Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 047 (Sifting out of the disciples)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 2 - చీకటిలో వెలుగు ప్రకాశించుట (యోహాను 5:1 - 11:54)
B - యేసు జీవాహారము (యోహాను 6:1-71)

5. శిష్యులను పరిశోధించుట (యోహాను 6:59-71)


యోహాను 6:66-67
66 "అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి,మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేదు." 67 కాబట్టి యేసు - మీరు కూడ వెళ్లిపోవలెనని యున్నారా?అని పన్నెండు మందిని అడుగగా.

ఐదువేలమందికి ఆహారమును పంచుట అనునది ఆ దినాలలో ఒక గొప్ప అద్భుతముగా ఉండెను. అయితే యేసు దీనివెనుక అతనికి కలుగు మోసమును కూడా దీని ద్వారా బయలుపరచెను. అయితే అనుమానములు కలుగుటకు అతనికి ఇష్టములేకపోయెను. అయితే అతనికి ఒక సత్యమైన రెండవ జన్మము అవసరమని ఆశకలిగెను. అదేసమయములో యెరూషలేములో ఉండు అతనిని వెంబడించువారికి కూడా ఒక కౌన్సిల్ అవసరమై ఉండెను. అలాగే కపెర్నహూములో ఉండు అనేకులు కూడా యేసును ఎదిరించి అతనికి వ్యతిరేకముగా లేచారు. మరియు విశ్వాసము కలిగిన వారు కూడా వారి అధికారమునకు భయపడిరి. క్రీస్తు కూడా అక్కడ కొద్దిమందే మాత్రమే వారిని వెంబడిస్తున్నారని అక్కడే ఉండిరి.

దీనికి, యేసు అతని గుంపులోనుంచి పన్నెండు మందిని అనగా పన్నెండు గోత్రములకు సాదృశ్యముగా ఏర్పాటు చేసుకొనెను. ఈ సంఖ్యా 3x4 గా విభజించబడినది. మరియు ఇది ఒక త్రిత్వము మరియు ఒక మూలగా కూడా పిలువబడినది. మరియు మనము ఈ సంఖ్యను కూడినట్లైతే మనకు పన్నెండు అనే సంఖ్యా వచ్చును . కనుక ఈ శ్శయుల ద్వారా పరిశుద్ధ త్రిత్వము నాలుగు మూలాన తెలియపరచబడినది.

ఇది జరిగిన తరువాత యేసు వారిలో ఏర్పాటుచేయబడిన వారిని పరీక్షించి ఇలా చెప్పెను ," మీరు కూడా నన్ను విడిచి వెళ్లాలనుకున్నారా? ఈ ప్రశ్న ద్వారా యేసు తన శిష్యులకు వారి భవిష్యత్తును సమాచారమును చెప్పెను. కనుకనే యేసు వారిని ఇలాంటి పరిస్థితులలో మీరు క్రీస్తును వదిలి వేస్తారా లేక అతనితోనే సహవాసము కలిగి ఉంటారా ? అని వారిని అడిగెను. ఏది నీకు ప్రాముఖ్యము , ఈ లోక ఆశలపై లేక క్రీస్తుతో నీ బంధమా?

యోహాను 6:68-69
68 "సీమోను పేతురు - ప్రభువా,ఎవనియొద్దకు వెళ్లుదుము ? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు;" 69 నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి యున్నామని ఆయనతో చెప్పెను.

పేతురు తనను తాను క్రీస్తు బండగా చెప్పుకొనెను. మరియు మాట్లాడుతూ, " ప్రభువా మేము ఎవరికొరకు వెళ్ళాలి? నీవు మాత్రమే నిత్యజీవమునకు మార్గము. " అతను యేసు భావాలను బట్టి పట్టువదలకుండా లేడేమో, అయితే మనిషి అయినా దేవుడే అనగా నజరేయుడైన యేసు ద్వారానే పరలోక శక్తిని పొందుకోగలము. పేతురు ఈ సమయములో తన సన్నిధిని ఉంచాడని నమ్మాడు. తన రొట్టెను అందరికి పంచిపెట్టాడు. పేతురు నీటిలో మునిగిపోవుచున్నప్పుడు యేసు చివరిలో అతని చేతిని పట్టుకొనెను కనుక పేతురు హృదయము యేసుకు దగ్గరగా అయినది. కనుకనే అతను అన్నిటికంటే ఎక్కువగా యేసును మాత్రమే ప్రేమించి క్రీస్తును విడువకపోయెను. పేతురు క్రీస్తును ఎన్నుకున్నాడు ఎందుకంటె క్రీస్తు అతని కంటే ముందుగానే పేతురును ఎన్నుకున్నాడు కాబట్టి.

నాయకుల యొక్క శిష్యులు వారి సాక్ష్యముల ద్వారా వారి మాటలను ముగించిరి: " మేము విశాసించి తెలుసుకున్నాము". అతను చెప్పలేదు, " మేము తెలుసుకొని విశ్వసించాము". అయితే విశ్వాసమే హృదయములను తెరచగలదు. మన విశ్వాసమే మన మనసులను కూడా తెరువగలడు. అప్పుడు పేతురు మరియు అతనితో ఉన్నవారందరూ దేవుని ఆత్మ ద్వారానే యేసు యొక్క సత్యములను తెలుసుకునెదము అని అనుకొనిరి. వారు వారికి తెలిసినవిధముగా దేవుని మహిమను కనుగొనిరి. కనుక యేసు ద్వారా వచ్చిన ప్రతి జ్ఞానము కూడా దేవుని నుంచి వచ్చిన బహుమానమే.

యేసు మీద శిష్యులకు ఉన్న విశ్వాసము ఏది ? అతని విశ్వాసమునకు అంగీకారము ఏమి ? వారందరు కూడా మెస్సయ్య యొక్క సంపోరాణములో ఉంది ఆయనలో నిలుచున్నవారుగా ఉన్నారు. అతనితోనే అన్ని అనగా యాజకత్వము, రాజరికం మరియు ప్రవక్త అన్ని కూడా అతనితోనే ఉన్నవి. రాజులు, యాజకులు మరియు ప్రవక్తలు పాత నిబంధన గ్రంధములో పరిశుద్దాత్మ ద్వారానే నడిపించబడినారు. అయితే క్రీస్తులో పరలోక సమస్త బలము మరియు అన్ని విధములైన కార్యములు ఉన్నవి. అతను అన్నిటిలో ఉన్నవాడు మరియు నిత్యమైన రాజుగా ఉన్నాడు. అలాగునే అతను మనకు యాజక భాగ్యమును కూడా దయచేసి ఉన్నాడు. అతను మృతిని లేపుటకు సంరతుడు మరియు ఈ లోకమునకు తీర్పు తీర్చువాడు కూడా. విశ్వాసము ద్వారా పేతురు యేసు మహిమను కనుగొన్నాడు.

శిష్యులు పేతురుతో పాటు ఈ సాక్ష్యములను వారు నమ్ముకొనియున్నారు. యేసు పరిశుద్ధుడని మరియు దేవుని నిజస్వరూపమని సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసు పరిశుద్ధుడని మరియు ఒక సామాన్యమైన మనిషి కాదని అయితే దేవుని నిజస్వరూపమని చెప్పిరి. అతను పాపము లేనివాడు మరియు ఈ లోక పాపములను మోయు దేవుని గొర్రెపిల్ల. యోహాను ప్రవచించినట్లు. శిష్యులు అతనిని ప్రేమించి అతనిని గౌరవించిరి. ఎందుకంటె క్రీస్తు సన్నిధి ఉన్నట్లయితే దేవుని సన్నిధి ఉన్నట్లే అని అర్థము. కుమారునితో తండ్రిని చూడవచ్చు అతని ప్రేమను అర్థము చేసుకోవచ్చు.

యోహాను 6:70-71
70 అందుకు యేసు - నేను మిమ్మును పన్నెండు గురిని ఏర్పచు కొనలేదా? మీలో ఒకడు సాతానుఅని వారితో చెప్పెను. 71 సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా పన్నెండు మందిలో ఒకడైయుండి ఆయనను అప్పగింపబోవు చుండెను గనుక వానిని గూర్చియే ఆయన ఈ మాట చెప్పెను.

యేసు ఈ విధమైన సాక్ష్యమును ఆనందముతో ఒప్పుకొనెను ఎందుకంటె దీని ద్వారానే వారి విశ్వాసము అధికముగా ఉన్నది కాబట్టి. అయినప్పటికీ వారిలో కొంతమంది అతనిని ఇంకనూ వ్యతిరేకించిరి. అందుకే వారి హృదయములు బండలాగా మారినాయి కాబట్టి వారిని యేసు ' సాతాను ' అని పిలిచాడు. ఆపోస్టులలందరు యేసు ద్వారా ఏర్పాటు చేయబడి దేవునిదగ్గరకు వచ్చియున్నారు. అయితే వారు దేవుని చేతిలో రోబోలు కాదు. వారు ఆత్మ స్వరమును వినుటకు మరియు విసర్జించుటకు స్వాతంత్ర్యము కలిగి ఉన్నారు. యూదా పూర్తిగా దేవుని మాటలను వినుటకు తన మనసును పూర్తిగా మూసుకొని సాతానుకు దగ్గరగా మారిపోయాడు. యూదా యేసును ఒంటరిగా ఇతరులు వదిలినట్లు వదలలేదు, అయితే ఎల్లప్పుడూ యేసుతో ఒక మోసకరమైన స్వభావము కలిగి అతనితో కూడా ఉండెను. అతను అబద్ధమునకు కారకుడైన తండ్రికి కుమారుడుగా అయినాడు. అయితే పేతురు యేసుకు సమర్పించుకున్నాడు.

అపొస్తలులకు ఇయ్యబడిన అధికారమును ఈ సువార్త చేయువారు ప్రాముఖ్యమును ఇవ్వలేదు. అయితే నమ్మకస్తులకు మాత్రమే వారు ప్రాధాన్యతనిచ్చి ఉన్నారు. యేసు అతనిని దూరము చేయలేదు మరియు అతని గురించి ఇతరులకు చెప్పలేదు. అయితే యూదా కూడా తన హృదయములో పశ్చాత్తాపము పొందగలడేమో అని అనుకొనెను.

ప్రియా సహోదర, నిన్ను నీవే పరీక్షించుకో. నీవు దేవుని కుమారుడా లేదా సాతాను కుమారుడివా ? అంత కొరకు నీ హృదయమును తెరుచుకోగలవా, లేక సాతానుతో బంధమునకు నీ హృదయమును తెరుచుకుంటావా ? జాగ్రత్త, నీవు నీ జీవిత గమ్యము నుంచి తప్పి పోతావేమో. నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, మరియు అతను నిన్ను రక్షించి యున్నాడు. ఒక వేళా నీవు అతని రక్షణను వ్యతిరేకించినట్లైతే నీవు సాతాను బందకాలలో నిత్యమూ ఉండెదవు. కనుక నీవు యేసువైపు తిరుగు అతను నీ కొరకు ఎదురు చూచుచున్నాడు.

ప్రార్థన: ప్రభువైన యేసు నీవు దేవుని కుమారుడవై , పరిశుద్ధత కలిగి, కృప కలిగి నీ మహిమ కలిగిన విజయమును దయచేయువాడు. నా పాపములను క్షమించుము అప్పుడు నేను నీ నిబంధనలో ఉండి, పరిశుద్ధత కలిగి నీ సన్నిధిలో ఉండి నీ లోనికి మార్చబడుటకు నీ నడిపింపు దయచేయుము. నీ శిష్యులను మరిచి నిన్ను వెంబడించి నీ జ్ఞానముద్వారా నింపబడి నీ కొరకు సఖులుగా జీవించునట్లు నీ కుమారునిగా నన్ను స్వీకరించు.

ప్రశ్న:

  1. పేతురు సాక్ష్యమునకు ఉన్న చిక్కులు ఏమి ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 10:52 AM | powered by PmWiki (pmwiki-2.3.3)