Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 067 (Jesus is the Good Shepherd)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 2 - చీకటిలో వెలుగు ప్రకాశించుట (యోహాను 5:1 - 11:54)
C - యెరూషలేమునకు యేసు యొక్క చివరి ప్రయాణము (యోహాను 7:1 – 11:54) చీకటికి మరియు వెలుగుకి మధ్య విభజన
3. యేసు మంచి కాపరి (యోహాను 10:1-39)

c) యేసు మంచి కాపరి ( యోహాను 10:11-21)


యోహాను 10:11-13
11 నేను గొఱ్ఱలకు మంచి కాపరిని; మంచి కాపరి గొఱ్ఱలకొరకు తన ప్రాణము పెట్టును. 12 జీతగాడు గొఱ్ఱల కాపరికాడు గనుక గొఱ్ఱలు తనవికానందున తోడేలు వచ్చుట చూచి గొఱ్ఱలను విడిచిపెట్టి పారిపోవును, తోడేలు ఆ గొఱ్ఱలను పట్టి చెదరగొట్టును. 13 జీతగాడు జీతగాడే గనుక గొఱ్ఱలనుగూర్చి లక్ష్యము చేయక పారిపోవును.

దేవుడు తన గొర్రెలను చెదరగొట్టిన రాజులను, అబద్ద యాజకులను మరియు మోసముచేసిన కాపరులు బట్టి ఓర్పుకలిగి ఉండెను. అందుకే అతని కుమారునికి మంచి కాపరిగా మనదగ్గరకు పంపియున్నాడు. అందుకే అతను వచ్చినప్పుడు, " నేను నిజమైన రాజుగా, యాజకునిగా, ప్రవక్తగా మరియు చివరి ప్రవచనముగా సిద్ధముగా ఉన్నాను". కేవలము క్రీస్తులోనే మనము కాపరియొక్క లక్షణములన్నిటిని కనుగొనగలం. అందుకే అతను , " భారము మోయుచున్న , సమస్త జనులారా నాయొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని దయచేయుదును." నేను మిమ్ములను విడువక మిమ్ములను కాపాడుదును.

క్రీస్తు మాత్రమే మంచి కాపరి అని అనుటకు , సాదృశ్యము అతను ఇష్టపడి తన జీవితమును గొఱ్ఱెలకొరకు త్యాగము చేయుటయే. అతను తన శరీరమును ఇస్తాను అని చెప్పలేదు అయితే తన శరీరమును , ప్రాణమును మరియు ఆత్మను వారికి రక్షణగా యిచ్చియున్నాడు. ఇది అతను తన్ను మొదటగా వెంబడించువారినుంచి మొదలు పెట్టినాడు. అతని శరీర త్యాగము ఒక జీవ కిరీటముగా ఉన్నది. యేసు తన కొరకు జీవించలేడు మరియు చనిపోలేదు అనే సత్యమును మనము జ్ఞాపకము చేసుకోవాలి. అతను నీకొరకు జీవించి నీకొరకు చనిపోయి ఉన్నాడు.

విశ్వాసము లేని కాపరులు కూడా ఉంటారు వారు అపాయము వచ్చినప్పుడు పారి పోయి దాగుకొంటారు, వారిని వారు సంరక్షించుకొనెదరు. వారు గొర్రెలను తోడేలుకు కనపడునట్లు నడిపించెదరు. వారు సాతానుకు సంబంధించిన వారు కనుక అపాయము కలిగిన జంతువులువాలె ఉండెదరు. ఎందుకంటె సాతాను యొక్క గురి వారిని మ్రింగుట. వాని పట్టింపులు చంపుటకు మాత్రమే ఉండును. అతను ఘనపరచుచు వారిని మోసము చేయును. సేవకులమైన మనము ఈ విధమైన స్వభావమునకు దూరముగా ఉండాలి. అయితే ప్రేమకు మనము ఇవన్నియు భరించాలి. క్రీస్తు జీవితము మనకు నేర్పించినట్లు అతను ఎల్లప్పుడూ ప్రేమ కలిగి ఉన్నాడు. సాతాను కుతంత్రములను ఎదుర్కొనుటకు క్రీస్తు తనను వెంబడించువారిని ప్రేమతో మాట్లాడియున్నాడు. అయితే తెలివైన తోడేలు యొక్క పని , కేవలము క్రీస్తు సంఘమును నాశనము చేయడమే. నీవు దేవుని మందను గౌరవంగా నడిపించాలనుకున్నావా? అయితే గమనించు ఈ విషయములో నీకు శ్రమలు, కస్టాలు, త్యాగములు మరియు ఒంటరి తనము రావచ్చు.

యోహాను 10:14-15
14 నేనుగొఱ్ఱలమంచికాపరిని. 15 తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో ఆలాగే నేను నా గొఱ్ఱలను ఎరుగుదును, నా గొఱ్ఱలు నన్ను ఎరుగును. మరియు గొఱ్ఱలకొరకు నా ప్రాణము పెట్టుచున్నాను.

క్రీస్తు తన గొర్రెలకు ఒక నిజమైన కాపరి అని మరొక్కసారి చెప్పాడు. మనమందరూ మన నిజమైన శత్రువు ఎవరో తెలియక సేవచేయుటలో విఫలము అవుతున్నాము, మరియు మనము గొఱ్ఱెయొక్క పూర్తి స్వభావమును అనగా ఏవిధముగా మనము అర్థమైన ప్రకారము వాటిని [అచ్చికగల చోట్లకు ఎలా నడిపించాలో తెలియనివారముగా ఉన్నాము. క్రీస్తుకు ప్రతి ఒక్కరు తెలిసి, వారి భూత , భవిష్యత్, వర్తమాన కాలములను తెలుసుకొన్నాడు.

యేసు తన సొంత గొర్రెలను యెరిగి వాటికి తనను గురించి వివరించి వారికి తనను అర్థము చేసుకొనే బహుమానమును యిచ్చియున్నాడు. వారు ఎప్పుడైతే అతనిని తెలుసుకొన్నారో అప్పుడు వారు తమను ఎందుకు తిరస్కరించలేదో తెలుసుకొన్నారు. అతని సన్నిధి ద్వారా వారి విఫలమును చూడవచ్చు. దీనిద్వారా వారి ప్రేమను మరియు కృతజ్ఞతను తెలియపరుస్తున్నది.

యేసుకు మరియు తన శిష్యులకు ఉన్న బంధము ఒక సామాన్యమైనది లేకా ఈ లోకమునకు సంబంధించినది కాదు అయితే ఇది ఆత్మీయమునకు చెందినది, ఎందుకంటె మనకు తెలిసినట్లు మనము అతనిని చూసినట్లయితే తండ్రిని చూసినవారము అని చెప్పినట్లు. కనుక ప్రతి క్రైస్తవునికి ఇది ఆత్మీయమైన మేలులను మరియు సత్యమును పొందుకొనుటలో ఒక మర్మముగా ఉన్నది. మరియు దేవుని ఆత్మ అతని మనుషులలో ఉండి వారిని నడిపించును, కనుక ఎవ్వరు కూడా దీనిని వదలలేరు.

యోహాను 10:16
16 ఈ దొడ్డివికాని వేరే గొఱ్ఱలును నాకు కలవు; వాటినికూడ నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొఱ్ఱల కాపరి ఒక్కడును అగును.

యేసు ఏదో ఒక విషయమును బట్టి చనిపోలేదు , అయితే అందరికొరకు మరణించాడు. అతను కఠినమైన పాతనిబంధన వారిని మాత్రమే రక్షించలేదు అయితే చెడిపోయిన అందరిని రక్షించాడు. అందుకే అతను మరణించక మునుపే అతను ఈ లోకములో ఉన్న వారందరికొరకు మరణిస్తానని చెప్పియున్నాడు. కనుక ఎవ్వరు కూడా స్వంతముగా రాలేరు, అయితే ప్రతి ఒక్కరికి నడిపించు కాపరి అవసరము. అతనే క్రీస్తు. అతని ఆత్మీయ వాక్యము నడిపింపు ఇచ్చును. గొర్రె తన సొంత కాపరి స్వరమును ఏవిధముగా అర్థము చేసుకొంటుందో అదేవిధముగా క్రీస్తు స్వరమును అతనిని వెంబడించు వారు అర్థము చేసుకొనెదరు. పాత నిబంధన ప్రకారముగా ఉన్నవారు క్రీస్తు ద్వారా క్రొత్త నాయకత్వములోనికి మార్చబడెదరు. ఈ దినాలలో నూతన నిబంధన ప్రజలు క్రీస్తు ద్వారా క్రొత్త నిబంధనలోనికి మార్చబడియున్నారు. ఎవరైతే దేవుని వాక్యమును విని క్రీస్తును నమ్మి దేవుని కుమారుని యందు నమ్మకము కలిగి ఉంటారో వారు నిజమైన సంఘములో సభ్యులై ఉంటారు, ఒకవేళ వారు నానా విధములైన విశ్వాస సంఘములలో ఉన్నప్పటికీ. మనకు ఒక ఆత్మ ఒక ప్రభువు ఒక తండ్రి మాత్రమే ఉన్నాడు. ఈ ఆత్మ క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన ప్రతి ఒక్కరికి వచ్చును. క్రీస్తు ఐక్యత మన ఊహలన్నిటికంటే ఎంతో ఘనమైనదిగా ఉంటుంది. మంచి కాపరి తన గొర్రెలను మహిమలోనికి నడిపించును. అప్పుడు అక్కడ ఒక మంద మరియు ఒక కాపరి ఉండును. అయితే ఈ దినాలలో సేవకులు ఒక వేళా తమ సంఘములను తమకు నచ్చినట్లు మరియు వాటిని తమ ఆలోచన ప్రకారము నడిపిస్తున్నట్లైతే వారు అబద్దపు బోధను మరియు తోడేలునకు ఇచ్చు కాపరులుగా ఉండును, ఎందుకంటె అందులో క్రీస్తు నడిపింపు మరియు అతని ఆత్మీయ ఆలోచనలు ఉండవు కనుక. ఏదేమైనా మనము క్రీస్తుకు దగ్గరగా రాకున్నట్లైతే మనము ఒకరికి ఒకరము దగ్గరకు రాలేము.

యోహాను 10:17-18
17 నేను దాని మరల తీసికొనునట్లు నా ప్రాణము పెట్టుచున్నాను; ఇందు వలననే నా తండ్రి నన్నుప్రేమించుచున్నాడు. 18 ఎవడును నా ప్రాణము తీసికొనడు; నా అంతట నేనే దాని పెట్టుచున్నాను; దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసికొనుటకును నాకు అధికారము కలదు; నా తండ్రివలన ఈ ఆజ్ఞ పొందితిననెను.

దేవుడు ప్రేమ అయి ఉన్నాడని మరియు తన కుమారుడిని ప్రేమిస్తున్నాడని నమ్మగలము. మరియు క్రీస్తు కూడా తన తండ్రిని ఏది ఘనపరచునో అదే చేయును. ఇప్పుడు మనము నిజముగా దేవునిని ఏది ఘనపరచును; ఇది కేవలము సిలువ మాత్రమే. క్రీస్తు మరణము దేవుని నిర్ణయముగా ఉన్నది. కనుక ప్రజలు వేరే ఏ విధమైన వాటి యందు విడుదల లేదు అయితే కేవలము క్రీస్తు రక్తము మరియు దేవుని గొర్రెపిల్ల ద్వారా కడగబడుట చేతనే.

క్రీస్తు మరణము మరియు అతని పునరుత్థానము ఒక అద్భుతముగా ఉన్నది; అతను చెప్పినట్లు మనము జీవించునట్లు అతను మరణించాడు. అయితే అతను బలవంతముగా లేకా అయిష్టముగా చేయలేదు అయితే మనము మన పాపములనుంచి విడిపింబడుటకు చేసియున్నాడు. కనుక అతను నిజమైన ప్రేమ అయి ఉన్నాడు. అతని తండ్రి ఈ లోకమును కాపాడుటకు అధికారమును యిచ్చియున్నాడు, మరియు తిరిగి జీవితమును కూడా తీసుకొనుటకు అదే అధికారమును యిచ్చియున్నాడు. కనుక ఎవ్వరు కూడా క్రీస్తు సిలువ మరణమును పోల్చుకొనలేరు. అయితే సాతానుడు మరియు అతనిని వెంబడించువారు ఈ విధముగా చేయలేరు, మరియు క్రీస్తు ప్రేమలో ఇవన్నీ కూడా విఫలము అయినాయి. కైపస్సు లేదా పిలాతు లేకా ఎవ్వరు అతనిని చనిపొమ్మని బలవంతము చేయలేదు; అయితే అతనే త్యాగముగా మరణించాడు. మనలను తోడేలు దగ్గరకు నడిపించలేదు అయితే తనను తాను మన కొరకు అప్పగించియున్నాడు. ఇది దేవుని సంపూర్ణ చిత్తమై ఉన్నది. యేసు పరలోకమునకు మరియు నరకమునకు మధ్యన పోరాటం చేసియున్నాడు. ఆ దినమునుంచి అతని గొర్రెలకు దేవుని గొర్రెపిల్ల రక్తములో ముద్రవేయబడినారు అనే నమ్మకము కలిగినది. కనుక క్రీస్తు మనలను ఇబ్బందులలోనికి మరియు కష్టములోనికి తన ఘనత కొరకు నడిపించును.

యోహాను 10:19-21
19 ఈ మాటలనుబట్టి యూదులలో మరల భేదము పుట్టెను. 20 వారిలో అనేకులువాడు దయ్యము పట్టిన వాడు, వెఱ్ఱివాడు; వాని మాట ఎందుకు వినుచున్నారనిరి. 21 మరి కొందరుఇవి దయ్యము పట్టినవాని మాటలుకావు; దయ్యము గ్రుడ్డివారి కన్నులు తెరవగలదా అనిరి.

యూదుల ద్వారా పంపబడిన వారు క్రీస్తు అధికారమును యూదుల మధ్యలో మరియు దొంగల మధ్యలో మరియు సాతాను మనుష్యుల మధ్యలో చేయబడుట వారు చూసిరి; మరియు అతను నిజమైన మంచి కాపరి అని కూడా చెప్పేను. మరియు అతను అన్ని దేశములకు కూడా మంచి కాపరి అయి ఉన్నాడు. వారు దేవుని ద్వారా ఎన్నుకొనబడినవారుగా ఉన్నారు. అక్కడున్న చాలా మంది ఈ విషయమై ద్వేషించిరి. అక్కడున్న వారిలో అనేకులు క్రీస్తును వ్యతిరేకించిరి ఎందుకంటె అతని బోధనలు పరలోకమునకు దగ్గరగా ఉన్నవని.

అయినప్పటికీ అక్కడున్న వారు ధైర్యముగా మేము వింటున్న సాక్ష్యము దేవుని కుమారుడైన క్రీస్తు స్వరమని చెప్పిరి. అతని మాటలు ఖాళీగా ఉన్న ఆలోచనలు కాదు, అయితే శక్తి చేత నింపబడినవిగా ఉన్నవి. అతను ఆ గ్రుడ్డివాని పాపములు క్షమించియున్నాడు. వారి మాటలు క్రీస్తు మందకు వ్యతిరేకముగా ఉన్నాయి. క్రీస్తు ఎప్పుడు తన మందను ఆత్మీయ నడిపింపులో నడిపించును

ప్రార్థన: ప్రభువైన యేసు, కఠినమైన గొర్రెలను తిరస్కరించక వారిని నీవు రక్షించి వాటికి కాపరిగా ఉన్నందుకు కృతజ్ఞతలు, నీ జీవితమును వాటి కొరకు త్యాగము చేసియున్నావు. మా పాపములను క్షమించుము. నీవు తండ్రిని అర్థము చేసుకొనినట్లు మేము నిన్ను అర్థము చేసుకొనుటకు నీ జ్ఞానముచేత మమ్ములను నింపినందుకు నీకు కృతజ్ఞతలు. నీకు మా పేర్లు తెలుసు కనుక మమ్ములను నీవు మరచిపోలేదు. మమ్ములను నిన్ను వెంబడించువారిలో ఉంచినందుకు నీకు కృతజ్ఞతలు.

ప్రశ్న:

  1. యేసు ఏ విధముగా మంచి కాపరి అయినాడు ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 11:22 AM | powered by PmWiki (pmwiki-2.3.3)