Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 054 (Legalists bring an adulteress to Jesus)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 2 - చీకటిలో వెలుగు ప్రకాశించుట (యోహాను 5:1 - 11:54)
C - యెరూషలేమునకు యేసు యొక్క చివరి ప్రయాణము (యోహాను 7:1 – 11:54) చీకటికి మరియు వెలుగుకి మధ్య విభజన
1. ప్రత్యక్ష గుడారపు పండుగలో క్రీస్తు మాట్లాడుట (యోహాను 7:1 - 8:59)

c) న్యాయమంతులు వ్యభిచారిణిని యేసు దగ్గరకు తీసుకొని వచ్చుట (యోహాను 8:1-11)


యోహాను 8:1-6
1 యేసు ఒలీవలకొండకు వెళ్లెను. 2 తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరు ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించు చుండెను. 3 శాస్త్రులును పరిసయ్యులును, వ్యభిచారమందు పట్టబడిన యొక స్త్రీని తోడు కొనివచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి 4 బోధకుడా,యీ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను; 5 అట్టివారిని రాళ్లు రువి్వ చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మన కాజ్ఞాపించెను గదా; అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన నడిగిరి. 6 ఆయనమీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి, నేలమీద వ్రేలితో ఏమో వ్రాయుచుండెను.

సంఘ సభ్యులు అక్కడినుంచి తమ గృహాలకు తిరిగి వెళ్లిరి , ఎందుకంటె వారు క్రీస్తును పట్టుకొనుటలో విఫలము చెందియున్నారు కనుక. అక్కడున్న అనేకులు కూడా అధికారులు యేసును దేవాలయములో మాటలాడుటకు అవకాశము కలిగించిరి అని అనుకొనిరి. అయితే ఈ సభ్యులు యేసును పట్టుకొనుటకు పట్టు విడువకుండిరి. యేసు పట్టాన వెలుపలకు సాయంకాలమున వెళ్లెను .

మరోసారి దినమున యేసు తిరిగి పట్టణమునకు మరియు దేవాలయములోనికి వచ్చెను. అతను గుడారాల పండుగ అయిపోయేవరకు ఆ పట్టణమును వదలక వారి మధ్యలోనే ఉండెను. అయితే అక్కడున్న పరిసయ్యులు ఆ పండుగలలో ఒక రక్షహక భటులుగా పని చేసిరి. ఎందుకంటె ఆ పండుగలో ఎక్కువగా తినుట త్రాగుట ఎక్కువగా ఉన్నది కనుక . అప్పుడు వ్యభిచారము చేసే స్త్రీని పట్టుకొన్నారు. అందుకే యేసు విషయములో కూడా ఇదే విధముగా ఉన్నది. అయితే అతని ఆణత్తియాన్ని బట్టి వారు పట్టుకొనుటకు సాహసించకపోయిరి. వ్యభిచారిణి బట్టి అతని తీర్పు అందరికి ఒక చేప పెట్టు లాంటిది. కనుక వారు అతని తీర్పు గురించి ఎంతో ఎదురుచూచువారుగా ఉండిరి.

యోహాను 8:7-9
7 వారాయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తలయెత్తి చూచిమీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమెమీద రాయి వేయ వచ్చునని వారితో చెప్పి 8 మరల వంగి నేలమీద వ్రాయు చుండెను. 9 వారామాట విని, పెద్దవారు మొదలుకొని చిన్నవారివరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్లిరి; యేసు ఒక్కడే మిగిలెను; ఆ స్త్రీ మధ్యను నిలువబడియుండెను.

ఆ వ్యభిచారిణి పరిసయ్యులు యేసుదగ్గరకు పట్టుకొచ్చినప్పుడు , యేసు వారిని చూచి అతని వేలును వంచి భూమి మీద వ్రాయడము మొదలు పెట్టాడు. అయితే అతను ఏమి రాశాడో ఎవ్వరికీ అర్థము కాలేదు, అయితే ప్రేమ అనే ఒక క్రొత్త ఆజ్ఞ మాత్రమూ వచ్చినది.

అతని " వెనకాదు తనమును " పెద్దలు అర్థము చేసుకొనుటలో విఫలము యైరి, ఎందుకంటె అతను ఈ లోకమును తీర్పుతీర్చువాడు కనుక. మరియు వారు అతనిని కన్ను చిక్కులపెట్టువాడుగా అనుకొనిరి.

యేసు పైకి లేచి వారి వైపు ఒక జాలి హృదయము కలిగి చూసేను. " తీర్పు" అని చెప్పి, మీలో ఎవరైతే పాపము చేయలేదు వారు మొదట రాయి తీసుకొని ఆమె మీద వేయుడి అనెను". అయితే యేసు ధర్మశాస్త్రములో ఏ చిన్న దానిని కూడా వదలక అన్నిటిని నెరవేర్చెను. ఎందుకంటె ఆ వ్యభిచారికి మరణము రావలసి యుండగా యేసు ఆమెను అంగీకరించెను.

క్రీస్తు తన కార్యముచేత వ్యభిచారిణి మరియు అక్కడున్న భక్తిగలవారిని తీర్పుతీర్చెను. వారిని మీలో ఎవరు పాపములేదనివాడో వాడే మొదటగా రాయి వేయమని చెప్పెను. దీనిద్వారా యేసు వారి భక్తిని క్లుప్తముగా వెల్లడిచేసెను. ఎందుకంటె ఏ మనుష్యుడు కూడా పాపములేని వాడు కాదు. మనమందరము బలహీనులము మరియు చెడ్డదానికి తొందరగా పడిపోయేవాళ్ళము. అయితే దేవుని ముందర భక్తిపరునికి పాపికి వాత్యాసము లేదు. అందరు పాపము చేసి చెడిపోయిఉన్నారు. ఎవరైతే పాపముచేస్తారో అప్పుడే ఆజ్ఞ యొక్క ధర్మమూ చెడిపోయెను.

అక్కడున్న న్యాయవంతులు మరియు పెద్దలు వారి పాపములను బట్టి జంతువులను బలిగా అర్పించిరి . క్రీస్తు మాటలు వారి మనసులను తాకెను. వారు నజరేయుడైన క్రీస్తును బందించాలని అనుకొన్నాను అతను వారి చెడుతనమును బయలుపరచి వారిని న్యాయతీర్పును తీర్చెను. మరియు అదే సమయములో యేసు ధర్మశాస్త్రమును కూడా నిలబెట్టెను. మరియు తనను వెక్కిరించినా వారు కూడా వారి తలలు వంచి పరిశుద్దుడైన దేవుని కుమారుని సన్నిధిలో మోకరించిరి. అక్కడున్న పెద్దలు మరియు ఆయన యందు దాయకలిగిన వారు కూడా ఆ స్థలము నుంచి వెళ్లిపోయిరి, అయితే క్రీస్తు మాత్రమే ఒంటరిగా ఉండెను.

యోహాను 8:9-11
9 వారామాట విని, పెద్దవారు మొదలుకొని చిన్నవారివరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్లిరి;యేసు ఒక్కడే మిగిలెను;ఆ స్త్రీ మధ్యను నిలువబడియుండెను. 10 యేసు తలయెత్తి చూచి అమ్మా,వారెక్కడ ఉన్నారు?ఎవరును నీకు శిక్ష విధింపలేదా? అని అడిగినప్పుడు 11 ఆమెలేదు ప్రభువా అనెను. అందుకు యేసునేనును నీకు శిక్ష విధింపను; నీవు వెళ్లి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను.

ఒక స్త్రీ వణుకుతూ నిలబడడమును యేసు చూచి ఆమె విషయములో జాలి కలిగి ఈ విధముగా ఆమెను అడిగెను ," నిన్ను గూర్చి పిర్యాదు చేయువారు ఎక్కడ? ఇక్కడ నిన్ను తీర్పుతీర్చుటకు ద్వేషించుటకు లేరా? " ఆమె అనుకున్నది పరిశుద్దుడైన యేసు తనను శిక్షించాడని, అయినప్పటికీ అతను ఒక్కడు మాత్రమే ఆమెను ఖండించువాడుగా ఉన్నాడు.

యేసు పాపులను ప్రేమించి; తప్పిపోయిన వారిని వెతుకుటకు వచ్చియున్నాడు. అందుకే పాపము చేయబడిన స్త్రీని శిక్షించలేకపోయెను, అయితే ఆమెకు తన కృపను దయచేసెను. ఎందుకంటె అతను మన పాపములను మోసి మన కొరకు చనిపోవుటకు సిద్దపడెను . అందుకే అతను ఆ స్త్రీ గురించి న్యాయమైన తీర్పు తీర్చెను.

కనుక అతను నీ కొరకు కూడా చెనిపోయెను కాబట్టి నీకు కూడా తన క్షమాపణను యిచ్చియున్నాడు. కనుక అతని ప్రేమ యందు విశ్వాసము కలిగి ఉండు అప్పుడు అతను నిన్ను తీర్పుదినమునుంచి కాపాడును. అతని ఆత్మను నీవు అంగీకరించినయెడల నీకు క్షమాపణ దొరుకును. నీవు కూడా ఒక పాపివే అనే సత్యమును మరువకు, నీవు ఇతరుల కంటే కూడా గొప్పవాడు కాదు. ఒకవేళ ఇతరులు వ్యభిచారం చేసినట్లయితే , నీవు కూడా చేదు కలిగి లేవా? అతను దొంగతనము చేసినయెడల నీవు చేయలేదా ? నీవు తీర్పు తీర్చబడకుండునట్లు తీర్పు తీర్చకు. ఇతరులు కొలవబడినట్లు నీవు కూడా కొలవబడెదవు. నీలో చేదు ఉండినప్పుడు నీ సహోదరుని కంటిలోని నలుసుని ఎందుకు చూస్తావు ?

యేసు ఆ స్త్రీకి ఇక ఎన్నటికిని తిరిగి పాపము చేయకూడదని చెప్పెను. దేవుని యొక్క ఆజ్ఞ చాల పరిశుద్ధముగా ఉందును. అతను ఆ స్త్రీ విషయములో యేసును బట్టి ప్రేమకలిగి తన పాపమును బట్టి ఒప్ప్పుకొనునట్లు ఆమెను మార్చెను. కనుక అప్పుడు ఆమె గొర్రెపిల్ల యొక్క రక్తమును స్వీకరించెను. ఆమెకు తన రక్తమును ఇచ్చుటకు యేసు ఆమె నుంచి ఏది కూడా కోరుకొనలేదు అయితే తన హృదయము మార్చబడుటకు యేసు తన శక్తిని ఆమెకు దయచేసెను; పరిశుద్ధతలో జీవించుటకు. కనుక నీవు కూడా ఇక ఎన్నటికీ పాపము చేయకుండునట్లు నీ హృదయ స్వరమును వినుటకు యేసు సిద్ధముగా ఉన్నాడు.

ప్రార్థన: దేవా నీ సన్నిధిలో ఉండుటకు నాకు సిగ్గుగా ఉన్నది , ఎందుకంటె నేను ఆ వ్యభిచారి కంటే శ్రేష్ఠుడను కాను. ఇతరులను తీర్పుతీర్చుటలో మరియు వారిని బాధపెట్టుటను బట్టి నన్ను క్షమించు. నా పాపమును క్షమించి నందుకు నీకు కృతఙ్ఞతలు. నీ కృపను బట్టి నీ ఓర్పును బట్టి నీకు కృతఙ్ఞతలు. ఇక నుంచి పాపము చేయకుండునట్లు నాకు సహాయము చేయుము. పరిశుద్ధ జీవితము కలిగి ఉండునట్లు నన్ను నడిపింపుము.

ప్రశ్న:

  1. ఆ స్త్రీని బట్టి పిర్యాదు చేయువారు ఎందుకు యేసు సన్నిధి నుంచి వెళ్లిపోయిరి ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 11:10 AM | powered by PmWiki (pmwiki-2.3.3)