Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 081 (Jesus washes his disciples' feet)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 3 - అపొస్తలులలో వెలుగు ప్రకాశించుట (యోహాను 11:55 – 17:26)
B - ప్రభువు భోజనమునకు సంభవించు కార్యములు (యోహాను 13:1-38)

1. తన శిష్యులు పాదములను క్రీస్తు కడుగుట (యోహాను 13:1-17)


యోహాను 13:1-5
1 తాను ఈ లోకమునుండి తండ్రియొద్దకు వెళ్లవలసిన గడియ వచ్చెనని యేసు పస్కాపండుగకు ముందే యెరిగిన వాడై, లోకములోనున్న తనవారిని ప్రేమించి, వారినిఅంతమువరకుప్రేమించెను. 2 వారు భోజనము చేయు చుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారు డగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది3 ఇంతకుముందు ఆలోచనపుట్టించియుండెనుగనుక 3 తండ్రి తనచేతికి సమస్తము అప్పగించెననియు, తాను దేవునియొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు, దేవునియొద్దకు వెళ్లవలసి యున్నదనియు యేసు ఎరిగి 4 భోజనపంక్తిలోనుండి లేచి తన పైవస్త్రము అవతల పెట్టివేసి, యొక తువాలు తీసికొనినడుమునకుకట్టుకొనెను. 5 అంతట పళ్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును, తాను కట్టుకొని యున్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను.

ఈ అధ్యము ద్వారా యోహాను వేరే అంశమూ బట్టి తన సువార్తలో వ్రాయుట ప్రారంభించాడు. దీనికి సంబంధించి యేసు అక్కడున్న వారందరిని పిలిచి; " వెలుగు చీకటిలో ప్రకాశించును, మరియు చీకటి దీనిని తెలుసుకొనలేదు" అని వారికి చెప్పెను. మరి యేసు పడిపోతున్నాడా ? లేదు ! ఎందుకంటె ప్రజలు సంపూర్ణముగా క్రీస్తును అంగీకరించలేదు, అయితే ఎవరైతే నిజమైన సంపూర్ణముగా అంగీకరించుటకు ఇష్టపడ్డారో వారిని కలిపి శిష్యులలో చేర్చెను. కనుక ఈ అధ్యాయములో యేసు ఏవిధముగా ఎన్నుకొన్నాడో మనము తెలుసుకొనగలము, ఒక పెళ్లికుమారుడు పెళ్లి కూతురుతో మాట్లాడినట్లు ఉన్నది. వారు అతనికి సంబంధించినవారు కనుక వారు కూడా అతనికి సంబంధించినవారు. అయితే ఇందులో దేవుని ప్రేమే అంతటిలో ఉన్నట్లుగా మనము చూడవచ్చు. ఈ ప్రేమ ఒక వ్యక్తిగతముగా లేదు అయితే సేవ చేయుటకు పిలిచినట్లుగా ఉన్నది. బైబిల్ లో ప్రేమ అనునది ఎవరైతే లోబడి ఈ ప్రేమకు అర్హులో వారికి మాత్రమే ఈ దేవుని ప్రేమ కలుగును. దీనిలో క్రీస్తు తన శిష్యులకు సేవ గురించి మరియు మరణము జీవమును గురించి కూడా చెప్పెను.

యేసు వచ్చే పస్కాపండుగలోపు మరణిస్తానని చెప్పెను. అతను తన తండ్రి దగ్గరకు వెళ్తున్నాడు. నీ లక్ష్యము కూడా ఇదేనా? అతను ఈ లోకములో ఉండి అతని కన్నుల రెప్పలు తండ్రి మీద వేసాడు. అతని ద్వారానే శక్తి ఆనందము వచ్చినది. దేవునితో సంబంధము కలిగి ఉన్నప్పుడు తన శిష్యులలో ఒకడు దురాత్మచేత నడిపించబడుట తెలుసుకొనెను. ఈ మనిషి గర్వమును మరియు ద్వేషమును పండుకొని ఉండెను. ఏదిఏమైనప్పటికీ యేసు అతనిని ద్వేషించలేదు అయితే ప్రేమించెను.

యేసు ఆ దోషిని బట్టి సులువుగా అణిగి ఉండలేదు. యూదా, కైపసు, పిలాతు మరియు యూదుల నాయకులు కూడా ఏమి కలుగుతున్నదో అని నిర్ణయించలేదు., అయితే క్రీస్తును బట్టి దేవుడు తనను తాను ప్రజలందరికి త్యాగము చేసెను. అతను దేవుని గొర్రెపిల్లలాగా చనిపోయి ఈ కార్యముద్వారా వారికి దగ్గరకావాలని చూసేను. దీనిద్వారా అతను తన గురిని ఎక్కడ కూడా వదలలేదు. యేసు ఒక ప్రభువై చరిత్రనే మార్చగలడు.

క్రీస్తు తన తండ్రి దగ్గరకు ఒంటరిగా వెళ్లాలని అనుకొనలేదు, అయితే తన శిష్యులను మరియు తనను వెంబడించు వారిని కూడా దేవుని సహవాసములోనికి తీసుకొని రావాలని ఉద్దేశించెను. అతను వారికి ఒక సూచనను అనగా వినయమును నేర్పేను, అక్కడున్న వారందరికీ తన ప్రేమను కనపరచెను. అతను ఒక సేవకునిలాగా ఉండి ; మోకాళ్ళపైన ఉండి నీటిని తీసుకొని తన శిష్యుల పాదములను కడిగెను. తనకు తాను ఒక సాదృశ్యముగా ఉండి తగ్గించుకొని దేవుడు మనుషులను ప్రేమిస్తున్నాడు అని చెప్పుటకు ఈ దృశ్యమును అక్కడ గొప్పగా చేసెను. అక్కడ యేసు వారికి తన శక్తిని బలమును చూపలేదు అయితెహ్ తన తగ్గింపును మరియు తన దయను చూపెను.

యేసు మనకు ఒక మాదిరి. కనుక మనము ఎప్పుడు అతని ముందు మోకరించి ఆరాధించెదము ? మన మనసులను మన వెనుకబాటుతనమును విడిచిపెడుతున్నామా ?

సహోదరుడా నీవు నాలుగగొట్టబడలేదు కనుక ఒకవేళ నీవు నీ పొరుగువారికి ప్రేమించాక , గాయాలపాలైన వారిని పరామర్శించక ఉన్నట్లయితే నీవు నిజమైన క్రైస్తవుడవు కాదు. నీవు సేవకుడవా లేక ముఖ్యమైనవాడివా ? యేసు మనుష్యులందరికి సేవకుడు అనే సత్యమును జ్ఞాపకము చేసుకో , అతను నీకు సేవ చేయుటకు తగ్గింపు కలిగి ఉన్నాడు. నీవు దానిని అంగీకరిస్తావా లేక నీవు గర్వముగా ఉంటావా, నీవు మంచివాడని దేవుని సేవ అవసరము లేదని అనుకున్నావా ?

యోహాను 13:6-11
6 ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురునొద్దకు వచ్చినప్పుడు అతడు ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా? అని ఆయనతో అనెను. 7 అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదుగాని యికమీదట తెలిసికొందువని అతనితో చెప్పగా 8 పేతురు నీవెన్నడును నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు నేను నిన్ను కడుగనియెడల నాతో నీకు పాలు లేదనెను. 9 సీమోను పేతురు ప్రభువా, నా పాదములు మాత్రమేగాక నా చేతులు నా తలకూడ కడుగుమని ఆయనతో చెప్పెను. 10 యేసు అతని చూచి స్నానముచేసినవాడు పాదములు తప్ప మరేమియు కడుగు కొన నక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడయ్యెను. మీరును పవిత్రులు కాని మీలో అందరు పవిత్రులు కారనెను. 11 తన్ను అప్పగించువానిని ఎరిగెను గనుకమీలో అందరు పవిత్రులు కారని ఆయన చెప్పెను.

శిష్యులు తమ పాదములను కడిగినందుకు వారు ఎంతో సంతోషించి యేసును కౌగిలించుకొనిరి . " ప్రభు భోజనము" తరువాత యేసు ఈ విధముగా చేస్తాడని వారికి తెలుసా, ఆలా అయితే వారి పాదములను వారు కడుగుకొని ఉండేవారు. వారు ప్రభువు వారికి మరియు దేవునికి మధ్యన ఒక క్రొత్త నిబంధనను చేయలేదు, అయితే అతని నిబంధనను వారికి వివరించెను: ఇది ఏది కాదు కానీ ప్రేమించడం మరియు సేవ చేయడము.

పేతురు అందరికంటే ఈర్ష్య మరియు గొప్పలు చెప్పుకొనే శిష్యుడు. అందుకే అతను క్రీస్తు ద్వారా సేవ చేయబడాలని కోరుకోలేదు; కనుకనే అతను కడుగుట చాలించుమని తన మాటలచేత చెప్పెను. అప్పుడు క్రీస్తు అందరి పాదములను కడుగు రహస్యమును అందరికి వివరించెను. " కడగబడలేకపోతే నీకు దేవుని రాజ్యములో చోటు లేదు, మరియు నీ పాపములు క్షమించకుండా నీవు నాలో ఉండలేవు". అతని రక్తములో కడగబడుట మరియు అతనిలో ఎల్లప్పుడూ ఉండుట మనకు ఉత్తమము. తన కృప ద్వారా నిన్ను రక్షిస్తుంది ఆయనే, మరియు దేవుని కుమారునితో సహవాసముకలిగి ఉండునట్లు చేయును .

అప్పుడు పేతురు వెలుగును చూసి, అతని చేతుల ద్వారా చేసిన చెడుని కూసి దేవుని గురించి అతను ఆలోచనచేసిన విధమునుబట్టి తెలుసుకొనెను. అప్పడు అతను సిగ్గుకలిగి ఉండి తనను నిలువునా కడుగుమని కోరెను. అందుకు యేసు , " ఎవరైతే నా దగ్గరకు వస్తారో వారు విశ్వాసమును బట్టి శుద్ధికలిగి ఉంటారు." కనుక అప్పుడు మనకు ఏ విధమైన ప్రత్యేకమైన కడుగుట అవసరము లేదు ఎందుకంటె యేసు రక్తము మన పాపములను పూర్తిగా కడుగును కాబట్టి. అతని రక్తము ద్వారా కడగా బడిన దానికంటే మరి ఏ గొప్ప కార్యము ఈ లోకములో లేదు. మనము ఎల్లప్పుడూ దుమ్ములో ఉన్నప్పుడు మనము ఈ విధముగా ప్రార్థిస్తాము, " మానేరమును బట్టి మమ్ములను క్షమించు" . క్రీస్తు బిడ్డలకు ప్రతి దినము వారి పాదములు కడగబడునట్లు , ఈ లోకములో ఉండు అవిశ్వాసులు ప్రతి దినములు నిలువెల్లా కడగబడాలి.

యేసు తన శిష్య్లను చూసి ఈ విధాలుగా చెప్పెను, " నీవు పరిశుద్దమైనావు". అతను వారిని దేవుని నిబంధనలోనికి ఆహ్వానించెను. గొర్రెపిల్ల శిష్యులందరి కొరకు చనిపోయి ఆయనతో అందరు సహవాసము కలిగి ఉండాలని ఉద్దేశించెను. ఎవ్వరు కూడా తమలో తాము శుద్ధికలిగి లేరు, అయితే క్రీస్తు రక్తము మనందరి పాపములను కడుగును.

అయితే అతనిని వెంబడించువారిలో అనేకులు పరిశుద్ధులు కాదు, ఈ దినాలలో కూడా ఇదే ఉన్నది. ఎందుకంటె అనేకులు కేవలము తమ పెదవులతో మాత్రమే ఆరాధించి వారు క్రీస్తు రక్తములో కడగా బాదినారాను నమ్ముతారు, అయితే వారిలో పరిశుద్ధాత్ముడు ఉండడు. అయితే సాతాను వారి హృదయములో ద్వేషమును, అసూయను, ఈర్ష్యను మరియు వ్యభిచారమును ఉంచును. కనుక మీరు భక్తి గళవారమని చెప్పు అనేకులలో ఈ విధమైన లక్షణాలను మీరు చూడవచ్చు. క్రీస్తు నీ పాదములను అనుదినము కడిగి, క్రీస్తుతో సహవాసము కలిగి ఉండునట్లు నిన్ను సంపూర్ణముగా కడుగును. కనుక నీవు సేవకుడవా లేక ముఖ్యమైన వాడివా నిన్ను నీవే పరిశీలించుకో ?

ప్రార్థన: ప్రభువా మీరు మా కొరకు మీ మహిమను విడిచి వచ్చినందుకు నీకు కృతజ్ఞతలు. నీవు నీ శిష్యుల పాదములను కడుగుట చాలించిన తరువాత మా హృదయములను కడుగుటకు ప్రారంభించావు. మీ సేవకులము అగుటకు మా ప్రతి గర్వము నుంచి మరియు ద్వేషము నుంచి కాపాడు. నేను నా సంఘములో మరియు నా కుటుంబముతో నిన్ను సేవించుటకు సహాయమును దయచేయుము.

ప్రశ్న:

  1. యేసు తన శిష్యుల పాదములను కడుగుట అనునది దేనికి అర్థము ?

యోహాను 13:12-17
12 వారి పాదములు కడిగి తన పైవస్త్రము వేసికొనిన తరువాత, ఆయన మరల కూర్చుండినేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? 13 బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు; నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. 14 కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన యెడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే. 15 నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని. 16 దాసుడు తన యజమానునికంటె గొప్పవాడు కాడు, పంపబడినవాడు తన్ను పంపిన వానికంటె గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 17 ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసినయెడల మీరు ధన్యులగు దురు.

యేసు తన చివరి దినాలను తన మాటలద్వారా చెప్పలేదు. ఎందుకంటె ఆ మాటలు అప్పుడప్పుడు కార్యములను తీసుకొని వెళ్తుంటాయి కనుక. అందుకే అతను తన శిష్యులను తన మాటలను తీసుకొన్నారు అని అడిగి వాటి ప్రకారము కార్యము చేశారా , " నేను మీదగ్గర ఉన్నానని మీరు చూచునట్లు మీ కన్నులను తెరువుము. నేను మీరు నాకు బానిసలు అయి ఉండులాగున నేను మీ కంటే ఎత్తులో కూర్చోండలేదు. నేను నా మహిమను వదిలి మీలో ఒకనిగా ఉండుటకు వచ్చాను. దానికంటే ఎక్కువగా పరిశుద్ధ స్థలమును వదిలి నా బోధనను మరియు నా మహిమను మీకొరకు వదిలి వచ్చాను. ఇప్పుడు ప్రేమ అనునది ఎంత గొప్పదో ఇప్పుడు మీకు అర్థము అయినదా ? గర్వము కలిగిన వాడు ఒంటారిగా ఉందును, అయితే ఎవరతే ప్రేమకలిగి తగ్గింపు కలిగి ఉంటారో వారు కార్యములను జరిగించుదురు, వారు వారి జీవితములను విడిచి దేవునికి ఇష్టమైన కార్యములను చేయుదురు.

" నేను మీకు ఒక మాదిరిగా ఎలా ఉన్నానో ఆలాగుననే మీరు కూడా నా శిష్యులగునట్లు ఉండుడి, నేను ఎక్కువగా మాట్లాడక కార్యములు చేయుదును. కనుక నన్ను చూడుము. నేను ఒక సేవకుడను. నీవు నన్ను వెంబడించాలని అనుకుంటే ఇతరులకు పరిచర్యచేయుము. ఎవరైతే కార్యముచేయుటలో మరియు పరిచర్యచేయుటలో ముందుండాలని అనుకొంటే వారు గర్వము కలిగిన వాడు, అయితే ఎవరైతే మౌనముగా ఉండి తమ కార్యములను క్రీస్తు మహిమ కొరకు చేస్తుంటారో వారు నిజముగా గొప్పవారు."

" సంఘము పరిశుద్దులను ఎనుకొనును అని అనుకొనవద్దు. ఎందుకంటె వారందరు ఆ విధముగా ఉండుటకు ప్రయత్నమూ చేస్తున్నారు. నేను వారినందరిని పరిశుద్దులను గా చేసినాను. అయితే ప్రతి ఒక్కరికి ఆత్మీయ ఎదుగుదలకు సమయము అవసరము. ఇక్కడ నా ఆజ్ఞ ఉన్నది : మీ దోషములను మీ పొరపాటులను బట్టి ఒకరినొకరు క్షమించుకోండి. ఒకరికొకరు తీర్పు చెప్పకండి అయితే సహకరించుకోండి. ఇతరుల తాళాలను కడగవద్దు అయితే వారి పాదములను కడుగుడి. ఎవ్వరు కూడా ఇతరులకు ఒక ప్రభువుగా ఉండవద్దు; ఎందుకంటె మీరు సహోదరులు . ఒక వేళా మీరు ఆ విధముగా ఉన్నట్లయితే నేను ముందుగానే చెప్పినట్లు ఉండెదరు, కనుక అందరి కొరకు త్యాగము కలిగి ఉండుడి."

" నేను ఈ లోకములోనికి మిమ్ముఁయ్లను అపొస్తలుగా మరియు ప్రేమకు ప్రతి రూపముగా పంపియున్నాను. పంపువాడు పంపినవానికంటే గొప్పేవాడు. మీ మొదటి కార్యము ఏమిటి అంటే నా మాదిరి సేవకుడు అవ్వడమే. కనుక నీవు వీటిని కనుగొనినయెడల అప్పుడు నీవు క్రైస్తత్వములో ఏ విధముగా ఉండాలో తెలుసుకొనెదవు. "

" నా రెండవ సూత్రము : మీరు దీనిని తెలుసుకొనినట్లైతే ,దానిని చేసినట్లయితే మీరు ఆశీర్వదించబడినవారు. నేను నా మాటలద్వారా ప్రేమను బట్టి మాట్లాడలేదు; అయితే నేను దానిని చేసాను. " పరిచర్య అనునది ఒక పని మరియు త్యాగము, అయితే మాట కాదు. అయితే విశ్వాసుల ఉత్సాహము అది వారి సహజము. దీని ద్వారా ప్రేమ అనునది కార్యమును చేయును. ఒకడు కార్యము చేయని యెడల అతను విశ్వాసముతో ఉండుట చాల కష్టము. నీవు మంచి కార్యముల ద్వారా రక్షించబడలేదు; అయితే ఇది కేవలము చిందించిన రక్తము ద్వారానే. ఒకవేళ నీవు దిక్కుమాలిన హారము చేసినట్లయితే , అప్పుడు నీవు దేశము తిరిగెదవు, కనుక దేవుని ఆనందముతో నింపబడి ఉండు.

సహోదర, నీవు ఉపాధ్యాయుడవుగా మరియు ముఖ్యమై వాడిగా ఉండాలని అనుకున్నావా ? అయితే క్రీస్తు వైపు చూడు. ఎందుకంటె అతను ఉపాధ్యాయుడు . అతను నీ ముందర ఒక సేవకునిగా నిలబడి ఉన్నాడు. నీవు అతని బోధనలను చేయాలనుకున్నావా? అయితే ఈ దినమునుంచే సేవచేయడము ప్రారంభించు. కనుక ప్రార్థనలో నీవు ఎవరిని, ఎక్కడ సేవ చేయాలో దేవుడిని అడుగు. నీకు ఒకవేళ ఇది తెలిసిఉంటే నీవు ఆశీర్వదించబడినవాడవు .

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 11:52 AM | powered by PmWiki (pmwiki-2.3.3)