమునకు కర్త. యేసు తన తండ్రి ఆనందమును తన శిష్యుల హృదయాలలో ఉంచెను. తన శిషులు ఎప్పుడు శ్రమలలో ఉండుటకు ఇష్టపడలేదు అయితే ఎల్లప్పుడూ ఆనందము కలిగి ఉండాలని కోరుకొనెను. ఆ ఆనందము పరలోకము నుంచి వచ్చి వారి జీవితాలలో వారిని ఎల్లప్పుడూ సంతోషముగా ఉంచుటకు సహకారము ఇచ్చెను. క్షమాపణ, ఆనందము , కృతజ్ఞత అనునది దేవునితో ఉన్నవి కనుక ఇవన్నిటిని బట్టి క్రీస్తు మనకొరకు దేవునితో మనవిచేసి మనకు ఇచ్చుటకు ప్రార్థించెను.

ప్రార్థన: ప్రభువా మా కొరకు మీరు ప్రార్థనద్వారా మధ్యవర్తిత్వము చేస్తునందుకు నీకు కృతజ్ఞతలు. మాలో నీ సన్నిధిని బట్టి నిన్ను ఆరాధించెదము. నీ సన్నిధి మరియు తండ్రి సన్నిధి మా జీవితములలో మెండుగా ఉంచబడినందుకు కృతజ్ఞతలు. మాకొరకు మీ ప్రార్థనలను బట్టి కృతజ్ఞతలు; మేము నీ మదేవర్తిత్వపు ప్రార్థనలో నిలిచెదము.

ప్రశ్న:

  1. తండ్రితో మన సంరక్షణ అనునది దేనికి సూచన ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 12:17 PM | powered by PmWiki (pmwiki-2.3.3)