Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 077 (Jesus enters Jerusalem)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 3 - అపొస్తలులలో వెలుగు ప్రకాశించుట (యోహాను 11:55 – 17:26)
A - పరిశుద్ధ వారము ప్రరంభము (యోహాను 11:55 – 12:50)

2. యెరూషలేములోని యేసు ప్రవేశించుట ( యోహాను 12:9-19)


యోహాను 12:9-11
9 కాబట్టి యూదులలో సామాన్యజనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలిసికొని, యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలోనుండి ఆయన లేపిన లాజరునుకూడచూడవచ్చిరి. 10 అతనినిబట్టి యూదులలో అనేకులు తమవారిని విడిచి యేసునందు విశ్వాస ముంచిరిగనుక 11 ప్రధానయాజకులు లాజరునుకూడ చంప నాలోచనచేసిరి.

అల్లరిగా ఉండే వారికి యేసు లాజరును కలుసుకొనుటకు వచ్చేనని వినిరి. అప్పడు అక్కడున్న గుంపులు యెరూషలేము మరియు ఒలీవ పర్వతమునకు మరియు బెథానీ అను స్థలమునకు జీవమునిచ్చు వానికి సాక్ష్యము ఇచ్చుటకు వచ్చిరి.

యాజకులు సద్దూకయ్యుల దగ్గరకు వచ్చిరి, వారు క్రీస్తు పునరుత్థానమును నమ్మలేదు, మరియు అతను ఆత్మపూర్వకముగా ఉన్నాడని కూడా నమ్మలేదు. అయితే వారు యేసును మరియు లాజరును కూడా ద్వేషించిరి, మరియు అతని అద్భుతములను బట్టి ఆలోచించక ఆ అద్భుతములు చేసిన వాడిని చంపుటకు మైర్యు ఆ ఇద్దరినీ చంపి సమాధి చేయాలనీ అనుకొనిరి, ఎందుకంటె మరణమునకు నిరీక్షణ లేదు అని నిరూపించుటకు . అదేసమయములో యేసు మీద కలిగిన ప్రతి విశ్వాసమును కూడా కూల్చాలని అనుకొనిరి, ఎందుకంటె చనిపోయిన లాజరును క్రీస్తు లేపి యున్నాడు కనుక అతనే మెస్సయ్య అని వారందరు కూడా విశ్వసించిరి కనుక .

యోహాను 12:12-13
12 మరునాడు ఆ పండుగకు వచ్చిన బహు జనసమూ హము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని 13 ఖర్జూరపుమట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలువేసిరి.

యేసు నామము అక్కడున్న ప్రతి నాలుక మీద ఉండెను, మరియు అతని ఘానా కార్యములు కూడా ఉండెను ," ఈ పట్టణమును పట్టుకొంటాడా లేక విడిచివెళ్తాడా ?" ఒక రాత్రి బేథాని లో ఉంది ఉదయమే క్రీస్తు తన శిష్యులతో కలిసి యెరూషలేమునకు వెళ్ళుటకు సిద్దపడెను, " క్రొత్త రాజు వచ్చాడు మరియు క్రొత్త మహిమ వచ్చినది ". చాల మంది యేసు చేయబోవు అద్భుతములను చూచుటకు ఆశకలిగి ఉండిరి. కొంతమంది తాటి చెట్ల కొమ్మలను నరికి క్రీస్తుకు వాటితో స్వాగతము పలికిరి. ఇతరులు పాటలతో ఆ రాజునూ స్వాగతించిరి. వారు గంభీరంగా , " మేము మిమ్ములను ఘనపరచి ఆరాధిస్తాము. నీవు శక్తి కలిగిన వాడవు. ఆశీర్వాదాలు తెచ్చినందుకు నీకు కృతజ్ఞతలు. మా ప్రతి విధమైన సిగ్గునుంచి మమ్ములను తప్పించు. నీవు మా రక్షకుడవు, మరియు నా నాయకుడవు. నీవు మా నిజమైన రాజువు. "

యోహాను 12:14-16
14 సీయోను కుమారీ, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిదపిల్లమీద ఆసీనుడై వచ్చుచున్నాడు 15 అని వ్రాయబడినప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దానిమీద కూర్చుండెను. 16 ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు గాని యేసు మహిమ పరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడెననియు, వారాయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చు కొనిరి.

యేసు వారికున్న నొప్పులను బట్టి స్పందించలేదు, ఎందుకంటె వారు సంతోషముతో వారికి నచ్చినట్లుగా ఆయనను స్వాగతించిరి కనుక, అయితే వారు కేకలు మరియు అరుపులతో క్రీస్తును ఘనపరచిరి. కనుక యేసు గాడిద మీద కూర్చోండి వారి ఆశను తీర్చెను, " జెకర్యా 9 :9 లో చెప్పినట్టు నేను రాజును. కనుక భయపడక ఘనపరచుము. నేను ఈ పట్టణపు గోడలను మరియు ద్వారములను పాడుచేయను. నేను దేవుని తీర్పును తీసుకోను మరియు హత్యచేయను. నేను తల్లి తండ్రులు లేని వారిని , విధవరాండ్రను ప్రేమించుటకు వచ్చియున్నాను. "

అయితే బాధకలిగిన విషయమును బట్టి ఎవ్వరు కూడా నీటి కలిగి లేరు. అయితెహ్ ప్రతి ఒక్కరు వారి మార్గములను చూసుకొనుచున్నారు. నేను నిన్ను నాశనము చేయను అయితే నీలో ఉన్న అపవిత్రతను మాత్రమే నాశనము చేస్తాను. నేను నా శరీరముతో నీ పాపమును మోయుదును మరియు అదేసమయములో అప్పుడప్పుడు నీ బలహీనతతో కూడా ఉంది నిన్ను బలపరతును. నిన్ను దేవుని ఉగ్రత నుండి తప్పించి; ఎందుకంటె అతను ఆత్మీయముగా విజయము కలిగి వచ్చాడు కాబట్టి. "

" నీవు ఒక పరాక్రమము కలిగిన నాయకుని కొరకు ఆశకలిగి ఉన్నావు అయితే నేను తగ్గింపు స్వభావము కలిగి నీ దగ్గరకు వచ్చాను. నేను నా చిత్తమును నా తండ్రికి సమర్పించుకొన్నాను. నీవు విజయమును కోరుకొన్నావు , అయితే నేను నీకు పచ్చటప హృదయమును కలిగించి దేవునితో సమాధాన పరచియున్నాను. నేను ఒక గుఱ్ఱము మీద, లేదా ఒంటె మీద రాలేదు అయితే గాడిద మీద కూర్చుండి వచ్చాను. నా నుంచి ధనమును కానీ లేదా ఐశ్వర్యమును కానీ ఆశించకు, ఎందుకంటె నేను నిత్యజీవమును ఇచ్చుటకు వచ్చియున్నాను, నీ కొరకు పరలోక ద్వారములు తెరచుటకు వచ్చి దేవునితో సహవాసము కలిగి ఉండునట్లు చేసాను."

ఈ ఉపమానమును అక్కడున్న క్రీస్తు శిష్యులు కానీ లేక ఆ ప్రజలు కానీ అర్థము చేసుకొనుటలో విఫలము అయినారు. అయితే అతను అవరోహణము అయి మరియు పరిశుద్ధాత్మను పంపిన తరువాత వారందరు అర్థము చేసుకొన్నారు. అయితే పరిశుద్ధాత్ముడు వారిని క్రీస్తు కనపడినప్పుడు ఆనందము కలిగి ఉండులాగున వారిని నడిపించి ఈ ఉపమానమునకు గల అర్థమును వారికి తెలియపరచెను.

యోహాను 12:17-19
17 ఆయన లాజరును సమాధిలోనుండి పిలిచి మృతు లలోనుండి అతని లేపినప్పుడు, ఆయనతో కూడ ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి. 18 అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసెనని జనులు విని ఆయనను ఎదుర్కొన బోయిరి. 19 కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములెట్లు నిష్‌ప్రయోజనమై పోయినవో చూడుడి. ఇదిగో లోకము ఆయనవెంట పోయినదని చెప్పుకొనిరి.

బెథానీ నుంచి క్రీస్తుతో పాటు వెంబడించినవారు కిద్రోను అను కొండల సందులో ఆయనను స్వాగతము పలికిరి. అక్కడ వారు , " మీరు ఆయనను మంచిగా తీసుకొని వచ్చారు, ఎందుకంటె యేసు మెస్సయ్య కాబట్టి, అతను మరణించినవానిని కూడా లేపాడు ." లాజరును లేపుట ఆయనను వెంబడించువారికి ఒక ఉదాహరణగా ఉంది మరియు ఐదు వేళా మందికి ఆహారమును కూడా పంచి పెట్టడము కూడా అదేవిధముగా ఉన్నది. కనుక ఇక్కడ వేరే గుంపు కూడా యేసును వెంబడిస్తున్నది కూడా యేసు మృతిని లేపాడని. అయితే ఇక్కడ మనము గమనించినట్లయితే రెండు గుంపులవారు కూడా క్రీస్తును ఈ లోక సంబంధమైన ప్రేమ చేతనే ప్రేమించారు ఎందుకంటె అతను ఈ రెండు అద్భుత కార్యములు చేసాడు కనుక. మరియు వారు మేము కూడా పచ్చాత్తాపము కలిగి ఉండాలని మాత్రమే అనుకొనలేదు.

ఇక్కడ ఆ గుంపుతో పాటు పరిసయ్యులు కూడా ప్రక్కన నిలుచుని కోపముగా ఉంది యేసు ఆ పట్టణమును ఆక్రమించుటకు వేచిఉండిరి. అయితే వారు వారి ప్రయత్నములో విఫలమయిరి. అయితే క్రీస్తు మాత్రమూ ఆ పట్టణములోనికి విజయము చేత ప్రవేశించెను.

ప్రార్థన: ప్రభువా నీ పరిశుద్దాత్మ నా లోనికి ప్రవేశించు నాట్లు నా హృదయమును తెరచెదను, కనుక నీ రూపము నాలో ఉంచుము. నా హృదయములో నిన్ను ప్రవేశించుటకు నేను అర్హుడను కాను కనుక నా పాపములను క్షమించుము. నీవు నన్ను ప్రేమించావు ఎందుకంటె నన్ను దేవునితో సహవాసము కలిగి ఉంది మరియు అతని రాజ్యములో సమాధానము కలిగి ఉండులాగున చేసినావు. " హోసన్నా యేసు నామములో వచ్చువాడు ఆశీర్వదించబడిన వాడు " అని మేము కూడా అనుటకు ఆశకలిగి ఉన్నాము. నీవు నా రాజువు నేను నీ దాసుడను . ఆమెన్ .

ప్రశ్న:

  1. యెరూషలేములోని యేసు ప్రవేశించుట దేనికి సాదృశ్యము ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 11:30 AM | powered by PmWiki (pmwiki-2.3.3)