Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":
Home -- Telugu -- John - 008 (The fullness of God in Christ)
This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Previous Lesson -- Next Lesson

యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము
భాగము 1 - ప్రకాశించుచున్న వెలుగు (యోహాను 1:1 - 4:54)
A - క్రీస్తు లో శరీరధారియైన దేవుని వాక్యము (యోహాను 1:1-18)

3. క్రీస్తులో దేవుని అవతారము (యోహాను 1:14-18)


యోహాను 1:14
14 ఆ వాక్యము శరీరధారియై కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యన నివసించెను, తండ్రివలన కలిగిన అడ్వెతీయ కుమారుని మహిమవలే మనము ఆయన మహిమను కనుగొంటిమి.

యేసు క్రీస్తు ఎవరు ? ఆయన నిజమైన దేవుడు మరియు నిజమైన మానవుడు. యోహాను మనకు ఈ గొప్ప రహస్యమును ఈ సువార్త ద్వారా తెలియపరచుచున్నాడు. ఎప్పుడైతే దేవుని అవతారమును మనకు యోహాను చూపిస్తున్నాడో అప్పుడే ఈ సువార్త యోక్క్క అర్థము మనకు తెలిసియున్నది. 14 వచనము దానికి అనుబంధము.

మన ఆత్మీయ మార్పుకంటే ఈ అవతారము అనునది వ్యత్యాసముగా ఉన్నది. మనకందరికీ శరీరములు ఉన్నవి ఎందుకంటె మనము తల్లి నుంచి తండ్రి నుంచి కలిగినవారము కాబట్టి. తరువాత దేవుని వాక్యము మనలోకి ప్రవేశించినపుడు నిత్యజీవములోనికి ప్రవేశించినాము. క్రీస్తు తండ్రి ద్వారా కలగలేదు మరియు ఆయన వాక్యము మరియా ద్వారా రాలేదు, "పరిశుద్దాత్మ నీ మీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును" (లూకా 1:35). ఎప్పుడైతే కన్య అయినా మరియా ఈ వార్తను నమ్మినదో అప్పుడే పరిశుద్ధత్మేచేత గర్భము ధరించెను, కనుక ఈ లోఆగునా దేవుడు మానవునిగా మారియున్నాడు.

ఆయన సత్యము మన ఆలోచనలను అప్పును. ఎందుకంటె శాస్త్రజ్ఞులు ఆశ్చర్యపోవునట్లు క్రీస్తు పుట్టుక జరిగినది కాబట్టి, అందుకే క్రీస్తు సంపూర్ణముగా మానవుడు మరియు సంపూర్ణముగా దేవుడై ఉన్నాడు.

దేవుని అవతారము క్రీస్తు ద్వారా ఒక ఆశ్చర్యమైన జన్మము లాగ ఉన్నది. నిత్యజీవపు దేవుని కుమారుడైన క్రీస్తు మన ప్రతి శారీరక మరియు ఆత్మీయ పాపములను కడిగి తన పరిశుద్ధాత్మచేత నింపి ఆయన ఏవిధముగా అయితే పరిశుద్దుడుగా ఉన్నదో మనము కూడా అదేవిధముగా ఉండాలని ఉద్దేశించువాడాయెను.

దేవుని కుమారుడు ప్రతి విధమైన మనుషులతో కూడా ఉన్నాడు. ఆటను నిత్యజీవము కలవాడు కాబట్టి మరణము లేని వాడుగా ఉన్నాడు. తనను తానూ ఘనపరచుకోకుండా మనకొరకు తన మహిమ ప్రదేశమును వదిలి మన మధ్యన నివాసము చేసియున్నాడు. కనుక మన ప్రతి పరిస్థితిని అర్థము చేసికొనువాడుగా ఉన్నాడు. తన బాధలలో మనకు తగ్గింపును నేర్పియున్నాడు. కనుకనే దేవునికి మనము పిల్లలముగా మార్చిబడడానికి తనను తానూ తగ్గించుకొని మనలను దేవునికి దగ్గర చేసియున్నాడు.

క్రీస్తు శరీరము పాతనిబంధన కాలములో ఉన్న ప్రత్యక్ష గుడారమునకు సాదృశ్యముగా ఉన్నది, అక్కడ దేవుడు ప్రజలను కలుస్తున్నవాడుగా ఉన్నాడు. దేవుడు క్రీస్తులో ఉండి మనుష్యులకు మానవునిగా కనబడినాడు. "ప్రత్యక్ష గుడారము మన మధ్యన" అని గ్రీకు భాషలో ఉన్నది అని యోహాను తెలియపరచియున్నాడు. దాని అర్థము దేవుడు అప్పుడప్పుడు మనుష్యులతో మాటలాడి తిరిగి వెళ్లిపోయేవాడు, అదేవిధముగా క్రీస్తు కూడా మన మధ్యన నివాసము చేసి తిరిగి పరలోకమునకు వెళ్లియున్నాడు అని అర్థము.

అపొస్తలులు క్రీస్తు మహిమను చూసాము అని చెప్పి, వారి సాక్ష్య జీవితములు ఆనందించుచున్నాయనిరి. ఎందుకంటె వారు దేవుని కుమారుడైన యేసుకు చూసిన సాక్షులైరి కనుక. వారి విశ్వాసము క్రీస్తు ప్రేమను, సత్యమును, దయను, మరియు దేవుని పరిశుద్దతను అనుభవించినవారైరి. "ఆయన మహిమ" అనే పాత నిబంధనలో వ్రాయబడినట్లు రుజువు చేసికొనిరి.

పరిశుద్ధాత్మచేత ప్రేరేపింపబడినతరువాత యోహాను తండ్రి అయినా దేవుడు, కుమారుడైన క్రీస్తు అని పిలిచియున్నాడు. వీటినుంచి తప్పించలేకున్నవారైరి. ఎలాగంటే తండ్రి సృష్టికర్త, కుమారుడు పరిశుద్ధుడు మరియు మహిమకరమైన నిత్యజీవము అని. దేవుడు కేవలము నాశనము చేయువాడు మాత్రమే కాదు అయితే కృపాకలిగి ఓర్పుకలిగినవాడు అదేవిధముగా కుమారుడైన క్రీస్తు కూడా. కనుక తండ్రి అయితే దేవునికి కుమారుడైన క్రీస్తును మనము పూర్తిగా అర్థము చేసుకొనవలెను. ఎవరైతే కుమారుడిని చూస్తారో వారు తండ్రిని చూసినట్లే. కనుక ఈ వాక్యముచేత మన హృదయములు మార్పుపొంది ఉండాలి.

దేవుడెవరో తెలుసుకోవాలనుకున్నావా ? అయితే క్రీస్తు జీవితమును తెలుసుకో ! శిష్యులు క్రీస్తులో దేనిని చూసారు ? వారి సాక్ష్యమునకు అర్థము ఏమిటి ? వారు దేవుని ప్రేమను మరియు ఆయన కృపాకలిగిన మహిమను చూసియున్నారు. నీవు ఈ మూడు అర్థములను తెలుసుకొని ప్రార్థించినట్లైతే నీవు దేవుని మహిమను దూసెదవు. ఎందుకంటె క్రీస్తు మనలను స్వస్థపరచుటకు వచ్చి మనకు తన మంచిని యిచ్చియున్నాడు. మనము చెందినవారి ఉన్నాకూడా మనలను తన పిల్లలుగా చేసికొనుటకు వచ్చియున్నాడు, "కృప ద్వారా కృప" ? దానికంటే ఎక్కువగా మనము ఆయన పిల్లలగుటకు మనకు తన కృపను దయచేసి యున్నాడు. కనుక కృప అనునది కేవలము మన విశ్వాసము వలననే వచ్చును.

ప్రార్థన: బేత్లెహేములో శిశువు ముందర సాగిలపడినట్లు ప్రభువా నీ సన్నిధిలో మేము సాగిలపడి, శరీరముచేత దేవుడుగా ఉన్న నీకు మేము కృతఙ్ఞతలు చెల్లిస్తున్నాము. నీ వెలుగు చీకటిలో ప్రకాశించునట్లు నా హృదయమును ప్రకాశింప చేసి నీ ముందర యోగినిగా ఉంచుము.

ప్రశ్న:

  1. క్రీస్తు అవతారము అనగా ఏమి ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 10:13 AM | powered by PmWiki (pmwiki-2.3.3)