Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 026 (The Baptist testifies to Jesus)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur? -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 1 - ప్రకాశించుచున్న వెలుగు (యోహాను 1:1 - 4:54)
C - క్రీస్తు తన శిష్యులను పచ్చాత్తాపము నుండి ఆనందకరమైన వివాహములోనికి నడుపును (యోహాను 2:13 – 4:54) -- నిజమైన ఆరాధనా అనగా ?

3. యోహాను క్రీస్తును పెండ్లికుమారుడుగా చూపుట (యోహాను 3:22-36)


యోహాను 3:22-30
22 అటుతరువాత యేసు తన శిష్యులతో కూడ యూదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిస్మమిచ్చుచు ఉండెను. 23 సలీము దగ్గర నున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహానుకూడ అక్కడ బాప్తిస్మమిచ్చుచు ఉండెను; జనులు వచ్చి బాప్తిస్మముపొందిరి. 24 యోహాను ఇంకను చెరసాలలో వేయబడియుండ లేదు. 25 శుద్ధీకరణాచార మును గూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదము పుట్టెను. 26 గనుక వారు యోహాను నొద్దకు వచ్చిబోధకుడా, యెవడు యొర్దానుకు అవతల నీతో కూడ ఉండెనో, నీ వెవనిగూర్చి సాక్ష్యమిచ్చితివో, యిదిగో, ఆయన బాప్తిస్మ మిచ్చుచున్నాడు; అందరు ఆయనయొద్దకు వచ్చు చున్నారని అతనితో చెప్పిరి. 27 అందుకు యోహాను ఇట్లనెనుతనకు పరలోకమునుండి అనుగ్రహింపబడితేనేగాని యెవడును ఏమియు పొంద నేరడు. 28 నేను క్రీస్తును కాననియు, ఆయనకంటె ముందుగా పంపబడినవాడనే అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. 29 పెండ్లికుమార్తెగలవాడు పెండ్లి కుమారుడు; అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినెడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును;ఈ నా సంతోషము పరిపూర్ణమై యున్నది. 30 ఆయన హెచ్చవలసియున్నది, నేను తగ్గవలసి యున్నది.

పస్కాపండుగ తరువాత క్రీస్తు యెరూషలేమును వదిలి బాప్తీస్మమిచ్చుటకు బయలుదేరెను, ఎందుకంటె శిష్యులకు తెలుసు హృదయము పగిలితేనే వారికి రక్షణ మరియు నూతన జన్మ వస్తున్నదని. పశ్చాత్తాప పాపములకు పగిలిన హృదయము ఒక సాదృశ్యముగా ఉన్నది. దీని ద్వారానే దేవుని నూతన నిబంధనలోనికి మార్చబడగలరు.

యోహాను తన సువార్తను యోరాదను నది ఉత్తరదిక్కునకు వ్యాపించెను. అప్పుడు అక్కడున్న అనేకులు యోహాను దగ్గరకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనినప్పుడు వారికి యోహాను బాప్తీస్మమిచ్చి క్రీస్తు కొరకు సిద్ధముగా వారిని చేసెను.

పస్కాపండుగ తరువాత క్రీస్తు నేరుగా గలిలయకు రాలేదు అయితే తక్కిన ప్రదేశములో ఉన్నవారికి బాప్తీస్మమిచ్చుచుండెను. అప్పుడు అతనికి శక్తి ఉన్నది కనుక యోహాను దగ్గరకంటే ఎక్కువగా క్రీస్తు దగ్గరకే వచ్చి బాప్తీస్మముపొందిరి. అప్పుడు అక్కడున్నవారికి ఇద్దరిలో ఎవరి దగ్గర పాప క్షమాపణ దొరుకుతుంది ? అని అనుకొనిరి. వీరిలో ఎవరు దేవునికి దగ్గర కలవారు ? అనే ప్రశ్నలు వేసుకొనిరి. ఎందుకంటె వారి జీవితములను పూర్తిగా మార్చుకోవాలని ఇష్టపడిరి కనుక. సహోదరుడా నీ ప్రతి ప్రవర్తన మార్చబడినదా? నీవు నీ జీవితము సంపూర్ణముగా మార్చబడుటకు ఇష్టపడ్డావా, లేక నీ పాపములను దాచుకొనుటకు ఇష్టపడుతున్నావా ?

యోహాను తన గొప్ప శ్రమను తప్పించుకున్నాడు. క్రేఈస్టుతో అతనికి ఏ విధమైన వ్యతిరేక భవన కలగలేదు అయితే క్రీస్తు వచ్చినతరువాత తన పని ముగిసినది తెలుసుకొన్నాడు. అందుకే " మనుష్యులు చేయలేను మంచి పనులను కేవలము దేవుని కుమారుడు మాత్రమే చేయగలదని" చెప్పియున్నాడు. ఎందుకంటె మనము అప్పుడప్పుడు మన సొంత ఆలోచనలచేత మేమె చేసియున్నామని పొగడబడుచుంటాము. ఒకవేళ నీవు ఆత్మీయ బహుమానమును పొందియున్నావంటే అది కేవలము దేవుని ద్వారానే వచ్చినది. నీవు ఒక వేళా దేవుడు ఏమి చేయమన్న నీవు చేసినయడల నీవింకను ఒక దాసుడుగా ఉన్నావు. అయితే యోహాను తగ్గింపు కలిగి, దేవుడిని ఘనపరచియున్నాడు.

మరొకసారి యోహాను తన శిష్యులకు తాను మెస్సయ్య కాదని చెప్పియున్నాడు. ఒకవేళ ఆటను క్రీస్తు ఒక గొప్ప శబ్దముచేత యెరూషలేములోని ప్రవేశించాలని అనుకొనిఉండవచ్చు, అయితే అది జరగలేదు. దానికి బదులుగా యేసు యోహాను ప్రకారముగా బాప్తీస్మమిచ్చెను. అయితే యోహాను దీనిని చూచి తనను తగ్గింపుకలిగి ఉన్నాడు. తనను దేవుడు ఒక ప్రవచన వాడిగా ఎన్నుకొన్నాడని నమ్మి క్రీస్తు మార్గమును సిద్ధముచేసెను.

యోహాను తనకు వచ్చిన ప్రకటనలో నమ్మకముకలిగి ఉండెను. అతను క్రీస్తును ఒక పెండ్లికుమారుడుగా భావించి పెండ్లికుమార్తెను సిద్ధముచేయునట్లుగా భావించెను. అందుకే ఈ దినాలలో ఆత్మ ఏకత్వమును నేర్పిస్తున్నది. అందుకే పౌలు, " మనము క్రీస్తు యొక్క శరీరములో భాగమై ఉన్నాము, అతను మన తలా అయి ఉన్నాడు; మనము అతనిలో ఒకటై ఉన్నాము". క్రీస్తు మనకు ఒక తీర్పు తీర్చువాడు కాదు కానీ రక్షకుడై ఉంది,మన కొరకు పెండ్లికుమారుడై ఉన్నాడు. వివాహ మహోత్సవము మనకు ఒక నిరీక్షణగా చూపిస్తున్నది.

విశ్వాసుల అభివృద్ధిలో యోహాను దూరముగా నిలుచున్నాడు. అయితే అతను క్రీస్తు ప్రక్కల నిలుచున్నాడు, లేక గుంపులో ఉన్నాడు. ఎందుకంటె తనకు తానూ క్రీస్తుకు నమ్మకమైన స్నేహితుడుగా ఉండాలని. అందుకే అతను అరణ్యములో ఒంటరివాడాయెను. క్రీస్తు పట్టణములోనికి నేరుగా ప్రవేశించి వాక్యములను ప్రకటించెను. అప్పుడు యోహాను వాటిని గమనించి దేవుని రాజ్యమందు ఆనందించెను. పెండ్లికుమారుని స్వరము అతడిని ఘనపరచెను.

యోహాను తన స్థితిని మార్చుకొనుటకు చనిపోవుటకు సిద్దపడెను. తనను తానూ తగ్గించుకొనెను ఎందుకంటె క్రీస్తు యందు తన విశ్వాసము అభివృద్ధి చెందాలని.

చదువరి,నీ సభను ఎవరు నాయకత్వము వహించుచున్నారు ? నాయకత్వమునకు ఒకరి కొకరు తగువు చేస్తున్నారా లేక నీవు ఇతరులకు ఇచ్చి క్రీస్తు నీలో బలముగా ఉండాలని అనుకున్నావా?యోహానుతో కలిసి చెప్పు, " అతను హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి".

ప్రశ్న:

  1. క్రీస్తు ఏ విధముగా పెండ్లికుమారుడుగా ఉన్నాడు ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 10:32 AM | powered by PmWiki (pmwiki-2.3.3)