Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 033 (Healing of the paralytic)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 2 - చీకటిలో వెలుగు ప్రకాశించుట (యోహాను 5:1 - 11:54)
A - యెరూషలేమునకు రెండవ ప్రయాణము (యోహాను 5:1-47) -- యేసుకు మరియు యూదులకు మధ్య వైరము

1. బేతెస్థలో పశ్చావాతము గలవాడిని స్వస్థపరచుట (యోహాను 5:1-16)


యోహాను 5:1-9
1 అటుతరువాత యూదుల పండుగ యొకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్లెను. 2 యెరూషలేములో గొఱ్ఱల ద్వారము దగ్గర, హెబ్రీ భాషలో బేతెస్ద అనబడిన యొక కోనేరు కలదు,దానికి అయిదు మంటపములు కలవు. 3 ఆ యా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదలించుట కలదు. నీరు కదలింపబడిన పిమ్మట,మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధిగలవాడైనను బాగు పడును, 4 గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు ఊచకాలుచేతులు గలవారు, గుంపులుగా పడియుండిరి. 5 అక్కడ ముప్పది యెనిమిది ఏండ్లనుండి వ్యాధిగల యొక మనుష్యుడుండెను. 6 యేసు,వాడు పడియుండుట చూచి,వాడప్పటికి బహుకాలమునుండి ఆ స్థితిలోనున్నాడని యెరిగిస్వస్థపడ గోరుచున్నావా అని వాని నడుగగా 7 ఆ రోగి అయ్యా,నీళ్లు కదలింపబడి నప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు గనుక నేను వచ్చునంతలో మరియొకడు నాకంటె ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. 8 యేసు నీవు లేచి నీ పరుపెత్తికొని నడువుమని వానితో చెప్పగా 9 వెంటనే వాడు స్వస్థతనొంది తన పరుపెత్తికొని నడిచెను.

యేసు సుమారు తొమ్మిది నెలలు గలిలయలో ఉంది, ప్రత్యక్ష గుడారము యొక్క పండుగకు యెరూషలేమునకు వెళ్లెను. ఆ పట్టణములో విశ్వాసమునకు ఒక యుద్ధము ఉండి అక్కడ ఆ యుద్ధము ఓడిపోవును అని తెలుసు. అక్కడ భక్తిగల వారు ఉందురు అని మరియు వారు ధర్మశాస్త్రమందు నమ్మకముగలవారని క్రీస్తుకు తెలుసు. మూడు సార్లు యేసు యెరూషలేమునకు ఒక యాత్రికుడుగా వెళ్లెను,ఎప్పుడైతే అతనికి సాధ్యపడినప్పుడు (ద్వితీయోప 16:16).

ఆ పట్టణములో ఒక మడుగు ఉండెను గ్రీకు మాటలలో అది అప్పుడప్పుడు దూతలచేత కదిలింపబడుతుంది అని తెలుసుకోవచ్చు. హేరోదు రాజు దాని చుట్టూ ఒక గోడను కూడా కట్టించియున్నాడు. దాని ముందర భాగము ఈ మధ్యనే కట్టగడము జరిగినది. దీనిని, " దాయకలిగిన గృహము" అని దీనిని పిలుస్తారు. ఎందుకంటె అక్కడే అనేకమంది స్వస్థతకొరకు వచ్చుచుండిరి- అప్పుడు నీళ్లు కదిలింపబడుట చూచిరి. ఎవరైతే మొదటగా రాయి వేస్తారో వారు మొదటగా స్వస్థతకాలుగా చేయబడతారని విశ్వసించువారైరి.

అక్కడ యేసు అనేకమంది ఉండుట చూచెను మరియు అక్కడ ఒక పక్షవాయువు గల మనిషిని గమనించెను,అతనికి దాదాపుగా ఈ వ్యాధి 38 సంవత్సరములనుండి ఉన్నది. ఈ పరిస్థితిలో ఈ మనిషి అందరి చేత వెలివేయబడ్డాడు. కనుక ఈ దయగల గృహములో ఇతనికి దయ దొరకలేదు. అయినప్పటికీ అతను నిరీక్షణ కోల్పోలేదు,అయితే తన సమయము కొరకు ఎదురుచూచుచువచ్చాడు,తనకు ఖచ్చితముగా యేసు దాయకలిగి ఉంటాడని విశ్వసించాడు. అప్పుడు అతడు అకస్మాత్తుగా యేసు ఆయన ఎదుట నిలిచియుండుట చూచి తనకు స్వస్థత కలుగుట ప్రారంభమైనది చూచెను. అప్పుడు తనకు ఉన్న ఆ వ్యాధి పోవుట గమనించెను. అప్పుడు క్రీస్తు అతనికి తన వేదనను చెప్పుటకు ఒక అవకాశము కలిగించెను, " ఎవరు నన్ను గూర్చి చింతించలేదు! నాకు స్వస్థత అవసరమై ఉండగా ఎవరు నాతో ఏడ్చలేదు,నా గురించి ఎవరు కూడా అడగలేదు,కనుక నీవు నాకొరకు వచ్చి నన్ను ఈ నీళ్ళలోకి తీసుకువెళ్లావేమో? "

ఎవరు నన్ను సంరక్షించరు! ఇది నీ స్థానమా సహోదరా?ఇతరులు నిన్ను వ్యతిరేకిస్తున్నారు ?యేసు నీతో నిలుస్తాడని నీకు మేము చెబుతున్నాము: నీ గురించి అడిగి నిన్ను కనుగొన్నాడు. నీకు సహాయము చేసి నిన్ను రక్షించును. ఈ విధమైన భావన ఆ పక్షవాతము కలిగిన మనిషికి వచ్చినది. అతను ప్రశ్నలు క్రీస్తుకు కనబడినవి. అది యేసు ప్రేమకు అతని పట్ల దయను దయచేయనదిగా ఉన్నది.

ఎప్పుడైతే ఆ మనిషిలో ఉన్న విశ్వాసమును యేసు గమనించినప్పుడు, యేసు మాత్రమే తనను స్వస్థపరచగలదని నమ్మినప్పుడు యేసు ఈ విధముగా ఆజ్ఞాపించాడు, " లేచి నీ దుప్పటి తీసుకొని నడుచు". ఇది ఒక అసాధ్యమైన దానిని యేసు సాధ్యపరచినట్లుగా మనము గమనించవచ్చు. ఆ వ్యాధిగల మనిషి యేసు శక్తిని నమ్మి ఆయన యందు సంపూర్ణ విశ్వాసముకలిగి తన ఎముకలు సత్తువను కలిగి తన కండరములు తగిన శక్తి కలిగి సంపూర్ణముగా స్వస్థత పొందెను.

అప్పుడు అతను ఎగిరి గంతులు వేసి తన దుప్పటిని తన తల మీద వేసుకొని సంతోషముతో లేచి వెళ్లెను. అతని విశ్వాసము క్రీస్తు శక్తి అయిన వాక్యము జరుగునట్లు అప్పటికప్పుడే స్వస్థతను అనుభవించెను.

ప్రార్థన: ప్రభువైన యేసు ఈ మనిషికి నీవు చేసిన గొప్ప కార్యమును బట్టి మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అతనికి ఎవరు లేరు అయితే నీవే అతనికి అన్ని అయి స్వస్థత పరచావు. కనుక మా జీవితాలలో కూడా నీ రూపమునకు ప్రతిరూపమైన ప్రేమతో మమ్ములను ప్రేమించి,ఇతరులను మేము కూడా నీ ప్రేమ చేత ప్రేమించినట్లు మమ్మును నీవు మార్చుము,నీ ప్రతి విధమైన ఆశీర్వాదాలు అందరికి పంచునట్లు మమ్ములను నీవు ఆశీర్వదించు.

ప్రశ్న:

  1. బేతెస్థ కోనేరు దగ్గర క్రీస్తు పక్షవాతము కలిగిన మనిషిని ఏ విధముగా స్వస్థపరచెను ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 10:40 AM | powered by PmWiki (pmwiki-2.3.3)