Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 042 (Jesus offers people the choice)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 2 - చీకటిలో వెలుగు ప్రకాశించుట (యోహాను 5:1 - 11:54)
B - యేసు జీవాహారము (యోహాను 6:1-71)

4. అంగీకరించు లేదా తిరస్కరించు " అనే అవకాశమును యేసు వారికి కల్పించెను !" (యోహాను 6:22-59)


యోహాను 6:22-25
22 మరునాడు సముద్రపుటద్దరిని నిలిచియున్న జన సమూహము వచ్చి చూడగా, ఒక చిన్న దోనె తప్ప అక్కడ మరియొకటి లేదనియు,యేసు తన శిష్యులతో కూడ దోనె ఎక్కలేదు గాని ఆయన శిష్యులు మాత్రమే వెళ్లిరనియు తెలిసికొనిరి. 23 అయితే ప్రభువు కృతజ్ఞతా స్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటు నకు దగ్గరనున్న తిబెరియనుండి వేరే చిన్న దోనెలు వచ్చెను. 24 కాబట్టి యేసును ఆయన శిష్యులును అక్కడ లేకపోవుట జనసమూహము చూచి నప్పుడు వారా చిన్న దోనెలెక్కి యేసును వెదకుచు కపెర్నహూమునకు వచ్చిరి. 25 సముద్రపుటద్దరిని ఆయనను కనుగొనిబోధకుడా,నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా.

ఎప్పుడైతే యేసు వారి పడవలోకి వచ్చి ఆ అలలను అణచివేసినప్పుడు వారందనీఙ్కచేస్తులైరి . ఎందుకంటె ఆ రాత్రి కాలమందు యేసు ఈ అద్బుతమును చేసెను కనుక .

యేసు ఐదు రొట్టెల ద్వారా ఎన్నో వేలమందికి పంచిన వార్తను విని కాపెంరాహూమునకు ఎంతో మంది వచ్చిరి .ఈ అద్బుతమును బట్టి వారు ఎంతగానో సంతోషించి అందరికి ఈ విషయమును గూర్చి ఎంతో మందికి చెప్పిరి .యేసు వారికి దొరక వరకు ఆయన శిష్యులందరి ఇళ్లను వెతికిరి .అప్పుడు క్రైస్తవ సత్యమును వారు చూచిరి ," ఎక్కడైతే ఇద్దరు మొగ్గురు నానామములో కూడుకొనెదరో వారి మధ్యన నేను ఉంటాను ".

అద్భుతములను బట్టి అక్కడున్నవారు మరి క్రొత్త అద్భుతము కొరకు ఎదురుచూచిరి .అందుకే " మీరు ఎప్పుడు ఇక్కడకు వచ్చిరి " అని అడిగిరి .అయితే యేసు వారి ప్రశ్నకు జవాబు ఇవ్వక ఆత్మీయమైన అర్థమును వారికి చెప్పెను .ఎందుకంటె అనేకమంది ఎంతో ఆశకలిగి యేసు దగ్గరకు వచ్చిరి కావున .అయితే యేసు అక్కడున్న అవిశ్వాసుల నుంచి విశ్వాసులను యేసు వేరుపరచి ఉన్నాడు .

యోహాను 6:26-27
26 యేసు మీరు సూచనలను చూచుటవలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుటవలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 27 క్షయమైన ఆహారముకొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము కలుగ జేయు అక్షయమైన ఆహారముకొరకే కష్టపడుడి; మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును, ఇందుకై తండ్రియైన దేవుడు ఆయనకు ముద్రవేసియున్నాడని చెప్పెను.

యేసు క్లుప్తముగా అక్కడున్నవారికి గద్దించాడు : నీవు నా ప్రేమను గూర్చి లేదా దేవుని మంచి ఆలోచలనాలను గూర్చి ఆలోచించక కేవలము నీ పొట్టకొరకు ఆలోచనకలిగి ఉన్నావు .ఇది నా శక్తిని నీవు కనుగొనలేదు .నీవు బహుమానము కొరకు ఎదురుచూస్తున్నావు కానీ బహుమానమిచ్చువాడిని మర్చిపోయావు .నీవు ఈ లోక విషయములను బట్టి ఆలోచనకలిగి ఉన్నవాడు కానీ నా అవతారమును గూర్చి ఆలోచనచేయలేదు .

నీవు ప్రతి దినము కేవలము ఆహారము కొరకు పానీయము కొరకు మాత్రమే ఆలోచన చేయక దేవుని Shakti కొరకు ఆలోచన కలిగి ఉండు .ఎప్పుడు తిను జంతువుగా కాక ఆత్మ అయినా దేవుని దగ్గరకు రావాలి .ఎందుకంటె అతను నీకు నిత్యజీవమును ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నాడు .

అలాగునే యేసు చెప్తూ : నేను ఈ లోకమునకు వచ్చినది దేవుని గొప్ప బహుమానమును ఇచ్చుటకు .నేను ఒక రక్తముతో మరియు శరీరముతో ఉన్న మనిషినే కాదు . అయితే నేను నా ద్వారా దేవుని బహుమానమును నీకు ఆశీర్వాదముగా ఇచ్చుటకు నీదగ్గరకు వచ్చియున్నాను .దేవుడు నన్ను తన పరిశుద్దాత్మ అనే ముద్ర ద్వారా నన్ను నిలువబెట్టి నీకు పరలోక శక్తిని ఇచ్చుటకు పంపియున్నాడు .

ఈ మాట ద్వారా దేవుడు అందరిని కాపాడును అనే ఒక సూచనను యేసు ప్రకటించెను , ఎందుకంటే దేవుడు మనుషులను ప్రేమించువాడు కనుక . అతను ధర్మశత్ర సంబంధమైన కోపపడి వాడు కాదు అయితే ఆశీర్వదించువాడు .అతను నీతిమంతులను మరియు దరిద్రులను కూడా ఆశీర్వదించును , మైర్యు అతని సూర్యుడిని అందరి ఉమని ఆజ్ఞాపించెను .దేవుడు ప్రేమ ప్రతి ఒక్కరు ప్రేమ కలిగిన ఆలోచనలు కలిగి ఉండాలని ఆజ్ఞాపించెను .అందుకే అతని రాజ్యము హారముచేత లేదా పానీయము చేత నింపబడినది కాదు అయితే సమృద్ధికరమైన పరిశుద్ధాత్మచేత నింపబడినది కనుకనే ఎవరైతేఅతని దగ్గరకు వస్తారో వారికి సమృద్ధికరముగా ఇచ్చును

యోహాను 6:28-29
28 వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయ వలెనని ఆయనను అడుగగా 29 యేసు ఆయన పంపిన వానియందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియయని వారితో చెప్పెను.

అక్కడున్న వారు యేసు చెప్పు ప్రతి మాటను కూడా నిశితంగా విని అతను దేవుని గొప్ప బహుమానమును ఇస్తున్నాడని ఎరిగిరి, మరియు అక్కడున్న ప్రతి ఒక్కరు ఈ నిత్యా జీవమును స్వీకరించుటకు ఇష్టపడిరి. ఎందుకంటె వారు దేవుని బహుమానమును పొందాలనుకుంటే అది కేవలము ప్రార్థన ద్వారా, లేదా ఉపవాసము ద్వారా లేదా పరిశుద్ధ ప్రయాణము ద్వారానే కలుగుతున్నదని భావించిరి .ఇక్కడ మనము వారి గ్రుడ్డితనమును గమనించవచ్చు.ఎందుకంటె వారందరు రక్షణను కేవలము క్రియల ద్వారా పొందగలమని భావించిరి.అయితే ఇది వారు పొందలేమని ఎరుగక ఉండిరి ఎందుకంటె వారు పాపులు కాబట్టి. మరియు వారు గర్వముగా దేవుని పనిని చేయుటకు వారు పరిశుద్దులుగా ఉన్నామనే భావనలో ఉండిరి. కనుక మానవుడు తన పరిస్థితిని అర్థము చేసుకొనుటలో గ్రుడ్డితనము గా ఉన్నాడు, మరియు తనకు తాను ఒక దేవునిగా అనుకోని దేవుడిని ఘనపరచవచ్చు అనుకొన్నాడు.

యేసు వారు కార్యము చేయాలనీ లేదా ఏవేని పనులుచేయాలని యేసు అనుకొనలేదు. అయితే వారు అతని మీద విశ్వాసము ఉంచుటకు మాత్రమే పిలువబడ్డారు. దేవుడు మన సామర్థ్యమును మరియు మన శక్తిని అడగడము లేదు అయితే మనము అయన కొరకు జీవించునట్లుగా ఉండమన్నాడు. ఈ మాటలు వారికి ఒక అడ్డు గోడలుగా ఉన్నాయి అయితే యేసుకు మరియు ప్రజలకు ఇది అవసరుగా ఉన్నది. మరియు దేవుని పని అనునది అతని మీద నమ్మకమే అని చెప్పెను, " నీవు పరిశుద్దాత్మునికి నీ ప్రాణములను తెరచియున్నట్లైతే, నీవు నా అధికారమును నా ప్రేమను తెలుసుకుంటావు.అప్పుడు నీవు నేను కేవలము ప్రవక్త మాత్రమే కాదు అని , ఒక సృష్టికర్త అని మరియు తండ్రి ద్వారా పంపబడిన కుమారుడని తెలుసుకొంటావు. అప్పుడు నీవు ఈ లోక విషయములనుండి మార్చబడి దేవుని పిల్లలుగా మార్చబడుతావు."

యేసును విశ్వసించుట అనగా ఆయనయనను పట్టుకొనియుండుట. మరియు నీలో అతను పనిచేయుట, కనుక అతని నడిపింపును అంగీకరించి తన నిత్యజీవమును పొందుకో. విశ్వాసము అనునది యేసుతో నిత్యమూ ఉండునది. ఎవరైతే కుమారుని యందు విశ్వాసముంచుతారో వారికి ఇది దేవుని పనియై ఉన్నది. అప్పుడు వారు క్రీస్తుతో నిత్యమూ కలిసి ఉండెదరు.

యోహాను 6:30-33
30 వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు?ఏమి జరిగించుచున్నావు? 31 భుజించు టకు పరలోకమునుండి ఆయన ఆహారము వారికి అను గ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. 32 కాబట్టి యేసుపరలోకమునుండి వచ్చు ఆహారము మోషే మీకియ్యలేదు, నా తండ్రియే పరలోకమునుండి వచ్చు నిజమైన ఆహారము మీకను గ్రహించుచున్నాడు. 33 పరలోకమునుండి దిగి వచ్చి,లోకమునకు జీవము నిచ్చునది దేవుడనుగ్రహించు ఆహారమై యున్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను.'''

యేసు అక్కడున్నవారందరికి మీరు సంపూర్ణముగా సమర్పించుకోవాలి చెప్పెను. అయితే వారు యేసు వారి ద్వారా ఏదో ఆశించి సమర్పించుమని చెప్పాడని అనుకొనిరి. అందుకే వారిని జస్టిఫై చేయమని ఆజ్ఞాపించెను." మోషే అరణ్యములో మన్నాను కురిపించినట్లు మాకు నీవు నిత్యమూ ఆహారమును దయచేయుము మరియు నీ అవతారమును మాకు చూపించు అని చెప్పిరి. మోషే కొన్ని వందల వెళ్ళమందికి ఆహారమును ఇచ్చెను అయితే నీవు కేవలము ఐదు వేళా మందికి మాత్రమే ఇచ్చియున్నావని చెప్పిరి. కనుక నీ మరియొక అద్బుతమును చూపినట్లైతే మేము నిన్ను విశాసిస్తాము " అని చెప్పిరి. కనుక మనిషి దేవుని ప్రేమను తిరస్కరించి కేవలము ప్రూఫ్స్ ని మాత్రమే అడుగువారుగా ఉన్నారు. అందుకే యేసు," చూడక నమ్మిన వారు ధన్యులు. వారు తమ గౌరవముచేత నా యందు విశ్వాసముంచిరి."

యేసు ఒక గొప్ప నడిపింపును దయచేయువాడుగా ఉన్నాడు ఎందుకంటె వినువారికి ఆయన క్రమ క్రమముగా వారి విశ్వాసములను బలపరచినట్లు కార్యములను చేయుచున్నాడు. అతను ప్రతి ఒక్కరి అక్కరలను తీర్చి అందరికి దేవుని బహుమానమై ఉన్నాడు.

యేసు వారికి వచనముల గురించిన అర్థమును క్లుప్తముగా వివరించెను, ఎందుకంటె వారి దృష్టిలో మోషే మన్నాను ఇచ్చినాడని దేవుడు ద్వారా కలిగినది కాదని అర్థముచేసుకొన్నారు కాబట్టి. అయితే అది చేసినది దేవుడు మాత్రమే కానీ వేరే వారు కాదు. మరియు వారికి యేసు ఇంకను బోధిస్తూ దేవుడు మీకు మంచి భోజనమును దయచేయును అది మీరు తినినట్లైతే ఇక ఎన్నటికిని నశించిపోరని తెలియపరచెను. వారు ఈ మాటలను వినినప్పుడు యేసు నిజముగా తండ్రి అయినా దేవుని కుమారుడని ఎంచుకొనిరి, ఎందుకంటె యేసు దేవుడిని తండ్రి అని సంబోధించెను కాబట్టి. అయితే అక్కడున్న వారు ఇంకనూ పరలోకమునుండి వచ్చు ఆహారము కొరకు అనగా మోషే ద్వారా వచ్చినట్లు గా ఎదురుచూసిరి.

యేసు వారికి అర్థమగునట్లుగా దేవుని రొట్టె మనిషికి కేవలము వారి పొట్టను నింపడమే కాదు కానీ ఆత్మీయముగా దేవుని కుమారుడైన క్రీస్తు యేసు ద్వారా వారి ఆకలిని సంపూర్ణముగా తీర్చుట. పరలోకము నుంచి వచ్చిన వానిద్వారా దేవుని ఆశీర్వాదము వచ్చియున్నది. దేవుని ఆహారము మనిషికి వస్తువు మాదిరి కాదు కానీ అది ఆత్మీయముగా ఉన్నది.ఇది మన్నా వచ్చినట్లుగా భూమిమీద నుంచి రాలేదు అయితే పరలోకమునుండి దేవుడి నుండి వచ్చినది, మరియు ఇది మనుషులందరికి సమృద్ధిగా ఉండినది. మరియు ఇది కేవలము అబ్రాహాము సంతానమునకు మాత్రమే ఉన్నది కాదు అయితే ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు దేవుడు చేసినది.

ప్రార్థన: యేసు ప్రభువా మేము మా గురించి మాత్రమే ఆలోచనచేయనివారుగా చేయుము. మీరు మా లో కార్యము చేయునట్లు మీకు లోబడే విశ్వాసమును మాకు దయచేయుము. మీతో సంపూర్ణ ఐక్యత కలిగి ఉండునట్లు చేయుము. ఆకలి కలిగిన మా హృదయములను నీ సన్నిధి ద్వారా నింపుము. మమ్ములను నిత్యమూ లోనికి నడుపుము. ప్రభువా మా కొరకు వచ్చి నీ శక్తిని ఆశీర్వాదమును మాకు దయచేసినందుకు నీకు కృతజ్ఞతలు.

ప్రశ్న:

  1. యేసు ఏ విధముగా తన యందు విశ్వాసముంచునట్లు రొట్టె కొరకు వారు ఆశకలిగి ఉన్నారు ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 10:48 AM | powered by PmWiki (pmwiki-2.3.3)