Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 028 (Jesus leads the adulteress to repentance)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 1 - ప్రకాశించుచున్న వెలుగు (యోహాను 1:1 - 4:54)
C - క్రీస్తు తన శిష్యులను పచ్చాత్తాపము నుండి ఆనందకరమైన వివాహములోనికి నడుపును (యోహాను 2:13 – 4:54) -- నిజమైన ఆరాధనా అనగా ?
4. సమారియాలో క్రీస్తు (యోహాను 4:1-42)

a) వ్యభిచారులు యేసు పచ్చాత్తాపములోనికి నడిపించుట (యోహాను 4:1-26)


యోహాను 4:1-6
1 యోహాను కంటె యేసు ఎక్కువమందిని శిష్యులనుగా చేసికొని వారికి బాప్తిస్మమిచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలిసినప్పడు 2 ఆయన యూదయ దేశము విడిచి గలిలయదేశమునకు తిరిగి వెళ్లెను. 3 అయి నను యేసే బాప్తిస్మమియ్యలేదు గాని ఆయన శిష్యులిచ్చు చుండిరి. 4 ఆయన సమరయ మార్గమున వెళ్లవలసివచ్చెను గనుక 5 యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారను ఒక ఊరికి వచ్చెను. 6 అక్కడ యాకోబు బావి యుండెను గనుక యేసు ప్రయాణమువలన అలసియున్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను; అప్పటికి ఇంచుమించు పండ్రెండు గంటలాయెను.

యోహాను యేసును "ప్రభువా" అని పిలుచుచున్నాడు, రాజుగా పాలించువాడు నిత్యా చరిత్రను చేయును. ఎందుకంటె అతనే శిక్షించి మరియు కృపను దయచేయును. వారిని నడిపించును మరియు తీర్పు తీర్చును. కనుక వీటిని చూసి ఈ పేరు ద్వారా పిలిచును.

పరిసయ్యులు యున్నదమునకు సిద్దపడునప్పుడు. క్రీస్తు సువార్త యూదయ వారికి ఒక జయముగా ఉండెను. ఆటను బాప్తీస్మమిచ్చు యోహాను వాలే వచ్చి పాపములను ఒప్పుకొని పచ్చాత్తాపం పదుమని పిలిచెను. యేసు నీటి బాప్తీస్మమును ఒక ఆత్మ బాప్తీస్మము అని యోచించెను. అందుకే అతని సమయము రాలేదు కనుక ఆటను బాప్తీస్మము పొందలేదు.

ఎప్పుడైతే పరిసయ్యులు ఎక్కువైనప్పుడు యేసు అక్కడినుండి ఉత్తరదిక్కునకు బయలు వెళ్లెను. అతని తన తండ్రి అయినా దేవుని ప్రణాళిక ప్రకారముగా జీవించెను. యేసు సమారియా వెళ్ళుటకు కొండల ప్రాంతము నుంచి బయలుదేరి గలిలయ మార్గమును వెళ్లెను.

ఈ సమారియాలు పాత నిబంధన గ్రంధములో ఉండు గుర్తింపు పొందిన వారు కారు,ఎందుకంటె వారిలో కొంతమంది ఇశ్రాయేలు రక్తమును కూడా కలిగివున్నారు. 722 క్రి,పూర్వ. కాలములో అస్సిరియలో ఉన్న సమారాయులు అబ్రాహాము యొక్క సంతతితో మెసపొటేమియా అను ప్రదేశములో సమారియా అను గుంపులో ఉండిరి.

యేసు సిక్కర్ అను ఒక ప్రదేశమునకు వచ్చి,ఈ ప్రదేశములోనే యెహోషువ దేవుని ద్వారా నిబంధన పొందినది (ఆది 12:6 మరియు యెహోషువ 8:30-35). అక్కడ ఒక నది కూడా ఉన్నది (ఆది 33:19). నాబ్ల్స్ అను ప్రదేశములో యెహోషువ ఎముకలు కాల్చియున్నారు (యెహోషువ 24:32). ఈ ప్రదేశము పాట నిబంధన గ్రంధములో ఒక చారిత్రకంగా నిలిచింది.

యేసు మధ్యాహ్న సమయమందు నది ప్రక్కలో కూర్చొని. అప్పుడు అతను ఒక నిజమైన మనిషిగా దప్పిగొని ఉన్నాడు. కనుకనే ఆటను ఒక నిజమైన మనిషిని పోలియుండెను .

యోహాను 4:7-15
7 సమరయ స్త్రీ ఒకతె నీళ్ళు చేదుకొను టకు అక్కడికి రాగా యేసునాకు దాహమునకిమ్మని ఆమె నడిగెను. 8 ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్లియుండిరి. 9 ఆ సమరయ స్త్రీయూదుడ వైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని యేలాగు అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏల యనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. 10 అందుకు యేసునీవు దేవుని వరమునునాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజల మిచ్చునని ఆమెతో చెప్పెన 11 అప్పుడా స్త్రీ అయ్యా, యీ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమియు లేదే; ఆ జీవజలము ఏలాగు నీకు దొరకును? 12 తానును తన కుమాళ్లును, పశువులును, యీబావినీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రియైన యాకోబుకంటె నీవు గొప్పవాడవా?అని ఆయనను అడిగెను. 13 అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పిగొనును; 14 నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు;నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. 15 ఆ స్త్రీ ఆయనను చూచి అయ్యా,నేను దప్పిగొనకుండునట్లును,చేదుకొనుట కింతదూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయుమని అడుగగా

యేసు ఆ బావి దగ్గర నిలిచినప్పుడు ఒక సమరయ స్త్రీ నీళ్ల కొరకు వచ్చినది, సహజముగా సమరయ స్త్రీలు ఉదయము లేదా సాయంత్రము నీటి కొరకు వస్తారు, అయితే ఈ సమయములో ఈ సమరయ స్త్రీ మధ్యాహ్న కాలమందు వచ్చినది. ఆమె ఎవ్వర్నీ కలుచుటకు అక్కడికి రిలేదు, అయితే అందరితో వ్యతిరేకించబడినదిగా ఉండెను. అప్పుడు యేసు ఆమె బరువైన హృదయమును దూరము నుంచే గమనించి ఆమె తన దోషములను కడగబడుటకు దప్పిగొని యుండెనని తెలుసుకొనెను. అయితే అప్పుడు క్రీస్తు ఆమెను బాగుచేయాలని, పది ఆజ్ఞలను వినిపించలేదు లేదా ఆమెను తిట్టలేదు అయితే ఆమెను నీళ్లు ఇమ్మని అడిగెను. ఎవరైనా త్రాగడానికి నీళ్లు ఇస్తారా అని ఎదురుచూచువాడుగా ఉండెను. అయితే ఆటను ఒక యూదుడని ఎప్పుడైతే ఆమె తెలుసుకొనెనో ఆయనకు నీళ్లు ఇచ్చుటకు ఇష్టపడలేదు. ఎందుకంటే ఆ దినాలలో యూదులకు మరియు సమరయులకు యుద్ధము జరుగుతున్నది కనుక. అయితే అక్కడ క్రీస్తు ఆమెను ఆ విషయాలను బట్టి ఆలోచించలేదు అయితే ఒక తగ్గింపు స్వభావము కలిగి నెమ్మదితో నీళ్లు కావాలని అడిగినది.

ఈ శాందర్భములో యేసు దప్పిగొనినది వారి పాపా విషయములో. ఆ స్థలములో బావి ఉన్నది కనుక నీటిగురించి మాటలాడుటకు అవకాశము కలిగెను. ఏది ఆమె హృదయములో దేవుని బహుమానమని ఎంచెను. అక్కడ ఆయన దేవుని ప్రేమను చూపించెను. అక్కడ తీర్పును క్రీస్తు ఆవిష్కరించలేదు. అయితే దేవుని కృపను చూపించియున్నాడు. కనుక ఇది నిజముగా ఒక గొప్ప అద్భుతమే.

కృప అనునది ఒక వీచు గాలి వాలే రాదు , అయితే అది కేవలము క్రీస్తు ద్వారానే వచ్చును.ఎందుకంటె అతనే నైపుణ్యములను మరియు కృపాలను ఇచ్చెడివాడు. ఇంకా ఆ స్త్రీ ఇంకను క్రీస్తును ఒక సామాన్యమైన వ్యక్తిగానే చూస్తున్నది. క్రీస్తు మహిమ ఇంకా ఆమె కన్నులయెదుటనే ఉన్నది, అయితే అతని నిజమైన ప్రేమ ఆమెకు కలుపటముగా కనబడుచున్నది. అందుకే అతను జీవ జలము ఆయన ఆస్తిగా ఉన్నాడని. తన పరలోక జలములచేత ఆత్మల దాహమును తీర్చును. కనుక ప్రజలు ప్రభువు ప్రేమను ఆయన సత్యమును ఆశించి ఆయన వైపు నడుచుదురు. ఎవరైతే క్రీస్తు దగ్గరకు వస్తారో వారు తప్పిక గొనరు.

ఎవరైతే దేవుని బహుమానమును అడుగుదురో వారికి క్రీస్తు తన పరలోక బహుమానములను దయచేయును. క్రీస్తు ఏవిధముగానైతే నీటికొరకు దాహము కలిగినాడొ అదేవిధముగా మనము కూడా మన ప్రతి అవసరమును బట్టి అడగాలి. ఎవరైతే తమ శిరస్సును వంచి అడగక పోతే వారికి పరలోక ఉచిత బహుమానములు పొందలేరు.

ఆ స్త్రీ క్రీస్తును అర్థము చేసుకొనలేదు. అందుకే " నీతో నీళ్లు బయటికి తీయుటకు తగిన గిన్నె లేదు కనుక ఏ విధముగా నీటిని తీయగలవు ?"అని. అదేవిధముగా ఆ సమయములో ఆమె క్రీస్తు యొక్క దయాకలిగిన హృదయమును అనుభవించెను. ఆయన తన మహిమతో ఆమె కన్నా దూరముగా ఉన్నప్పటికి తన ప్రేమలో మరియు పరిశుద్ధతలో ఆమెకు దగ్గరగా ఉన్నాడు. అతని మాదిరి పరిశుద్ధుడిని ఆమె ఇది వరకు ఎవ్వరిని చూడలేదు, కలుసుకొనలేదు. అందుకే " మా పితరుడైన యాకోబు కంటే నీవు గొప్పవాడా? నీ నూతన ప్రణాళిక ద్వారా మాకు నూతన బావిని ఇవ్వగలవా?

యేసు పలుకుతూ నా దగ్గర ఈ లోక సంబంధమైన దాహము తీర్చే నీరు లేవు, ఎందుకంటె ఆ నీటి ద్వారా తిరిగి దప్పిగా కలుగుతున్నది కాబట్టి. ఎందుకంటె ఈ శరీరమునకు నీరు అవసరము కాబట్టి.

ఏది ఏమైనా క్రీస్తు మనకు తన జీవ జలము ఇచ్చి ఆత్మీయమైన దాహమును తీర్చును. క్రైస్తవులు క్రీస్తును వెతికినప్పుడు వారికి ఆయన దొరుకునట్లు తన ప్రేమను మరియు తన సన్నిధిని సంపూర్ణముగా వెతుకువారికి ఆయన దయచేయును. అతని ప్రకటన మన జీవితములలో ఒక నిత్యమూ నీరు నందిచ్చునట్లు మరియు అతని జ్ఞానమును, ఆలోచనలను, శక్తిని, మైర్యు జీవమును దయచేయును. కనుక పరిశుద్ధాత్ముడు దేవుని బహుమానంగా జలముగా ఉన్నది.

మూడు సార్లు క్రీస్తు ఆటను మాత్రమే జీవ జలమును ఇచ్చువాడని చెప్పినాడు. కనుక ఏ విధమైన మనిషి లేదా మతము నీ ఆత్మీయ దాహమును తీర్చావు అయితే కేవలము క్రీస్తు మాత్రమే.

ఎవరైతే దేవుని బహుమానమును స్వీకరించారో వారు మార్పుకలిగినవారు. ఎవరైతే దాహముకలిగి క్రీస్తు దగ్గరకు వచ్చిఅట్లైతే వారు నీటి ద్వారా సమృద్ధికలిగి ఇతరులకు ఆశీర్వాదముగా ఉంది, వారికి కృపను, ఆనందమును, ప్రేమను మరియు పరిశుద్దాత్మ ఫలములను ఇచ్చుచు ఉండెదరు. కనుక క్రీస్తులో స్థిరత్వమూ కలిగి ఉంటె వారు కృప వెంబడి కృపను పొంది, తనకు తానూ దేవుని బహుమానంగా ఉండును.

ఆ స్త్రీ తనతో మాట్లాడుతున్న యేసు మంచివాడని మరియు అతను మాంత్రికుడు కాదని తెలుసుకొనెను. అందుకే ఆమె అతనిని జీవ జలము కొరకు అడిగెను. తన అవసరముల కొరకు ఆలోచిస్తూ ఇంకా క్రీస్తు ఈ లోక నీటి కొరకు మాట్లాడుతున్నాడని అనుకొనెను. ఎందుకంటె జీవ జలమును పందికొన్నట్లైతే ఇక ఎప్పటికి తన తలా మీద నీటి బిందెతో రావడం జరగదని మరియు ఎవరు తనను హేళన చేయరని అనుకొనెను .

ప్రార్థన: జీవ జలమును ఇచ్చేది యేసు. మా దాహంగా నీ జ్ఞానమును ప్రేమను దయచేయుము. మా ప్రతి చెడిపోయిన వాటిని బాగుచేయుము. అప్పుడు పరిశుద్ధాత్ముడు మాలో ఉంది మమ్ములను బలపరచిఉన్నట్లు. మమ్ములను మీ ప్రేమతో మరియు మీ జీవజాలములతో నింపుము అప్పుడు మేము అనేకులకు నీ జీవ జలమును పంచి వారిని కూడా నీ సన్నిధికి తీసుకొని వచ్చినట్లు చేయుము.

ప్రశ్న:

  1. యేసు ఇచ్చు బహుమానములు ఏమి ? దాని గుణము ఏమి?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 10:35 AM | powered by PmWiki (pmwiki-2.3.3)