Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 099 (Christ's peace in us defeats the world's afflictions)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 3 - అపొస్తలులలో వెలుగు ప్రకాశించుట (యోహాను 11:55 – 17:26)
D - పైటప్పుడు గెత్సేమనే కు వెళ్ళేటం (యోహాను 15:1 – 16:33)

6. ఈ లోక కష్టములను క్రీస్తు సమాధానము ఏవిధముగా ఓడించును (యోహాను 16:25-33)


యోహాను 16:25-26
25 ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పితిని; అయితే నేనిక యెన్నడును గూఢార్థముగా మీతో మాటలాడక తండ్రినిగూర్చి మీకు స్పష్టముగా తెలియ జెప్పుగడియవచ్చుచున్నది. 26 ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు గాని మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుటలేదు.

యేసు పరలోక సంబంధమైన రహస్యములను ఉపమాణముల ద్వారా బయలుపరచెను, అయితే ఎవరైతే నీటికొరకు ఆకలిగా ఉన్నారో వారికి తన రహస్యములను వివరించెను. ఎందుకంటె యేసు తన శిష్యులు అతని ఆశలను కనుగొనాలి ఎంతగానో ఇష్టపడెను. మరియు అతని పునరుత్తనమును బట్టి మరియు అతను తిరిగి పరలోకమున తన తండ్రి కుడి పార్శ్యమున కూర్చుండుటను కూడా వారు తెలుసుకోవాలని ఇష్టపడెను. ఇవన్నీ కూడా ఒక్కదినములలో వారు తెలుసుకోవాలని అనుకొనెను. ఎప్పుడైతే తన శిష్యుల హృదయాలలో ఆత్మ వచ్చినప్పుడు క్రీస్తు ఈ ఉపమాణములను వారికి క్లుప్తముగా చెప్పెను. దేవుడు తండ్రి మరియు క్రీస్తు అతని కుమారుడు. కనుక పరిశుద్దాత్మ లేనిదే ఎవ్వరును తన తండ్రిని తెలుసుకొనలేడు, అయితే కుమారుని ఆత్మ మనలను దేవుని కుటుంబములోనికి నడిపించును. నీకు ఈ లోక తండ్రి ఉన్నాడా? నీవు అతనితో మాట్లాడుతున్నావా ? నీగురించి అతను ఆలోచనచేస్తున్నాడా ? ఇవన్నీ కూడా ప్రశ్నలు. క్రీస్తు మాటలు మనకు ఓదార్పును ఇచ్చి, దేవుడు శక్తి కలిగిన వాడని మరియు పరిశుద్ధుడని మరియు అతను మనలను ప్రేమించునని తెలియపరచు చున్నది. మనము పాపములో ఉన్నప్పటికీ అతని ప్రియమైన పిల్లలుగా ఉన్నాము, అయితే క్రీస్తు రక్తములో మనము అతని ముందు పరిశుద్ధులమై ఉన్నాము. మన ప్రార్థనలు సత్యమై ఉండునట్లు పరిశుద్ధాత్ముడు చేయును ఎందుకంటె పరిశుద్దాత్మ క్రీస్తుకు చెందినది కాబట్టి. ఆత్మీయమైన ప్రార్థనలో క్రీస్తు మనతో మాట్లాడును. ఆత్మ ఏవిధముగా కోరుకుంటుందో అదేవిధముగా ప్రార్థించాలి నీ ప్రార్థనలు నీకును మరియు నీ ఆత్మకు మరియు నీ పరలోకమందున్న తండ్రికి మధ్యవర్తిగా ఉండాలి.

యోహాను 16:26-28
26 ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు గాని మీ విషయమై నేను తండ్రిని వేడుకొందుననిమీతోచెప్పుటలేదు. 27 మీరు నన్ను ప్రేమించి, నేను దేవునియొద్దనుండి బయలుదేరి వచ్చితినని నమి్మతిరి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు. 28 నేను తండ్రియొద్దనుండి బయలుదేరి లోకమునకు వచ్చియున్నాను; మరియు లోకమును విడిచి తండ్రియొద్దకు వెళ్లుచున్నానని వారితో చెప్పెను.

ఏ తండ్రి అయితే తన పిల్లలను ప్రేమించకుండా ఉంటాడో అతను అసలు తండ్రే కాదు. యేసు దేవుని పేరును బయలుపరచి దేవుని ప్రేమను గూర్చి వివరించెను. తండ్రికి ఇచ్చు ప్రాముఖ్యము క్రీస్తు యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది. కనుక ఎవరైతే తండ్రిని తెలుసుకొనునో వాడు దేవుడిని తెలుసుకొని అతని బిడ్డగా మారును. మరియు అతని ప్రేమలో ఉండును. ఆ నామములోనే మనము నిత్యజీవమును మరియు నిరీక్షణకు కనుగొందుము. అనుదుకే క్రీస్తు చెప్పినట్టు నీవు ఇక ఖంఠస్తం చేయవలసిన అవసర లేదు ఎందుకంటె దేవుడే నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక, మరియు నీకు తన కనికరమును బయలుచేసెను. క్రీస్తు సిలువలో మరణించెను కనుక మంకు మరియు తండ్రికిని మధ్యలో ఎవ్వరు కూడా లేరు. కనుక ఎవరైతే కుమారుని యెడల విశ్వాసము కలిగి ఉంటారో వారు మీద దేవుని ప్రేమ మరియు క్రీస్తు ప్రేమ ఉండును. కనుక ఎవరైతే క్రీస్తు దైవత్వమును తెలియక ఉంటారో వారిలో తండ్రి సన్నిధి ఉండదు అప్పుడు అతను పరిశుద్దాత్ముని దగ్గరకు వచ్చును. అప్పుడు అతను దేవునితో ఉండును కనుక తండ్రి కృపచేత సంపూర్ణ ఆనందము కలిగి ఉండును.

ఒక మాటలో క్రీస్తు తన శిష్యులకు అద్భుతములను గూర్చి విడిపించెను. అతను పై నుంచి వచ్చి ఈ భూమి మీద ఉండి తన క్రయములను చేసెను , మరియు మనుషుల కొరకు అతను సిలువమరణము పొందెను, అయితే ఎప్పుడైతే అతను తిరిగి తన తండ్రి యొద్దకు వెళ్లెను అప్పుడు అందరికీ సంపూర్ణమైన జీవితమును దయచేసెను.

యోహాను 16:29-30
29 ఆయన శిష్యులుఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమియు చెప్పక స్పష్టముగా మాటలాడుచున్నావు. 30 సమస్తము ఎరిగినవాడవనియు, ఎవడును నీకు ప్రశ్నవేయ నగత్యము లేదనియు, ఇప్పుడెరుగుదుము; దేవునియొద్దనుండి నీవు బయలుదేరి వచ్చితివని దీనివలన నమ్ముచున్నామని చెప్పగా

శిష్యులు దేవుని గొప్ప ప్రేమను బట్టి మరియు యేసు నిత్యజీవమును బట్టి తెలుసుకొనువారైరి. యేసు నిజమైన దేవుడు, శక్తికలిగిన వాడు మరియు పరిశుద్ధ నిత్యజీవము కలవాడు. అయితే క్రీస్తు ప్రేమ అయి ఉన్నాడని వారు గుర్తుచేసుకోలేదు. కనుక వారు దేవుడిని తండ్రి అని పిలువలేదు, అయితే దానికి బదులుగా క్రీస్తు దేవుని నామమును బట్టి అతని ప్రేమ ఎన్నటికీ వీడదని వారికి చెప్పెను. అయితే అప్పటికి ఇంకా పరిశుద్ధాత్ముడు వారిని వెలిగించలేదు. కనుక వారు ఈ సంగతులను ఒప్పుకొనిరి అయితే అతని స్వభావమును మాత్రమూ తెలుసుకొనలేక పోయిరి.

యోహాను 16:31-32
31 యేసు వారిని చూచిమీరిప్పుడు నమ్ము చున్నారా? 32 యిదిగో మీలో ప్రతివాడును ఎవని యింటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చేయున్నది; అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను.

వంకర కలిగి వారికి చెప్పెను, " నా రూపమును మరియు నన్ను మీరు మీ కార్యముల ద్వారా నన్ను పొందుకుంటారని అనుకున్నారా ? మీ జ్ఞానము నిజముగా సత్యమైన విశ్వాసముతో ఉన్నదా ? పరీక్ష పెట్టుటకు సమయము వచ్చి, నీ నమ్మకము ప్రేమ కలిగినదని చూపును.నీవు అతని తండ్రిత్వమును నమ్మవు కనుక నీవు అతడిని దేవుడని అర్థముచేసుకొనుటలో విఫలమయ్యావు. కనుక మీరందరు నన్ను పూర్తిగా విడిచిపెట్టెదరు. కనుక మీ విశ్వాసము నిలువదు".

" మరణములో నేను ఒంటరిగా లేను, అయితే నా తండ్రి నాతో ఉన్నాడు". ఈ మాటలు క్రీస్తు సిలువలో అంగలార్పును బట్టి ఖండించునా, " నా దేవా నన్ను ఎందుకు విడనాడితివి?" లేదు అయితే పరిశుద్దుడైన దేవుడు తన కుమారుని పట్ల తన ముఖమును తిప్పెను, అయితే క్రీస్తు తన తండ్రిని సన్నిధిని విశ్వసించుటలో ఒకేవిధముగా ఉండెను. అతని ఏడుపు మనకు దేవుడు ఒకేవిధముగా ఉన్నాడని తెలియపరచెను, " నేను నిన్న చూడకున్నప్పుడు కూడా నిన్ను విడువను. నీ చేతులలోకి నా ఆత్మను అప్పగిస్తున్నాను". మన కొరకు క్రీస్తు విశ్వాసము తన తండ్రిత్వములోనికి వచ్చినది. కుమారుని ప్రేమ తన తండ్రి పై ఉన్నప్రకారముగా మన పాపములను బట్టి దేవుని ఉగ్రత నుంచి మనలను కాపాడును.కనుక అతని నిత్యమైన నిరీక్షణ మనము తండ్రిని చూచుటకు అవకాశము కలిగెను. కనుక అతని మరణము ద్వారా నీవు , " నేను ఒంటరిని కాను, ఎందుకంటె తండ్రి నాతో ఉన్నాడు " అని చెప్పుము .

యోహాను 16:33
33 నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను.

క్రీస్తు తాను వెళ్లిపోవుటను బట్టి తన శిష్యులకు ఓదార్పు కలిగి చెప్పెను, " నేను మీతో కొంత కాలమే ఉండి, మీ హృదయములో సమాధానము నింబడును గాక. ఎందుకంటె అవిశ్వాసులకు సమాధానము లేదు కాబట్టి. నేను మరియు కుమారుడు మీ పాపములను మరియు మీ అంతరంగములను కాడినాము. నీలో నా ఆత్మను నింపినాను. నాలో నిలిచి ఉండు. నా ద్వారా తప్ప నీకు సంరక్షణ లేదు . దేవునితో సహవాసము నీ సమాధానము. కనుక నీ పాపములకు క్రీస్తు రక్తము ద్వారా తప్ప మరి ఏవిధముగా పాప విముక్తి లేదు. నేను నిన్ను రక్షించి నా ఆత్మను నీ మీద ఉంచాను. నా సమాధానము భూతము కాదు అయితే నిజము. నేను నీకు సమాధానము ఇచ్చుటకు వచ్చాను కనుక అంగీకరించి విశ్వసించు".

“ఈ లోకములో సమాధానము ఎదురు చూచునని వుహించవద్దు. లేదు! అపాయము పొంచివుంది: శ్రమలు, మోసము మరియు మరణము.న్యాయమైన వారు తిరస్కరించి, మంచిగా ఉండు వారు వెక్కిరిస్తారు. వేలకొలది జ్ఞానముకలవారు నీ విశ్వాసము గూర్చి అబద్ధము చెప్తారు. గర్విష్టి నీతో ఉంటాడు. ధనమును ప్రేమించవద్దు; ఐశ్వర్యము నీకు సంరక్షణగా ఉండదు."

" నీ కన్నులను ఈ లోకము నుంచి వేరుపరచి నా వైపే చూడుము. నా జీవితమును తెలుసుకొని నా మాటలను వెంబడించి ప్రేమతో నా సత్వేఏకమును వెంబడించు. నా త్యాగములో ఉండుము . నేను ఈ లోకమును జయించినాను. నేను నా కొరకు ఏది అడగను. నేను దేవుని పరిశుద్ధతలో ఉన్నాను. నాలో దేవుని ఆజ్ఞ నెరవేర్చబడినది, నేను పరిశుద్ధుడను కనుక పరిశుద్ధముగా ఉండు. నేనే నిజమైన ప్రేమ కలిగిన వాడను నాలో నీవు తండ్రిని చూచెదవు."

యేసు వెళ్ళుటకు బట్టి చర్చను నీవు అంగీకరించావా ? అతను నిన్ను తన తండ్రి సహవాసములో ఉంచాడు, కనుక నీ హృదయము క్రీస్తు సమాధానంతో ఉందును. ఆ సత్యము విశ్వాసుల జీవితములో ఎంతో గొప్పది. ఈ లోకము నిన్ను చెడులో ఉంచి నిన్ను ఇబ్బంది కలిగించును. అయితే నీ విశ్వాసమే నిన్ను మరణము నుంచి సాతాను నుంచి మరియు దేవుని ఉగ్రత నుంచి కాపాడును. ఎవరైతే క్రీస్తును విశ్వసిస్తారో వారు దేవుని దయను పొందుకుంటారు. ఈ యేసు మాటలు నీ హృదయాన్ని నింపాయా? " తండ్రి నా వాడు, కుమారుడు నా రక్షకుడు, మరియు పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు. ఏకైక దేవుడు నాలో ఉన్నాడు. నేను అతని కృపలో ఉన్నాను". అని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడా .

ప్రార్థన: ప్రభువా నీవు నన్ను నీ కొరకు మార్చుకొని నా హృదయమును గెలిచినావు. నీవు మమ్ములను చేదు నుంచి కాపాడి నీ సంరక్షణలో ఉంచావు. నాకు నిత్యా జీవమును దయచేసినావు. నేను నీ యందు ఆధారపడి ఉన్నాను కనుక నేను మరణము గురించి భయపడను. నీ చిత్తములో ఉంచి నీ శక్తిని నాలో ఉంచుము, అప్పుడు నేను నిన్ను మహిమపరచుదును. నేను నా సహోదరులను ప్రేమించినట్లు నాలో నీ సమాధానమును ఇమ్ము. నేను నీ మీదే ఆధారపడి ఉన్నాను; ఎందుకంటె నీవే జయశీలుడవు.

ప్రశ్న:

  1. ఎలా ఎందుకు తండ్రి ప్రేమించును ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 12:15 PM | powered by PmWiki (pmwiki-2.3.3)