Waters of Life

Biblical Studies in Multiple Languages

Search in "Telugu":

Home -- Telugu -- John - 001 (Introduction)

This page in: -- Albanian -- Arabic -- Armenian -- Bengali -- Burmese -- Cebuano -- Chinese -- Dioula -- English -- Farsi? -- French -- Georgian -- Greek -- Hausa -- Hindi -- Igbo -- Indonesian -- Javanese -- Kiswahili -- Kyrgyz -- Malayalam -- Peul -- Portuguese -- Russian -- Serbian -- Somali -- Spanish -- Tamil -- TELUGU -- Thai -- Turkish -- Twi -- Urdu -- Uyghur -- Uzbek -- Vietnamese -- Yiddish -- Yoruba

Next Lesson

(NOTE: You cannot see the Telugu script on this page?
Then please check this external link for possible help: Multilingual support)
యోహాను - చీకటిలో వెలుగు ప్రకాశించుట
క్రీస్తు యేసు యొక్క యోహాను సువార్త పఠనము

పరిచయము


క్రీస్తు తన శిస్యులను తనకు సాక్ష్యులుగా పిలిచియున్నాడు. క్రీస్తు తన వ్యక్తిగత కథను వ్రాయలేదు లేక తన సంఘాలకు ఏ విధమైన ఉత్తరాలను వ్రాయలేదు. అయితే తన స్వభావమును బట్టి శిష్యులు తనను వెంబడించారు. తన శిష్యులు క్రీస్తు ప్రేమను, మానవత్వముని, మరణమును మరియు క్రీస్తు పునరుత్థానమును దేవుని సత్యమందు కృపను పొందియున్నారు. మత్తయి, మార్క్ మరియు లూకా తమ పత్రికలో క్రీస్తు కార్యములను,క్రీస్తు రాజ్యమును వ్రాసియున్నారు, అయితే యోహాను మాత్రమూ క్రీస్తు అంతరంగ స్వభావమును మరియు ఆయన ప్రేమను వ్రాసియున్నాడు. అందునుబట్టే యోహాను సువార్త అన్ని సువార్తలకంటే గొప్ప సువార్తగా పిలువబడుచున్నది.

ఈ సువార్త యొక్క గ్రంధకర్త ఎవరు?

రెండవ సెంచరీ కాలములో ఉన్న పెద్దలు యోహాను అనగా క్రీస్తు శిస్యులలో ఒకడు ఈ సువార్తను వ్రాసియున్నాడని చెప్పియున్నాడు. యోహాను ఈ సువార్త లో తన పేరును కానీ లేక తన సహోదరుడైన యాకోబు పేరును కూడా ఎక్కడా వ్రాయలేదు, ఎందుకంటె తమ పేరులను క్రీస్తు పేరుతో కూడా వ్రాయుటకు యోగ్యుడుకాదని యెంచియున్నాడు. (98-117 AD)బిషప్ యురేనస్ అనువారు కూడా క్రీస్తు యొక్క శిస్యుడైన యోహాను ఈ సువార్తను వ్రాసియున్నాడని చెప్పియున్నారు.

అయితే కొంతమంది ఈ యోహానును క్రీస్తు యొక్క శిష్యుడు కాదని అయితే ఎపేసుస్ అనే సంఘములో ఒక పెద్ద అని చెప్పియున్నారు. అయితే వీరు కేవలము కల కానీ చెప్పారు కానీ దేవుని ఆత్మచేత నింపబడలేదు. అందుకే " తన మహిమతో" అని క్రీస్తు ని చూచిన ఒక సాక్షిగా చెప్పియున్నాడు. అందుకే తన చివరి వ్రతాలలో ఈ విధముగా చెప్పియున్నాడు " ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే; ఇతని సాక్ష్యము సత్యమని యెరుగుదుము" (యోహాను 21:24). అందుకే క్రీస్తు పట్టుబడే ముందు రాత్రి తన రాత్రి భోజనమందు యోహానును తన రొమ్ముమీద అనుకునేను. మరియు యోహాను మాత్రమే ధైర్యముగా క్రీస్తును ఎవరు పెట్టుకుంటారో అని అడిగిన వాడు , " అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు ప్రభువా, వాడేవాడని ఆయనను అడిగెను" (యోహాను 13:25).

క్రీస్తు యోహానును పిలిచిఉన్నప్పుడు ఆటను చాలా యవ్వనకాలంలో ఉన్నాడు. తన 12 మంది శిష్యులందరిలో చిన్నవాడుగా ఉన్నాడు తన వ్రిత్తి చేపల పట్టు జాలరిగా ఉన్నాడు. తిబెరిస్ అను ఒక నది ఒడ్డున తన కుటుంబసభ్యుల తో బేత్సయిదా అను ఊరిలో నివసించువాడు గా ఉన్నాడు. పేతురు, నథానిఎల్, మరియు తన సహోదరుడైన యాకోబు తో కలిసి యొర్దాను నది దగ్గరకు బాప్తిస్మమిచ్చు యోహాను దగ్గరకు వెళ్లియున్నారు. ఆన్నస్ అను యాజకునికి ఇతను బంధువుగా కనపడుతున్నాడు ఎందుకంటె ఇతను కూడా భావనములోనికి ప్రవేశించువాడుగా ఉన్నాడు కనుక ఇతను కూడా యాజక కుటుంబమునకు చెందినవాడిగా ఉన్నాడు. కనుకనే వేరే సువార్తలలో వ్రాసినట్లు గా కాక క్రీస్తును గురించి ఒక దేవుని గొర్రెపిల్ల గా చెప్పియున్నాడు.

యోహాను మరియు ఇతర ముగ్గురు సువార్తికుల మధ్యన ఉన్న సంబంధము

యోహాను సువార్తను వ్రాసే మునుపే మత్తయి, మార్కు మరియు లూకా సువార్తలు వ్రాయబడి సంఘములలో వాడబడుచున్నాయి. ఈ మూడు సువార్తలు హీబ్రూ భాష యొక్క నిజమైన అర్థమును తెలిసికొని వ్రాసియున్నది, అదేవిధముగా క్రీస్తు యొక్క ప్రతి మాటను ఈ సువార్తలో క్లుప్తముగా వ్రాయబడియున్నారు. అదేవిధముగా లూకా అను వైద్యుడు యేసు యొక్క నిజమైన సాక్షిగా ఉన్నాడు.

యోహాను పైన తెలిపిన వాటింకి ఇంకా ఎక్కువైనా వాక్యములను జోడించువానిగా ఉన్నాడు. సంఘములో చెప్పబడు ప్రతి వాక్యమును మరి మరి గుర్తుకుచేయువాటిగా యోహాను లేడు. అయితే తక్కిన మూడు సువార్తలు క్రీస్తు గాలిలియాలో చేసిన కార్యాలను చెప్పియున్నాడు. యెరూషలేమును క్రీస్తు ఒక్కసారికి గురిచేసినట్లు, కనుక యేసు మరణమునకు ముందు యెరూషలేములో క్రీస్తు ఏమి చేసియున్నదో తెలియపరచియున్నాడు. అదేవిధముగా క్రీస్తు కొందరు వ్యతిరేకించినా ఊదా తనను తానూ దేశ రాజధానిలో తనను కనపరచికొనియున్నాడు. ఎప్పుడైతే క్రీస్తు ను వారు సిలువకు అప్పగించియున్నారో అప్పు ఆయనను వ్యతిరేకించినవారిగా ఉన్నారు. అయితే యెరూషలేములో ఉండు యూదులకు యేసు సువార్తను ప్రకటించి వారిని తనకు ముఖ్యులుగా చేసియున్నాడు.

ఈ నాలుగవ సువార్త యేసు చేసిన అద్భుత కార్యాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు, అయితే కేవలము ఆరు సార్లు మాత్రమే జ్ఞాపకములోనికి తెచ్చియున్నాడు. అయితే యోహాను దీని ద్వారా ఏమి చెప్పాలనుకున్నాడు? క్రీస్తు మాటలను ఈ విధముగా తెలియపరచుచున్నాడు. "నేనే" అదేవిధముగా ఈ మాట ద్వారా దేవుని ఉన్నతిని గురించి చెప్పియున్నాడు. మొదటి మూడు సువార్త పత్రికలు క్రీస్తు అద్భుతములను గూర్చి వ్రాస్తే ఈ యోహాను మాత్రమే క్రీస్తు యొక్క వ్యక్తిత్వమును గూర్చి వ్రాసియున్నాడు. అయితే యోహాను క్రీస్తు యొక్క మాటలను వ్యక్తిత్వాన్ని ఎక్కడ నుంచి పొందియున్నారు? అయితే పెంతికోస్తు దినముతరువాత పరిశుద్దాత్ముడు వీటిని యోహానును తెలియచేసియున్నాడు. మనము గమనించినట్లయితే క్రీస్తు సిలువవేయబడి పునరుత్థానుడై లేచిన తరువాత పరిశుద్ధాత్ముడు మన మధ్యకు వచ్చు వరకు క్రీస్తు మాటలను ఏ శిష్యునికి కూడా అర్థము కాలేదు. అందుకనే క్రీస్తు "నేనే" అను మాటను ఈ విధముగా మనకు తెలియపరచియున్నాడు.

యోహాను క్రీస్తు మాటలను వెలుగు మరియు చీకటి అని ఆత్మ శరీరము అని సత్యము అబద్దమని మరియు మరణము జీవము అని అలానే తక్కువ ఎక్కువ అని కూడా వ్రాసియున్నాడు. ఈ మాటలను మనము ఏ ఇతర సువార్తలలో కూడా చూడలేము. అయితే గ్రీకు అను ప్రదేశములో యోహాను ఉన్నప్పుడు దేవుని ఆత్మ అతనికి చాలా ఏళ్ళ తరువాత ఈ యేసు మాటలను బయలుపరచియున్నాడు. కనుకనే క్రీస్తు కేవలము హీబ్రూ భాషలోనే మాట్లాడక గ్రీకు భాషలో కూడా ప్రకటించియున్నాడని తెలుసుకోవచ్చు.

యోహాను సువార్త యొక్క గురి?

యోహాను క్రీస్తును కేవలము ఒక ఫిలోసోఫిగా మాత్రమే కాక క్రీస్తు యొక్క పుట్టుకను తన బలహీనతను మరియు కలువారిలో ఉన్నప్పుడు ఉన్న దాహమును గూర్చి కూడా వ్రాసియున్నాడు. కనుక యేసు కేవలము యూదులకు మాత్రమే ఒక రక్షకుడు అని కాక భూమిమీద ఉన్న ప్రతి మనిషికి కూడా ఆయన రక్షకుడు అని తెలియపరచియున్నాడు, ఎందుకంటె క్రీస్తు సమస్త మానవుల పాపములకొరకు తన రక్తమును కార్చిన దేవుని గొర్రెపిల్ల అని వ్రాసియున్నాడు.

కనుక వీటి ద్వారా మనుషుల హృదయాలను కదిలించి దేవుని సువార్తను వినునట్లుగా అదేవిధముగా క్రీస్తు దేవుని కుమారుడు అని తెలియపరచినట్లుగా ఈ సువార్త యొక్క ముఖ్య గురి గా ఉన్నది. క్రీస్తు యొక్క నిత్యజీవము ఈ భూమిమీద మరియు ఆయన వ్యక్తిత్వము మానవత్వము పైన మరియు ఆయన అధికారము తన బలహీనత ద్వారా చూపబడియున్నది. అదేవిధముగా దేవుడు క్రీస్తు ద్వారా ప్రతి మానవునికి దగ్గరగా ఉన్నాడు. అయితే యోహాను యొక్క గురి క్రీస్తును గురించి ఒక ఫిలొసొపెర్ గా కాక విశ్వాసమును పరిశుద్ధాత్మద్వారా అందరికి ఇచ్చువాడుగా ఉన్నాడు. అందుకే ఈ విధముగా చెప్పియున్నాడు. " యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మిఆయన నామమందు జీవము పొందునట్లు ఇవి వ్రాయబడెను" (యోహాను 20:31). కనుకనే యోహాను సువార్తలో క్రీస్తు విశ్వాసమును మైర్యు ఆయన నిత్యజీవమును ప్రచురించినది.

ఎవరికి ఈ యోహాను సువార్త వ్రాయబడియున్నది?

ఈ పుస్తకము క్రీస్తును తెలియపరచి అదేవిధముగా అన్యులకు వ్రాయబడక కేవలము సంఘములను బలపరచుటకు ఈ సువార్త వ్రాయబడియున్నది. అనటోలియా అను సంఘములో పౌలు ప్రారంభించి అదేవిధముగా పేతురు విడువబడిన సంఘములకు ఈ పుస్తకమును వారికి వివరించియున్నాడు. పేతురు మరియు పౌలు మృతిపొందిన తరువాత ఈ పుస్తకమును యోహాను నీరో అను రోమా లో నికి దీనిని పరిచయము చేసాడు. ఈ పుస్తకంలోని రెండవ మరియు మూడవ అధ్యాయములను చదివినట్లయితే అపొస్తలులు చేసిన క్రీస్తు ప్రేమ అనే బోధను మనము క్లుప్తముగా అర్థము చేసుకోవచ్చు.

బాప్తీస్మమిచ్చు యోహాను యొక్క శిష్యులు కూడా అనటోలియా లో ఉంది వారు కూడా పశ్చత్తాపము తెలియపరచినవారిగా ఉన్నారు. వారు ఇంకా వాగ్దాన మెస్సియా కొరకు ఎదురుచూస్తూ ఇంకా ఆయన రాలేదు అని భావిస్తున్నారు. కనుక యోహాను క్రీస్తు వ్యక్తిత్వాన్ని మరియు తన రక రకాల తేడాలను చెప్పియున్నాడు. కనుకనే "తండ్రియొక్క ఏకైక కుమారుని యొక్క మహిమ మనము చూస్తున్నాము" అని చెప్పియున్నాడు.

యోహాను ఈ సువార్తను ముఖ్యముగా అన్యుల కొరకు ఉద్దేశించినట్లుగా చెప్పాడు, ఎందుకంటె యూదులు వారికి తమ జీవితములగురించి క్లుప్తముగా వివరించలేదు కనుక వారికి ఈ పత్రిక ద్వారా సువార్తను బోధించుచున్నాడు. అయితే యేసు ఆరామిక్ భాషలో వ్రాసినట్లు యోహాను ఇతర సువార్తీకులు గ్రీకు భాషను తర్జుమా చేసినట్లు ఈ సువార్త మీద ఆధారపడలేదు. అయితే దేవుని ఆత్మచేత క్రీస్తు సంఘమునకు గ్రీకు భాషను మరియు వారికి కలుగు స్వతంత్రమును గూర్చి చెప్పియున్నాడు. అదేవిధముగా ఈ సువార్త క్రీస్తు యొక్క తగ్గింపు మనస్సును తెలియపరచియున్నది. కనుకనే ప్రతి యవ్వనస్తుడు తెలుసుకొనునట్లు పరిశుద్ధాత్ముడు అందరికి వివరించియున్నాడు.

ఈ సువార్త ఎప్పుడు వ్రాయబడినది?

పురాతత్వ శాస్త్రమునకు ఐగుప్తులో 100 AD నడిపించిన యేసు కు మనము కృతజ్ఞులమై ఉన్నాము , ఎందుకంటె ఈ సమయములోనే ఈ యోహాను సువార్తలు వ్రాయబడియున్నవి. అందుకనే త్రవ్వినట్లుగా 100 AD లోనే ఈ యోహాను సువార్త ఈ సమయములనే అందరికీ తెలియపరచియున్నది ఆసియా ఖండములోనే కాక ఉత్తర ఆఫ్రికా దేశాలలో కూడా తెలిసియున్నది. రోమా లో కూడా ఇది తెలియదని మనము అనుకోకూడదు. కాబట్టి ఎవన్నిటిని ఆలోచిస్తే ఖశ్చితంగా యోహాను ఈ సువార్తను వ్రాసినట్లుగా మనము తెలుసుకోవచ్చు.

ఈ సువార్త యొక్క అంగీకారము ఏంటి?

మనిషికి ఇది క్రమబద్దీకరముగా ప్రవేశ పెట్టుటకు సులువుగా లేదు. అదేవిధముగా ఈ యోహాను సువార్తను భాగాలుగా విభజించుటకు చాలా కష్టమైన పనిగా ఉన్నది. అయినప్పటికీ ఈ క్రింది వాటిని జోడిస్తున్నాము

  1. ప్రకాశించబడిన వెలుగు (1:1 - 4 :54)
  2. చేయీకటిలో వెలుగు కలిగెను చీకటి దానిని ఎరిగియుండలేదు (5:1 - 11:54)
  3. వెలుగు అపొస్తలుల చోటు ప్రకాశించుచున్నది (11:55 - 17:26)
  4. వెలుగు చీకటిని జయించుట (18:1 - 21:25)

సువార్తీకుడైన యోహాను తన ఆలోచనలను ఒక చైన్ కు పెట్టిన రింగులవలె చూపిస్తున్నాడు, దానిని ఒక ఆత్మీయ సంబంధమైన ఒకటి లేదా రెండు ముఖ్య వాక్యములుగా చేసియున్నాడు. రింగులన్నీ ఒకదానికి ఒకటి వేరుగా లేకున్నప్పటికీ వాటి అర్థము మాత్రమూ విభజుంచినట్లుగా ఉన్నది.

యోహాను హీబ్రూ ఆలోచనలతో గ్రీకు భాషను ఒక ఆత్మీయ సంబంధముతో అదేవిధముగా ఒక యూనిటీ గా చూపించుయున్నాడు. కనుక పరిశుద్దాత్మ దేవుడు ఈ సువార్తను మనకు క్లుప్తముగా తెలియపరచియున్నాడు. కనుక ఇది మనకు ఒక జ్ఞానమును మరియు తెలివిని దయచేసి ఔషదంగా ఉన్నది. కునుకు ఎవరైతే ఈ పుస్తకమును చదువుతారా వారు ఖశ్చితముగా దేవుని కుమారుడైన క్రీస్తు ఎదుట తగ్గించబడి దేవుడిచ్చు నిత్యజీవమునకు పాత్రులుగా ఉండెదరు.

ప్రశ్నలు

  1. నాలుగవ సువార్త యొక్క గ్రంధకర్త ఎవరు ?
  2. నాలుగవ సువార్తకు మరియు తక్కిన మూడు సువార్తలకు మధ్య ఉన్న బంధము ఏమి ?
  3. యోహాను సువార్త యొక్క గురి ఏమి ?
  4. ఎవరికి ఈ సువార్త వ్రాయబడియున్నది ?
  5. దీనిని ఏవిధముగా భాగించవచ్చు లేదా విడిగా చేయవచ్చు ?

www.Waters-of-Life.net

Page last modified on October 09, 2018, at 10:06 AM | powered by PmWiki (pmwiki-2.3.3)