Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 093 (The world hates Christ)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 3 - అపొస్తలులలో వెలుగు ప్రకాశించుట (యోహాను 11:55 – 17:26)
D - పైటప్పుడు గెత్సేమనే కు వెళ్ళేటం (యోహాను 15:1 – 16:33)

3. క్రీస్తును మరియు అతని శిష్యులను ఈ లోకము ద్వేషించును (యోహాను 15:18 - 16:3)


యోహాను 15:18-20
18 లోకము మిమ్మును ద్వేషించినయెడల మీకంటె ముందుగా నన్ను ద్వేషించెనని మీరెరుగుదురు. 19 మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును; అయితే మీరు లోకసంబంధులు కారు; నేను మిమ్మును లోకములోనుండి ఏర్పరచుకొంటిని; అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. 20 దాసుడు తన యజమానునికంటె గొప్పవాడు కాడని నేను మీతో చెప్పినమాట జ్ఞాపకము చేసికొనుడి. లోకులు నన్ను హింసించినయెడల మిమ్మును కూడ హింసింతురు; నా మాట గైకొనినయెడల

క్రీస్తు దేవునితో తనకు ఉన్న బంధమును గూర్చిన ఐక్యతను గూర్చి చెప్పిన తరువాత, అతను ఈ లోకము మిమ్ములను ద్వేషించును అను ప్రవచనమును వారికి చెప్పెను.

క్రైస్తవుల సహవాసమును ఈ లోకము ద్వేషించును. ద్వేషము అనునది ఈ లోకమును పరిపాలించును అయితే క్రీస్తు ప్రేమ క్రైస్తవులను కాపాడును. క్రీస్తు తన శిష్యులను ఈ లోకమునుంచి తీసి తన ప్రేమను ఇవ్వలేదు. అయితే అతను ఈ చేదు పరిస్థితులలోనికి మనలను పమ్పి అందులోనుంచి మనలను కాపాడి ఈ లోక ద్వేషమునుంచి వేరుపరచును. కనుక ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో వారు తిరస్కరించబడతారు. మరియు వారు చేదు సహవాసములనుంచి వేరుపరచబడి క్రీస్తు మాటలకు లోబడి ఉంటారు. అందుకే యేసు వీటిని బట్టి ఈ లోకమునుంచి పారిపోక ఈ లోకము కొరకు మరణించెను.

మన హృదయములో చేదు ఉన్నది కాబట్టి మనమెవ్వరమూ దూతలము కాలేము. అయితే క్రీస్తు కృప చేత మనకు నూతన ఆత్మ వచ్చినది. పచ్చాత్తాపము అనగా మారు మనస్సు అని అర్థము. ఎవరైతే ఆత్మాయముగా జన్మిస్తాడో వాడు ఈ లోక సంబంధి కాదు అయితే క్రీస్తు సంబంధి. అయితే క్రీస్తు మనలను ఈ లోకమునుంచి ఎన్నుకొన్నారు. "సంఘము" అనగా ఈ లోకమునుంచి పిలువబడినవారు లేదా ఈ లోకమునుంచి ప్రత్యేకించబడినవారు అని అర్థము. కనుక ఈ లోకము సంఘమును ఎప్పుడు చూచును. కనుక ఈ ప్రత్యేకత అనునది ఒక కుటుంబములో లోతైన అనుభవమును ఇచ్చును (యోహాను 7 :2 -9 ). కనుక ఈ మాటకు ఎవరైతే క్రీస్తులో నిలిచి ఉంటారో వారికి అతని జ్ఞానము మరియు వినయము శ్రమలకు మరియు వెక్కిరింపులకు అవసరం. కనుక ఒకవేళ నీవు అదే పరిస్థితులలోనికి వెళ్ళినట్లైతే యేసు కూడా అదే స్థితిలోకి వెళ్లాడని జ్ఞాపకము చేసుకో. ఎందుకంటె వారిని అతను ప్రేమించి బాగుచేసెను, అయితే వారు అతనిని ఒక దొంగ వాలే సిలువవేసిరి

క్రీస్తుకు నీ గురించి గొప్ప వాగ్దానము కలదు, ఏమిటంటే కొందరు నిన్ను హింసించి నీతో గొడవ పడినా కొంతమంది నీ సాక్ష్యమును వినుటకు ఉండెదరు. దేవుని వాక్యము ఏవిధముగా అయితే నీవు వినినప్పుడు నీవు బలపరచబడతావో అదేవిధముగా ఇతరులు నీ సాక్ష్యమును విని నిత్యజీవములోనికి వెళ్లుదురు. కనుక ప్రతి క్రైస్తవుడు ఈ లోకమునకు క్రీస్ట్ ప్రతినిధి.కనుక నీ పరలోక పిలుపును గ్రహించు .

యోహాను 15:21-23
21 అయితే వారు నన్ను పంపిన వానిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటినన్నిటిని మీకు చేయుదురు. 22 నేను వచ్చి వారికి బోధింపకుండినయెడల, వారికి పాపము లేకపోవును; ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు. 23 నన్ను ద్వేషించువాడు నా తండ్రినికూడ ద్వేషించుచున్నాడు.

క్రీస్తు అవరోహణమయినప్పుడు నా నామమును బట్టి మీకు శ్రమలు కలుగును అని అతను తన శిష్యులకు ముందుగానే చెప్పియున్నాడు. యూదులు తమ మిస్సయ్యాను సత్వేఏకమైన గొర్రెపిల్ల మాదిరి ఊహించలేదు, అయితే ఒక వారిని విమోచించు ఒక నాయకునిగా ఎంచుకొన్నారు. ఇది వారికి క్రీస్తు గురించిన సత్యము సరిగా తెలియనప్పుడు ఈ విధముగా అనుకొన్నారు . కనుక వారు నిజమైన దేవునికి మరియు వారు దేవుడు అని ఎంచుకున్న వానికి మధ్యన పోలిక తెలిసికొనవారైరి. వారిని ప్రభువైన యేసు తండ్రిని గూర్చి తెలియలేదు అతను సమాధానమునకు దేవుడు అను సత్యమును తెలియలేక పోయిరి. అయితే వారిని యుద్ధములు చేయుటకు ప్రోత్సహించి ఆ యుద్ధముల ద్వారా సమాధానము దొరకదని వివరించెను.

క్రీస్తు తన తండ్రి యొక్క ఆచరణలను తెలియపరచుటకు వచ్చియున్నాడు, అయితే యూదులు ఆ ఆత్మీయ ప్రేమను వ్యతిరేకించిరి. కనుక ఏ దేశమైతే క్రీస్తును ఒక సమాధాన కర్త అని అంగీకరించారో వారు ఈ లోక పాపములోనికి యూదుల మాదిరి వెళ్లుదురు. కనుక మన పాపము దేవునికి ఒక శత్రువు మాదిరి కనుక మనము వాటిని విడిచిపెట్టాలి లేనియెడల మనము కూడా ఆత్మీయ సమాధానమును వ్యతిరేకించువారిగా ఉంటాము.

ప్రజలు యేసును అతని సమాధానమును మరియు రాజ్యమును తిరస్కరించుటకు ముఖ్య ఉద్దేశము వారికి దేవుని గురించి ఉన్న నిజమైన అజ్ఞేయతావాదం . ఎందుకంటె మనుషులు వారి దేవుళ్లను వారికి తోచిన విధముగా ఊహించుకుంటారు. అయితే యేసు దేవుని ప్రేమను మనకు కనపరిచాడు. కాబట్టి ఎవరైతే ఈ ప్రేమను తిరస్కరిస్తారో వారు బలమును మరియు చెడును కలిగి ఉంటారు, మరియు ఎవరైతే క్రీస్తును వ్యతిరేకిస్తారో వారు దేవుడిని వ్యతిరేకించునట్లు.

యోహాను 15:24-25
24 ఎవడును చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండినయెడల వారికి పాపము లేకపోవును; ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించియున్నారు. 25 అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రములో వ్రాయబడిన వాక్యము నెర వేరునట్లు ఈలాగు జరిగెను.

ఎవరైతే దేవుని తండ్రిత్వమును ఒప్పుకొన్నారో మరియు అతని అద్భుతములను ఒప్పుకొన్నారో వారికి తీర్పు దినమందు వారికి తీర్పు తీర్చును. ఎందుకంటె యేసు ఈ లోకములో స్వస్థపరచునట్లు ఎవ్వరు కూడా చేయలేదు , దెయ్యాలను వెళ్లగొట్టుట, అలలను గద్దించుట మరియు ఐదు వేల మందికి ఆహారమును ఇచ్చుట ఇవన్నీ కూడా ఎవ్వరు చేయలేరు. దేవుడు క్రీస్తులో ఉంది తన కార్యములను సూచనలుగా తన సృష్టిద్వారా చేసి ఉన్నాడు. యూదులు తమ కార్యములలో ఈ విధమైనటువంటివి ఏవి కూడా వారి గుంపులో చేయలేదు మరియు చూడలేదు. అయితే ఎప్పుడైతే వారు క్రీస్తు కార్యములను చూసారో అప్పుడు ఇవి తండ్రిని నమ్ముటలో ఒక అడ్డుగా నిలిచెను. యూదులు ఏవిధముగా అయితే పరిశుద్ధాత్ముడు వచ్చుటకు ఒప్పుకొనలేదు అదేవిధముగా ఈ దినాలలో కూడా అనేకులు దేవునికే కార్యములను చేయుటకు మరియు చూచుటకు అడ్డుగా ఉన్నారు. ఎవరైతే క్రీస్తు దేవుని కుమారుడని మరియు అతనిని వెంబడించుచున్నవారిని అంగీకరించక ఉంటారో వారు నిజముగా దేవునిని తెలుసుకొనలేరు, అయితే వారి పాపములలో అలాగునే ఉంది పరిశుద్ధ త్రిత్వమును హేళనచేసెదరు. అయినప్పటికీ క్రీస్తు వారికి శిక్ష విధించలేదు అయితే వారికొరకు ప్రేమను దయచేసి ఉన్నాడు. కనుక సహోదరుడా ఆత్మీయ సహవాసమునకు నిన్ను నీవు సిద్ధపరచి నీలో ఆయన ఓర్పు సహనము మరియు బలము వచ్చునట్లు కనిపెట్టుకొని ఉండు.

ప్రార్థన: ప్రభువా నిన్ను ద్వేషించువారి పట్ల నీ ప్రణాళికలను తెలియపరచినందుకు నీకు కృతజ్ఞతలు. మా శత్రువులు రక్షించబడునట్లు వారిని ప్రేమించుటకు మాకు నేర్పుము. నీ చిత్తమును నీ ఆత్మను పొందునట్లు అనేకులా హృదయములను తెరువుము . మాకు నీ అధిక శక్తిని మరియు ఓర్పును దయచేయుము.

ప్రశ్న:

  1. ఈ లోకము క్రీస్తును మరియు అతను ప్రేమించువారికి ఎందుకు ద్వేషించును ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 12:11 PM | powered by PmWiki (pmwiki-2.3.3)