Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 050 (Disparate views on Jesus)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 2 - చీకటిలో వెలుగు ప్రకాశించుట (యోహాను 5:1 - 11:54)
C - యెరూషలేమునకు యేసు యొక్క చివరి ప్రయాణము (యోహాను 7:1 – 11:54) చీకటికి మరియు వెలుగుకి మధ్య విభజన
1. ప్రత్యక్ష గుడారపు పండుగలో క్రీస్తు మాట్లాడుట (యోహాను 7:1 - 8:59)

b) యేసును గూర్చిన రకరకాల పుకారులు (యోహాను 7:14-53)


యోహాను 7:21-24
21 యేసు వారిని చూచి నేను ఒక కార్యము చేసితిని;అందుకు మీరందరు ఆశ్చర్యపడు చున్నారు. 22 మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించెను,ఈ సంస్కారము మోషేవలన కలిగినది కాదు,పితరులవలననే కలిగినది. అయినను విశ్రాంతిదినమున మీరు మనుష్యునికి సున్నతి చేయు చున్నారు. 23 మోషే ధర్మ శాస్త్రము మీరకుండునట్లు ఒక మనుష్యుడు విశ్రాంతి దినమున సున్నతిపొందును గదా. ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుష్యుని పూర్ణస్వస్థతగల వానిగా చేసినందుకు మీరు నామీద ఆగ్రహపడు చున్నారేమి? 24 వెలిచూపునుబట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను.

యేసు యూదులకు నేరుగా తాను చెడ్డ ఆత్మచేత నిమ్పబడలేదు అని అయితే అక్కడున్న వారు తనని అన్యాయముగా తన మరణమును ఎంచుకొనిఉన్నారని చెప్పెను. వారికి అతని మీద ఎందుకు కోపము వచ్చిందంటే బేతెస్థ కోనేరు దగ్గర ఉన్న కుంటివాడిని స్వస్థ పరచినందుకు వచ్చినది. అదేరోజున యేసు ఆ కుంటివాడిని నీ పరుపు ఎత్తుకొని వెళ్లిపొమ్మని చెప్పెను. ఈ గొప్ప సంగతిని బట్టి వారు అతని మీద కోపము తెచ్చుకొని ఉన్నారు.

అప్పుడు అక్కడున్న అనేకులు ధర్మశాస్త్ర ప్రకారముగా లేరని కూడా తెలుసుకొనిరి. ఎందుకంటె సున్నతి చేయబడుట వారికి దేవుని నిబంధన అయి ఉన్నది కనుక, అయితే సబ్బాతు అనునది పరిశుద్దుడైన దేవునితో సహవాసము కలిగి ఉండుట ని బోధిస్తున్నది. మరియు వారి పిల్లలు పుట్టిన ఎనిమిది దినములకు సున్నతి చేయబడాలని ఆజ్ఞ అయి ఉన్నది, అయితే ఆ ఎనిమిదవ దినము ఒక వేళా సబ్బాతు దినమున పడవచ్చేమో. సున్నతి అనునది ఒక కార్యము కాదా ?

అనారోగ్యము అనునది పాపమునకు సాదృశ్యమైనప్పుడు , స్వస్థత అనునది రక్షణ , అది శరీరమునకు , ఆత్మకు మరియు ప్రాణమునకు స్వస్థత అయి ఉన్నది. అప్పుడు యేసు మీ మనసులను వాడమని చెప్పి, సబ్బాతుకు మరియు సున్నతికి మధ్యన తేడా చెప్పమని . ఏది జీవాధారము ? అని అడిగెను. అప్పుడు వారికి అర్థమగునట్లు తన ప్రేమను మరియు రక్షణను గూర్చిన మర్మములను తెలియపరచెను. అయితే వారి చెవులు వినకయు వారి ఆత్మలు బండలాగా మారినందున మంచి తీర్పును వారికి రాకపోయెను.

యోహాను 7:25-27
25 యెరూషలేమువారిలో కొందరువారు చంప వెదకు వాడు ఈయనే కాడా? 26 ఇదిగో ఈయన బహిరంగముగా మాటలాడుచున్నను ఈయనను ఏమనరు;ఈయన క్రీస్తని అధికారులు నిజముగా తెలిసికొనియుందురా? 27 అయినను ఈయన ఎక్కడి వాడో యెరుగుదుము;క్రీస్తు వచ్చునప్పుడు ఆయన యెక్కడివాడో యెవడును ఎరుగడని చెప్పుకొనిరి.

యెరూషలేము నుంచి అనేకులు దేవాలయమునకు వచ్చి గుంపు ఉండుట చూచిరి. ఎప్పుడైతే వారు అందరి మద్యన యేసు ఉండుట చూసి వారి ద్రుష్టి అతని మీద నిలిపిరి, ఎందుకంటె అతను పట్టుబడుట తెలిసినను అందరిలో ఆనందముగా అటూ ఇటూ తిరుగుతూ నుండెను కనుక. ఆ వార్త వారికి సాదారణముగా అగుపడెను.

అయితే అక్కడున్న వారు యేసును పట్టుకొను విషయములో ఆ పట్టనస్తులు ఓడిపోయిరి కనుక వారిని వెక్కిరించిరి. ఎందుకంటె రోమా వారు యూదుల మరణ శాసనమును వ్యతిరేకించిరి. అప్పుడు ప్రజలు, " పట్టబడవలసిన మనిషి పట్టణములో తిరుగుతూ, దేవాలయములో భయము లేక ప్రకటించుచున్నాడు. అయితే అక్కడున్న వారిఇకి అతనిని పట్టుకొనుటకు ఏ విధమైన అధికారములేకపోయెను. మరియు యాజకులు కూడా చర్చలు జరిపి కూడా అతనిని పట్టుకొనలేకపోయిరి.”

వేరే వారు , " కొంతమంది నాయకులు ఇతనే మెస్సయా అని నమ్ముతున్నారేమో, ఆ విషయము మీకు తెలియకపోవచ్చును." అని అనిరి. ఈ అంశమే యేసును పట్టుకొనుటకు మాట అయి ఉన్నది. అయితే జన సమాజమునకు వేరే విధమైన అభిప్రాయము ఉండవచ్చు.

మూడవ అభిప్రాయము : ఒకవేళ మెస్సయ్య వస్తే అతను మహిమ స్తోత్రము ద్వారా వచ్చును, కానీ ఒక సామాన్యుడుగా రాడు. అయితే ఈ యవ్వనస్తుడు ఒక వడ్లవాడై కుటుంబము నుంచి రాడు. మరియు నిజమైన మెస్సయ్య నేరుగా పరలోకమునుంచి వచ్చి మనుషుల మధ్యలో అటూ ఇటూ తిరుగుడు అనిరి.

యోహాను 7:28-30
28 కాగా యేసు దేవాలయములో బోధించుచుమీరు నన్నెరుగుదురు; నేనెక్కడివాడనో యెరుగుదురు; నా యంతట నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరెరుగరు. 29 నేను ఆయన యొద్దనుండి వచ్చితిని;ఆయన నన్ను పంపెను గనుక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పెను. 30 అందుకు వారాయనను పట్టుకొన యత్నముచేసిరి గాని ఆయన గడియ యింకను రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టు కొనలేదు.

యేసు ఈ చర్చలను విని. ఇట్లనెను , " నేను మీకు నిజముగా తెలుసా ? లేదా నేను ఎక్కడినుంచి వచ్చాను ? మీరు మీ తీర్పులో చాల గట్టిగ నిర్ణయించుకొన్నారు అయితే మీకు నేను ఎవరో తెలియదు. నా మాటలు విని నా ఆత్మను తెలుసుకొనుడి. అప్పుడు నేను ఎవరో , ఎక్కడినుంచి వచ్చానో తెలుసుకుంటారు."

అయితే క్రీస్తు తనకు తానుగా రాలేదు కానీ దేవుడే అతని వెనక ఉండీ అతనిని నడిపించాడు; అతని తండ్రి అతనిని పంపినవాడు. యేసు సహజముగా తన తండ్రి నుంచి వచ్చినవాడు కనుక అతను తన తండ్రితో ఐక్యం కలిగి ఉన్నాడు. అందుకే , " మీరు అనుకున్నట్టు ఈ దేవాలయములో దేవుడు లేడు, మరియు మీకు దేవుడెవరో కూడా తెలియదు. మీ యాజకులు గ్రిడ్డివారి ; ఎందుకంటె వారు దేవుడిని చూడలేదు, మరియు నిజముగా దేవుని స్వరమును కూడా వినలేదు. కనుక మిమ్ములను మీరే మోసపరచుకుంటున్నారు. "

అప్పుడు , " నాకు తెలుసు, " ఈ సువార్త యొక్క సారంశాము యేసుకు దేవుడెవరో తెలుసు, మరియు తండ్రి ప్రేమను వెల్లడిపరచి ఉన్నాడు. అయితే ఈ నజరేయుడు పాపము లేని వాడై తన తండ్రితో బంధము కలిగి ఉన్నాడు. అయితే వేరే ఇతరులు పాపముచేత పరిశుద్ధునితో సహవాసము కోల్పోయినారు.

ఎప్పుడైతే యేసు ఈ సత్యమైన మాటలు చెప్పినప్పుడు అక్కడున్న అనేకులు ఆయన మాటలు అర్తమూ చేసుకొని ఏడ్చి, " ఇతను దేవాలయమునకు వ్యతిరేకముగా దూషించెను". వారు అతనిని పట్టుకోవాలని చూసిరి, అయితే వారిలో ఎవ్వరు కూడా దేవుని కుమారుని పట్టుకొనుటకు రాలేకపోయిరి, ఎందుకంటె యేసు చోటు దూతలు కావాలిగా ఉన్నట్లు కనపడెను గనుక. తన చివరి సమయము వచ్చినప్పుడు. తన తండ్రి యేసును మనుషులకొరకు త్యాగము చేయాలనీ. ఆ సమయములో అక్కడున్న వారు ఎవరు కూడా తమ అడుగులను ముందుకు కూడా వేయలేకపాయిరి.

ప్రార్థన: ప్రభువా మీకు దేవుడెవరో తెలిసి మాకు అతని గురించి వివరించినందుకు నీకు కృతజ్ఞతలు. మేము మిమ్ములను ప్రేమతో సేవించెదము. మీ ప్రకటనలు మమ్ములను దేవుని పిల్లలుగా చేసినాయి. తిరిగి జన్మించిన వారందరితో కలిసి నిన్ను ఘనపరచెదము. కనుక నిన్ను వ్యతిరేకించే వారికి కూడా నీవెవరో తెలియపరచి వారు కూడా నిన్ను అంగీకరించుటకు సహాయము వారికి దయచేయుము.

ప్రశ్న:

  1. దేవుడిని తెలుసుకున్న వారికి క్రీస్తు ఎందుకు అడుగు అయి ఉన్నాడు ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 10:55 AM | powered by PmWiki (pmwiki-2.3.3)