Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 062 (Healing on the Sabbath)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 2 - చీకటిలో వెలుగు ప్రకాశించుట (యోహాను 5:1 - 11:54)
C - యెరూషలేమునకు యేసు యొక్క చివరి ప్రయాణము (యోహాను 7:1 – 11:54) చీకటికి మరియు వెలుగుకి మధ్య విభజన
2. పుట్టుకతో గ్రుడ్డివానిగా ఉన్నవానిని స్వస్థపరచుట (యోహాను 9:1-41)

a) సబ్బాతు దినమందు స్వస్థపరచుట (9:1-12)


యోహాను 9:1-5
1 ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డియైన యొక మనుష్యుడు కనబడెను. 2 ఆయన శిష్యులు బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా? అని ఆయనను అడుగగా 3 యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని, దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. 4 పగలున్నంతవరకు నన్ను పంపినవాని క్రియలు మనము చేయుచుండవలెను; రాత్రి వచ్చుచున్నది,అప్పుడెవడునుపనిచేయలేడు. 5 నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను.

యేసు తన మీద రాయి వేయాలని అనుకున్నవారి నుంచి పారిపోలేదు, అయితే వారిలో ఇబ్బంది కలిగి ఉన్నటువంటి వాడిని గమనించెను. అతను ప్రేమ కలిగి క్షమించు వాడుగా మరియు నమ్మకమైన ఆశీర్వాదమును ఇచ్చువాడుగా ఉన్నాడు. శిష్యులు కూడా ఆ గ్రుడ్డి వానిని చూసి ఉన్నారు అయితే వాడి నుంచి ఏ విధమైన సమస్యను వారు గమనించలేదు. అయితే ఆ దినాలలో వారు , మునుపటి దోషములను బట్టి దేవుడు ఉద్దేశముగా వారి పాపములను బట్టి ఈ విధముగా పుట్టిస్తాడను అనుకొనిరి, మరియు ఇది దేవుని శిక్ష అని కూడా అనుకొన్నారు. అయితే యేసు ఆ అవిటివాడిని తిరస్కరించలేదు; మరియు వారి పితరుల పాపములను మరియు అతని దోషములను యేసు చూడలేదు అయితే ఆ మనిషి పడుతున్న కష్టమును చూసి, దేవుని కార్యము ఈ మనిషిలో జరుగులాగున ఉద్దేశించెను. మరియు అతని శిష్యులు ఆ గ్రుడ్డివానిని బట్టి ఎందుకు ఇది వీడికి కలిగినది, మరియు ఏ తప్పిదమును బట్టి ఈ పరిస్థితి వీడికి వచ్చినదని ఆలోచన చేయుటకు అవకాశము ఇవ్వలేదు. అయితే వారికి ఆ మనిషి విషయములో దేవుని చిత్తమును మరియు రక్షణను మరియు స్వస్థతను గూర్చి అవసరమును దేవుడు వారికి వివరించెను.

"నేను కార్యము చేయాలి ", అని యేసు వారికి చెప్పెను. అతని విషయములో క్రీస్తు తీర్పుతీర్చుటకు లేదా నాశనము చేయుటకు ఆశకలిగి లేడు, అయితే జాలికలిగి స్వస్థత పరచాలని కోరుకొనెను. అప్పుడు తన ప్రేమకలిగిన విడిపింపును మరియు అతని గురిని ఆ మనిషికి తెలియపరచెను. అతను లోక రక్షకుడై మనుషులను మంచి జీవితములోనికి తెచ్చుటకు సంకల్పించెను.

మనము కూడా యేసు మాటలు ఈ విధముగా వింటాము, " నేను నా నామమున కార్యము చేయను మరియు నా బలము చొప్పున కార్యము చేయను అయితే నా తండ్రి గురిని చేయుదును". అందుకే అతని కార్యములను దేవుని కార్యములు అని చెప్పెను.

యేసుకు ఆ గ్రుడ్డివానికి సమయము కొద్దిగా ఉన్నది మరియు మరణము సమీపించియున్నాడని తెలుసుకొని అతనిని స్వస్థపరచుటకు సమయమును కేటాయించేను. యేసు ఈ లోకమునకు వెలుగై ఉండులాగున ఈ గ్రుడ్డివానిని కూడా తన జీవితమును వెలిగించాలని కోరుకున్నాడు. అయితే ఒక సమయము వచ్చినప్పుడు అతడు లేదా ఏదేని ఒక పరిశుద్ధుడు వచ్చి కార్యము చేయగలడని. పగలు ఉండగానే కార్యములు జరుగునప్పుడు ప్రకటించుటకు సిద్ధముగా ఉండాలి. ఈ లోకములో చీకటి అనునది ఎక్కువై పోతున్నప్పుడు యేసు క్రీస్తు తిరిగి రావడము ఎంతో అవసరమై ఉన్నది. ఎవరు అతని మార్గమును సిద్ధపరచెదరు ?

యోహాను 9:6-7
6 ఆయన ఇట్లు చెప్పి నేలమీద ఉమి్మవేసి, ఉమి్మతో బురదచేసి, వాని కన్నులమీద ఆ బురద పూసి 7 నీవు సిలోయము కోనేటికి వెళ్లి అందులో కడుగు కొనుమని చెప్పెను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్లి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను.

అయితే యేసు ఇంతకు ముందే తన మాటలచేత ఎన్నో అద్భుతములు చేసియున్నాడు. అయితే ఈ గ్రుడ్డి వాని విషయములో మాత్రమూ యేసు నేలమీద ఉమ్ము వేసి ఆ మట్టితో ఆ గ్రుడ్డివాని కన్నులకు ఆ మట్టితో కప్పివేసెను. ఎందుకంటె ఆ గ్రుడ్డి వాడు క్రీస్తు తన శరీరము నుంచి ఏదో ఇచ్చియున్నాడని అనుకొనుటకు ఈ విధముగా చేసెను. అయితే యేసు ఈ గ్రుడ్డి వాని విషయములో ఒక విధమైన ఆశ్చర్యముగా కార్యము చేసెను, అయితే ఆ మనిషి కన్నులు ఇంకను తెరువబడలేదు. అయితే సిలోము అను ఒక కోనేరు దగ్గరకు నడుచుకుంటూ వెళ్లి అక్కడ అతని కళ్ళు కడుగుకొనుటకు సమయము ఇచ్చెను. సిలోము అనగా " పంపినది" అని అర్థము. కనుకనే అక్కడ ఆ గ్రుడ్డి వానికి స్వస్థత పూర్తిగా కలిగినది. రక్షణ కూడా ఆ గ్రుడ్డి వానికి కలిగినది

అప్పుడు ఆ గ్రుడ్డివాడు యేసు వాగ్ధానమును మరియు ప్రేమను అంగీకరించెను. మరియు అతను క్రీస్తుకు సంపూర్ణముగా లోబడి ఉండెను. క్రీస్తు చెప్పినట్లు నిదానముగా నడుచుకుంటూ వెళ్లెను. అప్పుడు అతని కన్నులు ఆ నీటిలో కడుగబడినప్పుడు అతనికి ద్రుష్టి వచ్చినది. అప్పటికప్పుడు అతను అక్కడున్న వారందరిని తన సొంత సొంత దృష్టితో చూచెను, మరియు ఆకాశమును, నీళ్లను మరియు వెలుగును తన కన్నులతో చొసెను. ఇవన్నీ కూడా అతను ఒక ఆశ్చర్యకరంగా చూసేను. అప్పుడు అతని స్వరము దేవునిని కీర్తిస్తూ హల్లెలూయా అని దయాకలిగిన దేవునికి తెలియపరచెను

యోహాను 9:8-12
8 కాబట్టి పొరుగువారును, వాడు భిక్షకుడని అంతకుముందు చూచినవారునువీడు కూర్చుండి భిక్ష మెత్తుకొనువాడు కాడా అనిరి. 9 వీడే అని కొందరును, వీడుకాడు, వీని పోలియున్న యొకడని మరికొందరును అనిరి; వాడైతేనేనే యనెను. 10 వారు నీ కన్నులేలాగు తెరవబడెనని వాని నడుగగా 11 వాడుయేసు అను నొక మనుష్యుడు బురద చేసి నా కన్నులమీద పూసి నీవు సిలోయమను కోనేటికి వెళ్లి కడుగుకొనుమని నాతో చెప్పెను; నేను వెళ్లి కడుగుకొని చూపు పొందితిననెను. 12 వారు, ఆయన ఎక్కడనని అడుగగా వాడు, నేనెరుగననెను.

యేసు చేసిన అద్భుతములు మిగిలి ఉండలేదు అయితే అవన్నియు కూడా పొరుగు వారు చూచి చాలా ఆశ్చర్యపోయారు.మరియు అక్కడున్న వారు ఈ సంచారకుడే ఈ కార్యమును చేసాడని అనుకొనలేదు. అయితే అతను మాత్రమే తన గురించిన సాక్ష్యమును ఇతరులకు పంచాడు.

చాల మంది ప్రజలు అతను చేసిని స్వస్థత కార్యములను అడిగి తెలుసుకొన్నారు, అయితే వారు స్వస్థత కార్యములను మాత్రమే తెలిసికొన్నారు అయితే ఆ కార్యములను చేసిన వాని గురించి తెలుసుకొనలేదు. అయితే ఆ గ్రుడ్డివాడు తనను స్వస్థపరచిన వాడిని యేసు అని పిలిచాడు, అతని గురించి కొద్దిగా సమాచారమును తెలుసుకొన్నాడు. అతనికి క్రీస్తు అవతారమును గూర్చి తెలుసుకొనలేదు కానీ అతను తన దృష్టిని బట్టి చేసిన కార్యమును మాత్రమూ మనసారా అనుభవించి, అప్పుడు తన కన్నులను కడుగుమని అడిగెను, అప్పుడు అతను చూచుటకు సమర్థుడాయెను.

అప్పుడు అక్కడున్న వారు ఈ విధముగా అడిగిరి, " యేసు ఎక్కడ ? " అప్పుడు ఆ యవ్వనస్తుడు ఈ విధముగా స్పందించెను, " నాకు తెలియదు, నేను అప్పుడు గ్రుడ్డివాడను అయితే నేను ఇప్పుడు చూడగలుగుతున్నాను. అతను నన్ను డబ్బులు కానీ కృతజ్ఞత కానీ అడగలేదు. నేను ఆ నీతిదగ్గరకు వెళ్లి నా కన్నులు కడుగుకొనినతరువాత నేను చూడగలుగుతున్నాను. కనుక అతను ఎవరో ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు."

ప్రార్థన: యేసు ప్రభువా నీవు ఆ గ్రుడ్డివానిని స్వస్థపరచక వెళ్ళాక ఉండినందుకు నీకు నేను కృతజ్ఞతలు తెలియచేసుకొనుచున్నాను. నీవు అతని కన్నులను తెరచి పుట్టుకతో పాపముచేత నింపబడినవారిని నీవు ద్రుష్టి కలిగి ఉండునట్లు చేసినందుకు నీకు కృతజ్ఞతలు. మా కన్నులను తుడిచి నీ పరిశుద్దాత్మ చేత పరిశుద్ధ పరచి నీ మహిమను మరియు నీ వెలుగును చూచుటకు మాకు నీ సహాయమును దయచేయుము.

ప్రశ్న:

  1. పుట్టుకతో గ్రుడ్డివానిగా జన్మించినవానిని యేసు ఎందుకు స్వస్థపరచెను ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 11:17 AM | powered by PmWiki (pmwiki-2.3.3)