Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 071 (Jesus across the Jordan)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 2 - చీకటిలో వెలుగు ప్రకాశించుట (యోహాను 5:1 - 11:54)
C - యెరూషలేమునకు యేసు యొక్క చివరి ప్రయాణము (యోహాను 7:1 – 11:54) చీకటికి మరియు వెలుగుకి మధ్య విభజన
4. లాజరును లేపుట (యోహాను 10:40 - 11:54)

a) యొర్దానును యేసు దాటుట ( యోహాను 10:40 - 11:16)


యోహాను 11:11-16
11 ఆయన యీ మాటలు చెప్పిన తరువాతమన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు; అతని మేలు కొలుప వెళ్లుచున్నానని వారితో చెప్పగా 12 శిష్యులు ప్రభువా, అతడు నిద్రించినయెడల బాగుపడుననిరి. 13 యేసు అతని మరణమునుగూర్చి ఆ మాట చెప్పెను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పెననుకొనిరి. 14 కావున యేసు లాజరు చనిపోయెను, 15 మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను; అయినను అతనియొద్దకు మనము వెళ్లుదము రండని స్పష్టముగా వారితో చెప్పెను. 16 అందుకు దిదుమ అనబడిన తోమాఆయనతో కూడ చనిపోవుటకు మన మును వెళ్లుదమని తనతోడి శిష్యులతో చెప్పెను.

లాజరు యేసు ద్వారా " నా ప్రియమైన వాడు " అని చెప్పబడ్డాడు. అప్పుడప్పుడు యేసు మరియు అతని శిష్యులు లాజరు ఇంటికి ఒక అతిధులుగా వెళ్లియుండిరి. కనుక అతను అందరికి ఒక స్నేహితుడుగా ఉండెను. కనుక మనము లాజరును " క్రీస్తు స్నేహితుడు " అని కూడా అనవచ్చు, అబ్రాహాము కూడా " దేవుని స్నేహితుడని " చెప్పినట్లు.

యేసు " నిదురించుట" అను పదమును మరణమునకు వాడియున్నాడు, ఎందుకంటె మరణము జీవితమునకు ఒక చివరి ఘట్టము కాదు కాబట్టి. మన శరీరము నశిస్తుంది అయితే ప్రాణము పట్టుదలతో ఉంటుంది. ఈ రోజులలో మన విశ్రాంతి అనునది విశ్వాసముతో క్రీస్తులో ఉన్నది. మనము అతని జీవితములో తృప్తిపొందియున్నాము, మరియు మనము రక్షకుడైన యేసు యొక్క పునరుతనా దినమును బట్టి జాగ్రత్తకలిగి నిరంతరమూ నిలిచెదము.

" నేను వెళ్లి అతనిని లేపుదును " , అని యేసు చెప్పెను . మరియు " మనము దేవునిని అడిగి ఏవిధముగా ఈ కుటుంబమును ఓదార్చాలో కనుగొండము " అని యేసు చెప్పలేదు, అయితే రెండు దినముల ముందే తన తండ్రి ద్వారా తన స్నేహితుడు చనిపోతాడని తెలిసికొని మరియు ఈ కార్యము ద్వారా తన తండ్రి మహిమపరచబడవలెను అని అనుకొనెను. దీని ద్వారా అతనిని వెంబడించు వారిని బలపరచి మరియు ఇతనే మెస్సయ్య అనే నమ్మకమును కలిగించెను. అందుకే , " నేను వెళ్లి అతనిని లేపేడను " అంటే ఒక తల్లి , " నేను వెళ్లి నా కుమారునికి లేపేడను ఎందుకంటె స్కూల్కి సమయము అయినది " అని చెప్పినట్లు ఉన్నది. యేసు జీవితమునకు జీవము కలిగి మరియు మరణమునకు ప్రభువై ఉన్నాడు.కనుక క్రీస్తులో విశ్వాసము మరణమును జయించి దానికున్న భయమును తీసివేసెను.

అయితే ఆ సమయములో క్రీస్తు చెప్పిన విజయమును గూర్చి శిష్యులకు అర్థము కాలేదు. వారు లాజరు నిదిరించాడని అనుకొనిరి; కనుక అతని దగ్గరకు వెళ్లి లేపుటకు ఏ కారణమూ లేదనిరి. అయితే వారు యూదుల చేతులలో హయాములో ఉండిరి.

అప్పుడు యేసు లాజరు మరణమును గూర్చి క్లుప్తముగా చెప్పెను, " అతను మరణించాడు ". ఈ వార్త అతని శిష్యులను భంగపరచెను, అయితే క్రీస్తు వారికి ధైర్యమును ఇచ్చి, " నేను ఆనందించెదను " అనెను. ఇదే దేవుని కుమారుని యొక్క మరణమును చూపించెను. అతను జయమును మరియు పునరుతానమును చూసేను. కనుక మరణము అంగలార్పునకు మాత్రమే సాదృశ్యము కాదు అయితే ఆనందమునకు కూడా . అయితే తనం శిష్యులకు యేసు జీవితమును ఇచ్చెను. కనుక అతను జీవము కలిగి ఉన్నాడు కనుక ఎవరైతే అతని యందు ఉంటారో వారు జీవింపబడుదురు.

యేసు ఇంకా చెప్తూ, " మిమ్ములను బట్టి నేను ఆనందించుచున్నాను, ఎందుకంటె అతని మరణమందు నేను లేను, మరియు అప్పటికప్పుడు నేను స్వస్థతపరచలేదు. ఇది ప్రతి ఒక్కరి అంత్యమునకు ఒక సాదృశ్యముగా ఉన్నది, ఏదేమైనా అతని యందు విశ్వాసము నూతన జీవితమునకు ప్రారంభమవును. కనుక మనము అతని యొద్దకు వెళ్లుదము రండి , " ఇది మనుషుల ఏడుపును చూపును, అయితే క్రీస్తుకు ఇది పునరుత్థానమును సూచించును. మేము ఎప్పుడు సమాధులలో అబద్ధము చెప్పాము , అని యేసు చెప్పిన దానికి దేవునికి కృతజ్ఞతలు, " మనము అతని యొద్దకు వెళ్లుదము ". అతని యొద్దకు వెళ్ళుట అనునది జీవమునకు మరియు వెలుగుకు సాదృశ్యము.

తోమా యేసును ప్రేమతో ప్రేమించిన తెలివైన శిష్యుడు. ఎప్పుడైతే వారు ఇది గమనించారో అప్పుడు వారు క్రీస్తు వారి సమాధులనుంచి తప్పించుటను గమనించిరి, మరియు తోమా , " మనము క్రీస్తును ఒంటరిగా వదలము; మనము మన ప్రభువుని ప్రేమించి మరణము వరకు బంధము కలిగి ఉందుము. మనమందరము అతనిలో కట్టుబడి ఉన్నాము ".

ప్రశ్న:

  1. లాజరును లేపుటకు యేసు ముందుగానే ఎలా నిర్ణయించెను ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 11:25 AM | powered by PmWiki (pmwiki-2.3.3)