Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 069 (The Son of God in the Father and the Father in him)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 2 - చీకటిలో వెలుగు ప్రకాశించుట (యోహాను 5:1 - 11:54)
C - యెరూషలేమునకు యేసు యొక్క చివరి ప్రయాణము (యోహాను 7:1 – 11:54) చీకటికి మరియు వెలుగుకి మధ్య విభజన
3. యేసు మంచి కాపరి (యోహాను 10:1-39)

e) తండ్రిలో దేవుని కుమారుడు , మరియు కుమారునిలో తండ్రి (యోహాను 10:31-36)


యోహాను 10:31-36
31 యూదులు ఆయనను కొట్టవలెనని మరల రాళ్లుచేత పట్టుకొనగా 32 యేసు తండ్రి యొద్దనుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని; వాటిలో ఏ క్రియ నిమిత్తమునన్నురాళ్లతోకొట్టుదురనివారినడిగెను. 33 అందుకు యూదులునీవు మనుష్యుడవై యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో 34 అందుకు యేసుమీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియుండలేదా? 35 లేఖనము నిరర్థకము కానేరదు గదా, దేవుని వాక్యమెవరికి వచ్చెనో వారే దైవములని చెప్పినయెడలనేను దేవుని కుమారుడనని చెప్పినందుకు, 36 తండ్రి ప్రతిష్ఠచేసి యీ లోకములోనికి పంపినవానితోనీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా?

" నేను నా తండ్రి ఒక్కటే " అనే క్రీస్తు మాటను బట్టి యూదులు క్రీస్తును ద్వేషించిరి. " వారు అతని సాక్ష్యమును వెక్కిరించి అతని పైన రాళ్లతో కొట్టుటకు సిద్దపడిరి , లేనియెడల దేవుని ఉగ్రత వారి దేశముపైకి వచ్చునని అనుకొనిరి. కనుక వారు రాళ్లు తీసుకొని క్రీస్తును కొట్టుటకు ప్రయత్నించిరి.

యేసు వారిముంచు మౌనముగా నిలిచి, ఈ విధముగా అడుగుతున్నాడు, " మీకు నేను ఏ చేదు చేసాను ? నేను మిమ్ములను బాగుచేసాను, మీ అనారోగ్యమును స్వస్థత పరచాను మరియు దురాత్మలను దూరము చేసి గ్రుడ్డివారి కళ్ళు తెరిచాను. నేను కుష్ఠురోగమును బాగుచేసి బీదలకు సువార్తను చెప్పను. కనుక ఈ కార్యములను బట్టి మీరు నన్ను చాపమాలనుకున్నారా ? మీరు మీ ఉపకారిని నాశనము చేయాలను కున్నారు . నేను నా సేవకొరకు మీ ఘనత కానీ లేదా మీ ధనమును కానీ కోరుకోవడము లేదు, ఎందుకంటె నేను నా త్నద్రి పనిని తగ్గింపుకలిగి చేయాలనుకున్నాను. నేను ఇక్కడ మీ సేవకుడిగా ఉన్నాను."

అప్పుడు యూదులు కేకలువేస్తూ, " మేము నీ కార్యములను బట్టి రాళ్లతో కొట్టలేదు, అయితే నీ దైవదూషణను బట్టి రాళ్లతో కొట్టాలనుకున్నాము. నిన్ను నీవు దేవునితో సమానముగా ఉంచుకుంటున్నావు, ఎందుకంటె నీవు మాతో ఒకనివిగా ఉన్నావు. నీవు మా లాగ మనిషివి అనుటకు మేము నీ రక్తమును చిందించాలని అనుకున్నాము. కనుక నీవు ఎంత ధైర్యము కలిగి నేనే దేవుడను అంటున్నావు ?, ఎందుకంటె అతను పరిశుద్ధుడు కనుక . నీవు దెయ్యపు ఆత్మను ఒకవేళ కలిగిఉన్నావేమో అందుకే నిన్ను నాశనము చేయాలనుకున్నాము.

అప్పుడు యేసు వారికి ఈ విధముగా సమాధానము చెప్పెను, " మీ ధర్మశాస్త్రములో దేవుడు వ్యక్తిగతముగా అతను ఎన్నుకున్నవాతో మాట్లాడుతాడని మీరు చదువలేదా, " మీరు అందరు మహిమగల దేవుని పిల్లలు " (కీర్తన 82 :6 ), అయితే మీరు ఒకరినొకరు నశించిపోయి పాపములో పడుతున్నారు. అయితే అందరు పాపముచేసినవారై తిరుగుతున్నారు. అయినప్పటికీ దేవుడు " దేవుని పిల్లలు " అని పిలుస్తున్నాడు ఎందుకంటె అతని నామమును బట్టి ఆలా పిలుస్తున్నాడు. నీవు నశించిపోవాలని అతనికి ఇష్టముగా లేదు, అయితే నీవు నిత్యమూ జీవించబడాలని కోరుకున్నాడు. కనుక నీవు నీ దేవుని వైపు తిరిగి అతని మాదిరి పరిశుద్ధముగా ఉండు. "

" కనుక , నీవు ఎందుకు నా పైన రాళ్లు వేయాలనుకున్న్నావు ? దేవుడే నిన్ను " దేవుని పిల్లలని" పిలుస్తున్నాడు. నేను నీ మాదిరి పాపము చేయలేదు. నేను నా మాటలలో మరియు కార్యములో పరిశుద్ధముగా ఉన్నాను; కనుక నేను దేవుని కుమారునిగా జీవించుటకు అన్ని అర్హతలు కలిగి ఉన్నాను. మీరు మీ ధర్మశాస్త్రమును చదివినట్లయితే నా గురించి వ్రాయబడినది మీరు అర్థము చేసుకొనగలరు, అయితే మీరు మీ వాక్యములను నమ్ముటలేదు కనుక నా కార్యములను గమనించలేకపోతున్నారు."

" నాకు నేనుగా నే రాలేదు , అయితే నా పరిశుద్దుడైన తండ్రి నన్ను పంపియున్నాడు. నేను అతని కుమారుడును; మరియు అతను నా తండ్రి అయి ఉన్నాడు. అతని పరిశుద్ధత నాలో ఉన్నది. కనుక నేను దేవునినుంచి వచ్చిన దేవుడను, వెలుగునుంచి వెలుగును, ఏకైక కుమారుడై తండ్రితో కూడా ఉన్నవాడను. "

యేసు ఆ యూదుల స్వంత మాటలనుంచి బయటకు వచ్చియున్నాడు, మరియు వారి వాదన నుంచి బయటకు వచ్చినాడు. అయితే వారి కన్నులు ద్వేషముతోనే ఉన్నాయి, అయితే వారి గమ్యములను తగ్గించెను ఎందుకంటె యేసు వారి పుస్తకములో మరియు పాత నిబంధన గ్రంథమందు కుమారులను గురించిన వాక్యములు వారి జీవితములో ఆవలిరంబించాయి కాబట్టి.

యోహాను 10:37-39
37 నేను నాతండ్రి క్రియలు చేయనియెడల నన్ను నమ్మకుడి, 38 చేసినయెడల నన్ను నమ్మకున్నను, తండ్రి నాయందును నేను తండ్రియందును ఉన్నామని మీరు గ్రహించి తెలిసి కొనునట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పెను. 39 వారు మరల ఆయనను పట్టుకొన చూచిరి గాని ఆయన వారి చేతినుండి తప్పించుకొని పోయెను.

" దీని అర్థము," యేసు వివరించెను , " దేవుడు ఏమి చేయాలనుకున్నాడో నేను అదే చేస్తున్నాను కనుక మీరు విశ్వసించాలి, ఎందుకంటె ఆ కార్యములు కనికరముతో చేయబడియున్నాయి కనుక. అతని దయను ఒకవేళ నేను చూపించని యెడల నేను ఏవిధముగా శ్రేష్ఠమైనవాడిగా ఉండేదని. ఎందుకంటె అతని ప్రేమ నాలో ఉండి, దేవుని పనిని నెరవేర్చుటకు నాకు అధికారము ఉన్నది, అయితే వారు నిజముగా తండ్రి పని అయి ఉన్నారు. "

" మానవత్వముని తీసుకొనుటలో ఒకవేళ మీరు విఫలమైయున్నారేమో. అయినప్పటికీ నా పనులను మరియు ఏవిధముగా మృతిని నేను తిరిగి లేపియున్నానో మరియు గ్రుడ్డి వానికి చూపును ఇచ్చియున్నానో మరియు అలలను ఆపియున్నానో మరియు 5000 వేళా మందికి ఏవిధముగా ఆకలి తీర్చానో పరీక్షించుకొనుడి ?. మీ మనసులను పరిశుద్ధాత్ముడు తెరచి నాలో దేవుడు ఉన్నాడని తెలుసుకొనుటకు సహాయము చేయాలనీ అనుకున్నారా ? ఎప్పుడైతే మీరు పరిశుద్దాత్మునితో నింపబడతారో అప్పుడే మీరు నా గురించిన సంపూర్ణ మైన వాటిని తెలుసుకొంటారు. "

ఒక చెట్టుకు కొమ్మలు ఏవిధముగా ఉండి చిరిస్తాయో అదేవిధముగా మనము క్రీస్తుతో బంధము కలిగి ఉండాలని యేసు కోరుకొంటున్నాడు, కనుక అదేవిధముగా క్రీస్తు కూడా తన తండ్రితో బంధము కలిగి అతని యందు ఉన్నాడు. కనుక వారిరువురు ఒక్కటై ఉండి ఐక్యత కలిగి ఉన్నారు. కనుక మనము కుమారుడు తండ్రితో కలిసి ఉండి అతనిని ఘనపరచి యున్నాడని చెప్పవచ్చు. కనుక గొప్ప ప్రార్థన ఈ విధముగా ప్రారంభమవుతుంది, " పరలోకమందున్న మా తండ్రి , నీ నామము పరిశుద్ధపరచబడును గాక."

ఎవరైతే క్రీస్తు సాక్ష్యమును లోతుగా అర్థము చేసుకొంటే వారు ప్రార్థన యందు మరియు విజ్ఞాపన యందు మెలుకువ కలిగి పరిశుద్ధ త్రిత్వమును అర్థము చేసుకొనెదరు. వారు ముగ్గురు దేవుళ్ళు కాదు అయితే ఓక్కరై ఉన్నారు, కనుక ఆనందముతో దేవుని ఏకత్వమును వివరించెదము.

ఎప్పుడైతే క్రీస్తు తనను గురించి సాక్ష్యమును మరియు అతని తండ్రితో తనకున్న ఐక్యతను గురించి వివరించినప్పుడు యూదులు రాళ్లతో కొట్టుటకు వెనకడుగు వేసిరి. అయినప్పటికీ అతనిని పట్టుకొని సమాజ పెద్దలవద్దకు తీసికొనివచ్చి అతని తప్పిదములను చూపుటకు ప్రయత్నించిరి. తండ్రి అయితే దేవుడు తన కుమారులను కాపాడువరకు అతని పిల్లలను ఎవ్వరు కూడా చెడపలేరు. అందుకే యేసు, " నా తండ్రి చేతిలో నుంచి వారిని ఎవ్వరు వేరుపరచలేరు" అని చెప్పెను .

ప్రార్థన: గొర్రెలిపిల్లగా పిలువబడే తండ్రి అయితే దేవా నీ ప్రేమ కలిగిన ఐక్యతను చూసాము, నీ మానవత్వముని మా మనసులు తెలుసుకొనలేవు. నీ ఆత్మ మేము నీ గొప్ప ప్రేమను మరియు కార్యములను చూసుతకు సహాయము చేసియున్నది. నీ పిల్లలుగా మమ్ములను చేసియున్నావు. నీ నామము పరిశుద్ధ పరచబడునట్లు నీవు పరిశుద్ధముగా జీవించునట్లు మమ్ములను చేయుము.

ప్రశ్న:

  1. క్రీస్తు తన దైవత్వమును ఏవిధముగా ప్రకటించెను ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 11:24 AM | powered by PmWiki (pmwiki-2.3.3)