Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 041 (Jesus withdraws from the clamor for his crowning; Jesus comes to his disciples in distress)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula? -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 2 - చీకటిలో వెలుగు ప్రకాశించుట (యోహాను 5:1 - 11:54)
B - యేసు జీవాహారము (యోహాను 6:1-71)

2. యేసు ఘనతను తిరస్కరించుట (యోహాను 6:14-15)


యోహాను6:14-15
14 ఆ మనుష్యులు యేసు చేసిన సూచక క్రియను చూచినిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. 15 రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోవుచున్నారని యేసు ఎరిగి, మరల కొండకు ఒంటరిగా వెళ్లెను.

యేసు ఈ లోకమునకు వచ్చినది మనుషులను గెలుచుటకు . ఎప్పుడైతే యేసు ఐదు వేలమందిని రొట్టెలతో తృప్తిపరచాడో అప్పుడు అనేకులు అయన చూట్టు కూర్చుండిరి . అప్పుడు అయన చుట్టూ ఉన్నవారు ఆయనను బట్టి చప్పట్లతో నాట్యము వేసిరి , మా రాజువు నువ్వే అని చెప్పిరి . అప్పుడు వారు ఈ మనిషి గాలీలయుడని తెలుసుకొనిరి; దేవుడు తన స్వరమును అతని ద్వారా వినిపించి అతని ద్వారా తనకు ఘనత కలుగునట్లు చేసెను . మరియి ఈ ప్రకృతి కూడా అతనికి లోబడియుండెను . మోషే ఏవిధముగా అయితే అరణ్యములో మన్నాను ఇశ్రాయేలుకు ఇచ్చియున్నాడో ఆలాగుననే క్రీస్తు కూడా వారికి అరణ్యములో తినుటకు ఆహారము యిచ్చియున్నాడు .అందుకే అతను ప్రవక్త ప్రవచించినట్లు ప్రవక్త గా ఉన్నాడు (ద్వితీయోప 18:15) మరియు ఒక వేళా యేసు వారికి రాజుగా ఉన్నట్లయితే వారి జీవితాలలో కష్టపడవలసి ఉండదని భావించిరి , " మనకు ఆయన వాక్యములను చదువుటకు సమయము ఉన్నట్లయితే . అతను మనకు తినుటకు ఆహారమును దయచేయును . మరియు ఈ విధమైన రాజు రోమీయులను ఎదుర్కొనుటకు సమర్థుడని చెప్పిరి . మెయిర్యు అతను పరలోకమునుండి అగ్నిని ఈ భోమిమీదకు తచ్చి వారిని నాశనము చేయును అని నమ్మిరి .కనుక మనము ఆయననను రాజుగా ప్రకటించెదము రండి " అని చెప్పిరి. వారందరు ఒక్కటిగా చేరి యేసును వారి భుజములమీద మోసుకొనిరి . వారు యేసును వారి నీరీక్షణగా పెట్ట్టుకొనిరి మరియు క్రీస్తు వారి ప్రతి అక్కరలను తీర్చును .

అతని గమనమునకు గల యేసు గురి ఏమిటి ? వారి నమ్మకమును బట్టి మరియు ఆనందమును బట్టి యేసు సంతోషించాడా ? తన ప్రణాళికలను చేయునా లేక అవిశ్వాసులను బట్టి తన రాజ్యమును కట్టలేదా ? లేదు అతను ఏ విధమైన మాట మాట్లాడలేదు అయితే అరణ్యములోనికి వెళ్ళిపోయాడు . అతను మనిషి ద్వారా పూటకు ఇష్టపడలేదు కానీ దేవుని ద్వారా అతను తన కృపను యిచ్చియున్నాడు .

యేసుకు ఈ లోకములో తన రాజ్యమును స్థాపించుట ఇష్టములేదు అయితే ప్రతి ఒక్కరినీ పశ్చాతాపమునకు నడిపించి నూతన జన్మమునకు వచ్చునట్లు నడిపించెను .అక్కడున్న వారు యేసు యొక్క అద్భుతములను మరియు ఆయన సూచనలను అర్థముచేసుకొనలేదు . వారు ఈ లోక ఆహారమును బట్టి ఆలోచనచేసినప్పుడు క్రీస్తు ఆత్మీయమైన ఆకలిని తీర్చుటకు ఉద్దేశించెను .వారు ఈ లోక కృపను బట్టి ఆలోచనకలిగినప్పుడు యేసు తన సిలువ ద్వారా తన రాజ్యమును స్థాపించాలని చూసేను . పశ్చాత్తాపము లేనిదే రెండవ జన్మము దొరకదు మరియు నీవు క్రీస్తును ఆహ్వానించలేవు .

యేసుకు అక్కడున్న వారి యొక్క ఘనత అవసరము లేకపోయెను .ఎందుకంటె అతనికి మనిషి ఘనత అంగీకరించలేదు , అయితే తన తండ్రి స్వరమును వినుటకు మాత్రమే ఇష్టపడెను . అనుదుకే సాతానును బట్టి తన హృదయమును నెమ్మది చేసుకొనెను . తన తండ్రి దగ్గరకు వచ్చి తన ప్రార్థనను అంగీకరించి హృదయముందు గ్రుడ్డి తనముగా ఉనావారి కన్నులను తెరుచుటకు పాటుపడెను . మరియు మనుషుల చేత ఘనత అంగీకరించలేదు , ఎందుకంటె వారు ఒక సారి " హోసన్నా " అని మరియు మరొక్కసారి " సిలువ వేయుము " అని మరొక్క సారి అంటారు కాబట్టి .కనుక క్రీస్తుకు మన హృదయములు తెలుసు కాబట్టి మనలను ఎన్నటికీ విడువనటువంటి వాడు .


3. యేసు దుఃఖముతో శిష్యులదగ్గరకు వచ్చుట (యోహాను 6:16-21)


యోహాను 6:16-21
16 సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రము నొద్దకు వెళ్లి దోనె యెక్కి సముద్రపు టద్దరినున్న కపెర్నహూమునకు పోవుచుండిరి. 17 అంతలో చీక టాయెను గాని యేసు వారియొద్దకు ఇంకను రాలేదు. 18 అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. 19 వారు ఇంచుమించు రెండు కోసుల దూరము దోనెను నడిపించిన తరువాత, యేసు సముద్రముమీద నడుచుచు తమ దోనెదగ్గరకు వచ్చుట చూచి భయపడిరి; 20 అయితే ఆయన నేనే,భయపడకుడని వారితో చెప్పెను. 21 కనుక ఆయనను దోనెమీద ఎక్కించుకొనుటకు వారిష్టపడిరి. వెంటనే ఆ దోనె వారు వెళ్లుచున్న ప్రదేశమునకు చేరెను.

యేసు సముద్రపు ఒడ్డున ఉన్నప్పుడు తన శిష్యులు సముద్రపు అలలలో ఉంది భయపడినప్పుడు . ఆ రాత్రి కాలమందు క్రీస్తు ఆ నీటిపైనా నడుచుకుంటూ వెళ్లెను .వారిని యేసు ఆ సందర్భములో ఒంటరిగా విడువలేదు అయితే వారి స్థితిని చూసినాడు .ఎందుకంటె జాలరులు తమ సమయము నంతటిని ఆ సముద్రములో కేటాయించినప్పుడు వారు చూసిన ప్రతి అలలను ఒక దెయ్యములాగా అనుకొంటారు .అప్పుడు యేసు వారి దగ్గరకు వచ్చి , " ఇది నేనే " అని మాట్లాడినాడు .అప్పుడు ఆ అపొస్తలుల యొక్క విశ్వాసమునకు ఒక అనుభవము వచ్చెను .మనము ఈ విధమైన మాటలను పాత నిబంధన గ్రంథమందు కూడా చదువగలము " నేనే " అను మాటకు దేవుని సన్నిధి అని అర్థము .ఎందుకంటె శిష్యులకు యేసుకు కలిగిన సమస్త అధికారము కలదని తెలుసుకొనిరి .ఎందుకంటె రొట్టెలను ఎన్నో వేలమందికి పంచాడు , మరియు నీటి మీద నడిచాడు , మరియు నీటిని ద్రాక్షారసముగా మార్చాడు .ఇవన్నీ చూసిన తరువాత వారి విశ్వాసము క్రీస్తుపైన బలపరచబడినది .అందుకే ఎసరు వారిని భయపడవద్దు అని చెప్పెను ." భయపడవద్దు " అనే ఆజ్ఞ తనను వెంబడించువారికి క్రీస్తు ఇచ్చెను .ఈ మాట బైబిల్ లో365 సార్ర్లు చెప్పబడినది . యేసును నబ్బినట్లైతే దాని అర్థము మనము భయపడము అనే అర్థము .ఏ సమస్యలో నీవున్న పరిస్థితితిలో నీవున్న యేసు అనునది " భయపడవద్దు " .

ఎప్పుడైతే యేసును వారు చూసేరా అప్పుడు ఆయనను వారి పడవలోకి ఆహ్వానించిరి .ఇది ఆ దినమున యేసు చేసిన మూఢ అద్భుతముగా ఉన్నది . కనుక యేసు తన సంఘమును మరియు వాటి సభ్యులను వారి దుఃఖములనుంచి మరియు సమస్యల నుంచి వారిని విడిపించుటకు సిద్ధముగా ఉన్నాడు .యేసు తన శిష్యులదగ్గరకు వచ్చినప్పుడు వారు కూడా క్రీస్తుకు తమను తాము సమర్పించుకోవాలి ఆశపడెను .కనుక యేసుకు నీవు ఆయనను నమ్ముట అవసరము .ఎప్పుడైతే క్రీస్తు నీ జీవితములోనికి వచ్చునో అప్పుడు నీ జీవితములో ఉన్న భయమును తీసివేసి నీవు ఆయనతో ఆసాము కలిగిఉండునట్లు నీకు సహాయమును దయచేయును .

ప్రశ్న:

  1. అక్కడున్న వారి నుంచి తాను రాజుగా కిరీటమును స్వీకరించుటకు ఎందుకు వ్యతిరేకించేను ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 10:47 AM | powered by PmWiki (pmwiki-2.3.3)