Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 074 (The raising of Lazarus)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 2 - చీకటిలో వెలుగు ప్రకాశించుట (యోహాను 5:1 - 11:54)
C - యెరూషలేమునకు యేసు యొక్క చివరి ప్రయాణము (యోహాను 7:1 – 11:54) చీకటికి మరియు వెలుగుకి మధ్య విభజన
4. లాజరును లేపుట (యోహాను 10:40 - 11:54)

c) లాజరును లేపుట (యోహాను 11:34-44)


యోహాను 11:38-40
38 యేసు మరల తనలో మూలుగుచు సమాధియొద్దకు వచ్చెను. అది యొక గుహ, దానిమీద ఒక రాయి పెట్టియుండెను. 39 యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయినవాని సహోదరియైన మార్తప్రభువా, అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికి వాసనకొట్టునని ఆయనతో చెప్పెను. 40 అందుకు యేసు నీవు నమి్మనయెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను;

యెరూషలేము చుట్టూ ఉన్నవారు ఎవరైనా చనిపోతే వారి సమాధిని ఒక పెద్ద బాండ రాయిని సమాధికి ముందర పెట్టుట ఒక అలవాటుగా ఉన్నది. ఆ రాయిని కుడివైపునకు మరియు ఎడమ వైపునకు కదిలించుటకు మరియు మూయుటకు లేదా తెరచుటకు అవకాశము కలదు.

కనుకనే లాజరు చనిపోయిన తరువాత అతని సమాధికి ఒక రాయి ముందుగా పెట్టుట గమనించగలము . అయితే చావు దేవుని ఉగ్రతను అనగా పాపులు దేవుని ఉగ్రతలో ఉండి, చనిపోతారని మరియు వారు నాశనము చేయువారికి ఇవ్వబడతారని అనుకొన్నారు. అయితే సృష్టికర్త అయినా దేవునికి ఆ విధమైన ఉద్దేశము లేదు అయితే ప్రతి ఒక్కరు పచ్చాత్తాపం పడి వారి జీవితములను మార్చుకొనుటకు ఇష్టపడిరి.

యేసు ఆ బండను తీయమని ఆజ్ఞాపించెను. అయితే అక్కడున్న వారు ఆశ్చర్యపడిరి , ఎందుకంటె చనిపోయిన శరీరమును వారు తాకకూడదు. అందుకే మార్తా , " ప్రభువా చనిపోయిన వారిని కదిలించుట మంచిదికాదు ". మార్తా నీ విశ్వాసము ఎక్కడ ? నీవు ఇప్పుడే యేసు దేవుని కుమారుడైన మెస్సయ్య అని అంగీకరించావు మరియు అతను మృతిని లేపగలదని చెప్పావు. కనుక మరణము యొక్క సత్యము మరియు సమాధి యొక్క రూపము ఆమె కన్నులకు కనపడలేదు మరియు ఆమె ప్రభువు ఏమి ఆశిస్తున్నాడో కూడా తెలియదు.

ఏదేమైనప్పటికీ, క్రీస్తు ఆమెను బలపరచి మరియు ఆమె విశ్వాసమును స్థిరపరచెను. అతను దేవుని మహిమను అక్కడ చూపించాలని ఆజ్ఞాపించెను. అయితే యేసు , " నీవు నన్ను నమ్మినట్లైతే అప్పుడు గొప్ప అద్భుతములు చూడగలవు " అని చెప్పలేదు. అయితే యేసు ముందుగానే శిష్యులకు లాజరు యొక్క రోగము మరణకరమైనది కాదు, అయితే దేవుని మహిమకొరకై (యోహాను 11:4). యేసుకు తన తండ్రి యొక్క చిత్తము ఏదో తెలుసు. కనుక మార్తా యొక్క మనసును దేవుని నిజమునకు తీసుకురావాలని ప్రయత్నించెను. అది విశ్వాసమునకు కూడా పరీక్షగా ఉన్నది. అయితే ఆటను ఘనపరచబడుట కాదు అయితే అతని తండ్రి అతనిలో మహిమపరచబడటమే.

అదేవిధముగా క్రీస్తు నీకు కూడా చెప్పియున్నాడు, " నీవు నమ్మినట్లైతే దేవుని మహిమను చూసేడవు " కనుక నీ కన్నులను నీ సమస్యలనుంచి మరియు కష్టములనుంచి ట్రిప్కు. నీ పాపములను బట్టి దోషములను బట్టి చింతించక తల్లి వైపు పిల్లలు ఏవిధముగా చూస్తారో అదేవిధముగా యేసు వైపు చూడు. అతను నిన్ను ప్రేమించులాగున అతని చిత్తమే నీయందు జరగనియ్యుము.

యోహాను 11:41-42
41 అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి తండ్రీ, నీవు నా మనవి వినినందున నీకు కృత జ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 42 నీవు ఎల్లప్పుడును నా మనవి వినుచున్నావని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టు నిలిచియున్న యీ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై యీ మాట చెప్పితిననెను.

క్రీస్తు పైన మార్తా యొక్క విశ్వాసము యేసు యొక్క ఆజ్ఞ మీద ఆధారపడి ఉన్నది. అందుకే అక్కడున్న వారికి ఆ సమాధిమీద ఉన్న రాయి తొలగించుమని చెప్పినది. అయితే అక్కడున్నవారికి ఇది వారికి ఒక బిగువు మాదిరి అయినది. యేసు ఆ సమాధిలోకి ప్రవేశించునా లేక అతను ఏమి చేయును ?

అయితే యేసు సమాధి దగ్గర మౌనముగా ఉన్నాడు. తన కన్నులను పైకి ఎత్తి మాట్లాడినాడు. ఇక్కడ మనకు క్రీస్తు చేసిన ప్రార్థన రికార్డెడ్గా ఉన్నది. అతను తన జీవితమును బట్టి అనగా తన జీవితములో తండ్రి అయినా దేవుడు ఉన్న ప్రతి కారణమును బట్టి అతనికి కృతజ్ఞతలు చెప్పెను. లాజరు తిరిగి లేచే ముందు యేసు అతని తండ్రికి నిజముగా కృతజ్ఞత చెప్పెను. ఎప్పుడైతే వేరే వాళ్ళు ఏడ్చారో అప్పుడు క్రీస్తు ప్రార్థన చేసాడు. అతను అతని తండ్రికి తన స్నేహితులను గురించి వారు మరణమును జయించునట్లుగా సహాయమును దయచేయుమని అడిగెను. అతని తండ్రి తనకు మరణమును జయించు శక్తిని దయచేసి ఉన్నాడని కృతజ్ఞత చెప్పెను. తన ప్రారతనాలు తండ్రి అయినా దేవుడు ఆలకిస్తాడని నమ్మెను. ఎందుకంటె అతను తన తన తండ్రి స్వరమును ఎల్లప్పుడును వినియున్నాడు కనుక. అతని జీవితమంతా తండ్రికి ప్రార్థన చేసినాడు అయితే ఈ విషయములో మాత్రమూ అతను గంభీరంగా ప్రార్థన చేసియున్నాడు ఎందుకంటె వారు అతని మర్మములను తెలుసుకొనుటకు. కుమారుడు ఎప్పుడు కూడా తనకు ఘనత రావాలని కానీ లేక గౌరవము రావాలని కానీ అనుకొనలేదు. అయితే తండ్రి అయినా దేవుని కార్యములు కుమారుని ద్వారా జరిగించబడియున్నాయి. అందుకే లాజరును తిరిగి లేపియున్నాడు. ఇవన్నీ కూడా కుమారుడు ఆ ప్రజలందరి ముందర చెప్పియున్నాడు దీని ద్వారా వారు తనని తండ్రి పంపి యున్నాడని నమ్ముటకు. కనుక లాజరును లేపుట తండ్రికి గతనాథ కలిగినది, మరియు త్రిర్వమునకు ఉన్న ఐక్యతను కూడా దీని ద్వారా కనపరచబడినది.

యోహాను 11:43-44
43 ఆయన ఆలాగు చెప్పిలాజరూ, బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా 44 చనిపోయినవాడు, కాళ్లు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను; అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతట యేసు మీరు అతని కట్లు విప్పిపోనియ్యుడని వారితో చెప్పెను.

యేసు ఏడ్చిన తరువాత " లాజరు బయటికి రా " అని బిగ్గరగా చెప్పినాడు, దేవునికి మహిమ చెల్లించిన తరువాత చనిపోయిన లాజరు విని (ఎందుకంటె చనిపోయిన వారికి వినపడదు) . అయితే మనిషి యొక్క వ్యక్తిత్వము మరణమును నశింపదు. పరలోకములో విశ్వాసుల పేర్లు లిఖించబడతాయి. సృష్టికతయైన మరియు జీవమును ఇచ్చిన వాడు మరణమును తిరిగి జీవములోనికి నడిపించును. పరిశుద్ధాత్ముడు ప్రారంభములో ఏవిధముగా ఉంటాడో అదేవిధముగా క్రీస్తు కూడా విశ్వాసులకు దగ్గరగా ఉండును.

సహజముగా లాజరు యేసు స్వరమును విని అతనికి లోబడివుంటాడు. కనుక సమాధిలో కూడా అతని స్వరమును కూడా విన్నాడు. క్రీస్తు జీవన విధానములను లాజరు వెంబడించాడు; అప్పుడు అతని గుండె కొట్టుకొనుట , అతని కన్నులు తెరువబడుట మరియు అతని ఎముకలు కదులుట జరుగును .

తరువాత , రెండవ అద్భుతము జరుగడము ప్రారంభమాయెను, లాజరు గుడ్డలతో గట్టిగా కట్టబడెను. ఆ సందర్భములో లాజరు ఎటు కదలలేని స్థితిలో ఉన్నాడు. అతని మోహము మీద ఉన్న గుద్దను తీయుటకు అతనికి అవకాశము లేదు అయేందుకంటే అతని శరీరమంతా కూడా గుడ్డలతో కట్టబడెను కనుక. కనుక యేసు ఆ గుడ్డలను విప్పమని ఆజ్ఞాపించెను.

అప్పడు లాజరు యొక్క మోహమును చూసి ఎంతో ఆశ్చర్యము కలిగినది, అతని కత్తులతో అటు ఇటు కదులుట చూసి. లాజరు క్రీస్తు దగ్గరకు వచ్చుట చూసి అందరు ఆయనవైపు చూసిరి.

లాజరు ఆ గుంపులోనే తన ఇంటికి బయలుదేరి వెళ్లెను. అయితే యోహాను ఈ విషయమును బట్టి అక్కడున్నవారు ఈ అద్బుతమును చూసి వారి తాళాలను వంచి నట్లుగా లేదా సంతోషమైన కన్నీరు పెట్టుకొనుటను బట్టి వ్రాయలేదు. మరియు ఈ సందర్భమును అవరోహణము అవుతున్న విశ్వాసులతో పోలికను కూడా చేయలేదు. కనుక యోహాను మనముందర ఎలాంటి సంఘటనల ద్వారా క్రీస్తు ఎలాంటి వాడో మరియు అతని మీద మనము ఏవిధమైన విశ్వాసము కలిగి ఉండాలో మనకు క్లుప్తముగా వివరించెను. యోహాను అక్కడున్న వారందరితో పాటు కూడా ఉంది ఈ అద్బుతమును చూసాడు మరియు దీనికంటే ముందుగానే అతను క్రీస్తు స్వరమును మరియు అతని రాకడను బట్టి ఇతరులకు చెప్పియున్నాడు. నీవు విశ్వాసముచేత క్రీస్తుతో కూడా మరణమును జయించి లేచావా ?

ప్రార్థన: ప్రియా మయిన ప్రభువా లాజరును నీవు తిరిగి లేపినందుకు కృతజ్ఞతలు. నీవు కూడా మృతిని జయించి లేచావు. మాలో నీ జీవమును బట్టి కూడా కృతజ్ఞతలు. విశ్వాసము ద్వారా మేము కూడా నీతో పాటు లేచి ఉన్నాము. సమస్త దేశములో ఉన్న అందరిని కూడా వారి మరణము నుంచి లేపుమని మేము నిన్ను కోరుకుంటున్నాము.

ప్రశ్న:

  1. లాజరును యేసు తిరిగి లేపుటలో అతని మహిమ ఏవిధముగా కనబడినది ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 11:27 AM | powered by PmWiki (pmwiki-2.3.3)